♦ సెప్టెంబర్ 15న భేటీకి ఇరు రాష్ట్రాల అధికారుల నిర్ణయం
♦ ఉద్యోగుల విభజనపై మాత్రం ఏకాభిప్రాయం
సాక్షి, అమరావతి:
ఆర్టీసీ ఉమ్మడి ఆస్తుల పంపకంపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య ఏకాభి ప్రాయం రాలేదు. విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో ఉమ్మడి బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావే శానికి ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఎండీలు మాలకొండయ్య, రమణరావు, కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారులు ఆనందరావు, పాటిల్ హాజర య్యారు. బోర్డు సమావేశానికి ముందు తెలంగాణ అధికారులతో ఏపీ ఆర్టీసీ అధికారులు చర్చలు జరి పారు. 14 ఉమ్మడి ఆస్తులలో వాటా ఇవ్వాలని ఏపీ అధికారులు నివేదిక అందించారు. అయితే కేంద్రం గతేడాది హైదరాబాద్‌లోని బస్ భవన్ మాత్రమే ఉమ్మడి ఆస్తిగా ప్రకటించిందని తెలంగాణ అధికారులు తెలిపారు. 9, 10 షెడ్యూళ్ల ఆస్తుల పంపకాలు దామాషా ప్రకారం జరగాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని ఏపీ అధికారులు గుర్తుచేశారు.
సెప్టెంబర్ 15న మరోమారు బోర్డు సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు. ఉద్యోగుల విభజనపై మాత్రం ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. జూన్ 2016 నాటికి ఇరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకుగాను ఉద్యోగుల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. సూపర్‌వైజర్ల స్థాయిలో తొలుత ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్లను పరిశీలించనున్నారు.
ఉమ్మడి ఆస్తుల్లో 58 శాతం దక్కాల్సిందే: ఏపీఎస్‌ఆర్టీసీ యూనియన్ల డిమాండ్ ఆర్టీసీ విభజన తర్వాత ఆంధ్రాకు 14 ఉమ్మడి ఆస్తులలో 58 శాతం వాటా దక్కాల్సిందేనని ఏపీఎస్‌ఆర్టీసీ యూనియన్లు నేషనల్ మజ్దూర్, ఎంప్లాయిస్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి.
కొలిక్కిరాని ఆర్టీసీ ఆస్తుల పంపిణీ
Published Fri, Aug 25 2017 2:46 AM | Last Updated on Tue, Sep 12 2017 12:56 AM
Advertisement
Advertisement