తెలంగాణకు అన్యాయం జరిగితే మరో ఉద్యమం
టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రా న్ని పోరాడి సాధించుకున్నామని, ఉద్యోగుల విభజనలో అన్యాయం జరిగితే మరో ఉద్యమం చేస్తామని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. స్థానిక టీఎన్‌జీవో ఫంక్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన సభ్యత నమోదు కార్యక్రమం, ఆ తర్వాత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలన్నారు.
ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో అదనంగా రెండు గంటలు విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణను విడిచి వెళ్లాల్సిందేనని అన్నారు. లేదంటే ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటుకు సార ్థకత ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ప్రశంసనీయమని చెప్పారు. టీఎన్‌జీవో రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. స్థానికత ఆధారంగానే విభజన జరగాలని, ఆప్షన్లు ఇస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
టీఎన్‌జీవో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కూరపాటి రంగరాజు, గంగవరపు నరేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జరిగిన మలి దశ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడం సరికాదన్నారు. పోలవరం ఎత్తు తగ్గించే వరకు ఉద్యమించాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కోశాధికారి గుంటుపల్లి వేణుగోపాల్, హైదరాబాద్ నగర అధ్యక్షుడు వెంకట్.
గణాంక ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు వేణుమోహన్, టీఎన్‌జీవో కేంద్ర సంఘం సభ్యులు లక్ష్మినారాయణ, సోమయ్య, రామారావు, కె.శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వల్లోజు శ్రీనివాసరావు, ఆర్.వి.ఎస్ సాగర్, కోశాధికారి రమణయాదవ్, దుర్గాప్రసాద్, వెంకటేశ్వర్లు, రామయ్య, సరస్వతి, పుల్లమ్మ పాల్గొన్నారు.