రాష్ట్ర విభజనపై అధికారులు వేగంగా కసరత్తులు పూర్తి చేస్తున్నారు. ఏ రాష్ట్రానికి ఏమి కేటాయించాలో అన్నీ చకచకా చేసేస్తున్నారు.
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై అధికారులు వేగంగా కసరత్తులు పూర్తి చేస్తున్నారు. ఏ రాష్ట్రానికి ఏమి కేటాయించాలో అన్నీ చకచకా చేసేస్తున్నారు. జూన్ రెండో తేదీని అపాయింటెడ్ డేగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగుల విభజనపై ప్రభుత్వం హడావుడి నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఉద్యోగులందరి స్థానికత వివరాలను అధికారులు మంగళవారం ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచారు. అభ్యంతరాలు ఉంటే ఒక్కరోజులోనే తెలపాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.
కాగా రాష్ట్రవిభజన నేపథ్యంలో జూన్ 2నుంచే ఇరు రాష్ట్రాల్లో ఉద్యోగులు వేరు వేరుగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఉద్యోగ విభజనకు సంబంధించి ముందస్తుగా మార్గదర్శకాలు జారీ చేశారు. స్థానికత ఆధారంగా సుమారు 50 వేలమంది ఉద్యోగుల విభజన చేపట్టే అవకాశం ఉంది.