రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనకు సంబంధించి కమలనాథన్ కమిటీ నివేదిక ఢిల్లీకి చేరింది.
సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజనకు సంబంధించి కమలనాథన్ కమిటీ నివేదిక ఢిల్లీకి చేరింది. నివేదికను మొదట ఈ మెయిల్ రూపంలో, తరువాత కొరియర్‌లో పంపించింది. సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి నోటిఫై చేసిన తరువాత ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల కేడర్ సంఖ్యను నిర్దారించనున్నారు.
ఇటీవల కమలనాథన్ కమిటీ ఇచ్చిన ఉద్యోగుల వివరాలు అప్పటి వరకు ప్రభుత్వం వివిధ సమయాల్లో మంజూరు చేసిన ఉద్యోగాలు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, ఖాళీలపైనే వివరించింది. రాష్ట్రస్థాయి కేడర్ అధికారులను విభజించడానికి ముందు కేడర్ సంఖ్య నిర్దారించాలని ఇది కొన్నింటికి సంబంధించి జనాభా నిష్పత్తిలో, మరికొన్ని భౌగోళిక పరిస్థితి ఆధారంగా నిర్దారించాలని నిర్ణయించారు.