ఖమ్మం జడ్పీసెంటర్ : తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఆదర్శవంత పాలన సాగాలంటే కేంద్రం ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని టీఎన్‌జీఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఖమ్మంలోని టీఎన్‌జీఓ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 9, 10 షెడ్యూల్‌లో ఉన్న ఉమ్మడి సంస్థను ఇప్పటి వరకు విభజించలేదన్నారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలో అనేక అంశాల్లో కేంద్రం వ్యవహరిస్తున్న వైఖరి వల్ల ఉద్యోగుల్లో భయాందోళన నెలకొందన్నారు. డిసెంబర్ 31 వరకు ఉద్యోగుల పంపకాలు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. 80 ప్రభుత్వ ప్రధాన శాఖలు ఉంటే 30 శాఖల్లో మాత్రమే కేడర్ స్ట్రెంట్త్ మాత్రమే విభజన జరిగిందని, హెచ్‌ఓడీలు శాఖాధిపతులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. కేడర్ స్ట్రెంట్త్ పంపని అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఇరు ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్యమంత్రులు మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అవసరమైతే సూపర్ న్యూమరి పోస్టులు ఏర్పాటు చేస్తామని చెబుతోందని, కానీ ఆంధ్రలో ఒక్కటి కూడా ఏర్పాటు చేయ టం లేదని అన్నారు. ప్రజల మధ్య వైరుధ్యాలను తొలగించేందుకు తెలంగాణ టీడీపీ నేతలు కృషిచేయాలన్నారు. 1-7-2013 నుం చి ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు.
సంఘం కేంద్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. కాకతీయ మిషన్ ద్వారా చెరువుల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉద్యోగులు ఒకరోజు శ్రమదానం చేయాలన్నా రు. సమావేశంలో టీఎన్‌జీఓస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కూరపాటి రంగరాజు, రామయ్య, నాయకులు లక్ష్మీనారాయణ, వల్లోజు శ్రీనివాస్, సాగర్, వెంకటేశ్వర్లు, రమణయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శపాలన అందించాలి
Published Tue, Dec 16 2014 3:42 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM
Advertisement
Advertisement