'కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతే ఉద్యోగుల విభజన'
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అంశంలో రాష్ట్రస్థాయి ఉద్యోగుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీపై కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కమల్‌నాథన్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సీఎస్) పీకే మహంతి పాల్గొన్నారు.
పూర్తి స్థాయి ఉద్యోగుల విభజన కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతే జరుగుతుందని కేంద్రానికి సీఎస్ మహంతి తెలిపారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మహంతి..వారం రోజుల్లో విభజన పక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.