అన్యాయం జరిగితే మళ్లీ ఉద్యమం
కమలనాథన్ కమిటీ విడుదల చేసిన మార్గదర్శకాలపై తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి అక్టోబర్ 31లోగా ఉద్యోగుల విభజన పూర్తి చేయాలని జేఏసీ నాయకుడు దేవీప్రసాద్ అన్నారు. ఎవరికీ ఆప్షన్లు ఇవ్వద్దని, స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని డిమాండ్ చేశారు. తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిన వారిపై న్యాయవిచారణ జరపాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ జీఏడీ విభజనతో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా దీనిలో భాగస్వామ్యం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల విభజన మొత్తం స్వతంత్ర సంస్థతో నిర్వహించాలని, తమకు మాకు అన్యాయం జరిగితే మరోసారి ఉద్యమిస్తామని జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ స్పష్టం చేశారు.