అధికారుల వ్యవహారశైలిపై కేసీఆర్ అసంతృప్తి
హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంలో ఉద్యోగుల విభజన విషయంలో అధికారుల వ్యవహారశైలిపై టీఆర్ఎస్ శాసనసభ పక్షం నాయకుడు కేసీఆర్ తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. అధికారుల సరైన చర్యలు పాటించకపోవడం, తొందరపాటు చర్యల వల్ల రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం నెలకొంటోందని కేసీఆర్ అన్నట్టు సమాచారం.
రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత పరిష్కరించవలసిన సమస్యను ముందుగానే వివాదం చేశారని అధికారులను కేసీఆర్ మందలించినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల విభజన అంశంలో సరైన ప్రమాణాలను పాటించాలని అధికారులకు కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. ఉద్యోగుల విభజన అంశంలో గత రెండు రోజులుగా ఇరుప్రాంతాల ఉద్యోగ సంఘాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.