రాష్ట్ర విభజన జరిగిపోయింది : ఎర్రబెల్లి | Andhra pradesh state bifurcation, says Errabelli Dayakar Rao | Sakshi
Sakshi News home page

విభజన జరిగిపోయింది : ఎర్రబెల్లి

Published Tue, Dec 17 2013 9:35 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

రాష్ట్ర విభజన జరిగిపోయింది : ఎర్రబెల్లి - Sakshi

రాష్ట్ర విభజన జరిగిపోయింది : ఎర్రబెల్లి

రాష్ట్ర విభజన జరిగిపోయిందని, తెలంగాణ ఆగదని తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.... టి. బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో ఆ బిల్లు ఆమోదించేందుకు అందరు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే సీమాంధ్ర ప్రాంతంలోని అన్ని రాజకీయా పార్టీల నాయకులకు ఆయన ఆమోదించాలని ఆయన సూచించారు. టి.బిల్లు తుది దశకు చేరుకుందన్నారు.

 

అయితే తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న టి. బిల్లుపై మాట్లాడలేదని పలు మీడియా కథనాలను ఎర్రబెల్లి ఈ సందర్భంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు విభజనపై వెనక్కి వెళ్లామనో, సమైక్యమనో మాట్లాడలేదని, అయితే టి.బిల్లులోని లోపాలను ఎత్తి చూపిన సంగతిని ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి గుర్తు చేశారు. అలాగే అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు ఓపిక పట్టాలని ఆయన తమ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులను హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement