హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను కమలనాథన్ కమిటీ గురువారం విడుదల చేసింది. తెలంగాణ సచివాలయంలో సమావేశమైన కమలనాథన్ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
19 పేజీల్లో పొందుపరిచిన ఈ మార్గదర్శకాలను కమిటీ తన వెబ్సైట్ లో పెట్టింది. 2014 జూన్ 1 వరకు ఉన్న సీనియారిటీ ఆధారంగా ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించినట్టు కమిటీ తెలిపింది. ఉద్యోగులందరికీ ఆప్షన్లు ఇచ్చినట్టు వెల్లడించింది. నాలుగైదు రోజుల్లో ఉద్యోగులకు ఆప్షన్ పత్రాలు ఇచ్చే అవకాశముంది.
ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు విడుదల
Published Thu, Oct 30 2014 7:20 PM | Last Updated on Sat, Sep 2 2017 3:37 PM
Advertisement
Advertisement