T.bill
-
'తెలంగాణ ఏర్పాటుపై సీమాంధ్రలో వ్యతిరేకత లేదు'
తెలంగాణ ఏర్పాటుపై సీమాంధ్రలో ఎలాంటి వ్యతిరేకత లేదని మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి తన అధికార, ధనబలంతోనే లేని సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉసిగొల్పారని ఆయన ఆరోపించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కావాలనే కిరణ్ రెచ్చగొట్టారన్నారు. తెలంగాణ ఏర్పాటును చివర వరకు అడ్డుకున్నారన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభలలో పాస్ కాగానే సీమాంధ్రకు చెందిన నేతలు తనకు శుభాకాంక్షలు తెలిపారన్న సంగతిని ఈ సందర్భంగా డీఎస్ గుర్తు చేశారు. తెలుగు ప్రజల ఐక్యతకు కిరణ్ కుమార్ రెడ్డే పెద్ద అడ్డంకి అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజలకు సోనియా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. 60 ఏళ్లుగా తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సోనియా సాకారం చేశారన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు దేవత అని అభివర్ణించారు. -
ఒంగోలు నుంచే పోటీ చేస్తా కానీ... ?
తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ఒంగోలు ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన ఒంగోలులో విలేకర్లతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ పట్టుకోవడం లేదన్నారు. టి.బిల్లుపై కాంగ్రెస్ పార్టీ తాను పట్టిన కాళ్ల కుందేలుకు మూడే కాళ్లు అన్న తరహాలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని చూసిన మాపై వేటు వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే క్రమంలో సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం మరో స్వాతంత్ర్య పోరాటమని ఆయన అభివర్ణించారు. రానున్న ఎన్నికలలో ఒంగోలు నుంచి పోటీ చేస్తా కానీ ఏ పార్టీ తరఫున అనేది మాత్రం ఇప్పుడే వెల్లడించలేనని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. -
సవరణలు తెస్తాం.. మెడలు వంచుతాం
టీ బిల్లుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కాంగ్రెస్ సమన్యాయం చేయకపోతే మేం అధికారంలోకి వచ్చాక చేస్తాం ప్రజల ఆలోచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం రాజధాని, దాని నిర్మాణంపై కేంద్రంతో మాట్లాడతాం తెలంగాణ బిల్లును శీతాకాల సమావేశాల్లో పెట్టాలన్నదే మా అభిప్రాయం సాక్షి, న్యూఢిల్లీ: తె లంగాణ, సీమాంధ్రకు న్యాయం జరిగేలా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో సవరణలకు ప్రభుత్వం మెడలు వంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయకపోతే, బీజేపీ అధికారంలోకి వచ్చాక చేస్తామన్నారు. రాష్ట్ర విభజన అయ్యే వరకు పొత్తులపై చర్చ లేదని తేల్చి చెప్పారు. శనివారమిక్కడ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అనంతరం కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘పార్లమెంటులో బీజేపీ వైఖరి మారదు. తెలంగాణ, సీమాంధ్రకు న్యాయం జరిగేలా కచ్చితంగా బిల్లులో కొన్ని సవరణలు తీసుకు వస్తాం. ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పాం. బీజేపీ అధికారంలో ఉన్నప్పడు మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఆరు రాష్ట్రాల్లో ప్రజలు సంతోషంగా మిఠాయిలు పంచుకున్నారు. కానీ ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో రెండు ప్రాంతాలు సంతోషంగా ఉండేలా, సమస్యలు పరిష్కారమయ్యేలా తెలంగాణ చిరకాల వాంఛ నెరవేరే విధంగా కృషి చేస్తాం’’ అని చెప్పారు. కాంగ్రెస్ రెండు ప్రాంతాలకు సమన్యాయం చేస్తుందని నమ్ముతున్నారా అని ప్రశ్నించగా.. ‘సమన్యాయం చేయిస్తాం’ అని బదులిచ్చారు. సమన్యాయం చేయకపోతే అని అడగ్గా.. ‘అధికారంలోకి వచ్చాక చేస్తాం’ అని చెప్పారు. బిల్లును యథాతథంగా పార్లమెంటులో పెడితే సమర్థిస్తారా అని అడగ్గా.. ‘‘అన్నీ చెబితే ఎట్లా..’’ అని ఎదురు ప్రశ్నించారు. ‘‘మా ఆలోచనలు, ప్రజల ఆలోచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం. రాష్ట్ర రాజధాని, దాని నిర్మాణం, సమస్యలు, అనేక అంశాలు ఉన్నాయి. వాటిపై కేంద్రంతో మాట్లాడతాం. సుష్మా సహా మా పార్టీ పెద్ద నేతలతో మాట్లాడాం. తెలంగాణ బిల్లును శీతాకాల సమావేశాల్లో పెట్టాలన్నదే మా అభిప్రాయం’’ అని చెప్పారు. బిల్లు ఆమోదం పొందకుంటే అందుకు బీజేపీదే బాధ్యత అని కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘దాంతో.. బీజేపీకి ఏం సంబంధం..? విభజనపై మేం చాలా స్పష్టంగా ఉన్నాం’’ అని చెప్పారు. రాజ్‌నాథ్‌ను కలిసిన రఘురామ కృష్ణంరాజు.. వైఎస్సార్సీపీ బహిష్కృత నేత రఘురామ కృష్ణంరాజు, పారిశ్రామికవేత్త బస్వరాజ్ పాటిల్‌లు శనివారం కిషన్‌రెడ్డితో వెళ్లి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. బీజేపీలో చేరేందుకు రాజ్‌నాథ్ ఆశీర్వాదాన్ని తీసుకున్నట్లు రఘురామ కృష్ణంరాజు చెప్పారు. హైదరాబాద్ వెళ్లాక కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకుంటానని చెప్పారు. రాష్ట్ర విభజను వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిటిషన్ వేసిన మీరు ఇప్పుడు విభజనకు మద్దతు ఇచ్చే బీజేపీలో చేరడం వైరుధ్యం కాదా అని విలేకరులు అడగ్గా.. ‘‘ఇందులో వైరుధ్యం లేదు. ఇరు ప్రాంతాలకు న్యాయం జరగాలి, రెండువైపులా సంతోషంగా ఉండే విభజనను సమర్థిస్తామని కిషన్‌రెడ్డి ఇప్పటికే చెప్పారు. ఒకరి కళ్లలో నీళ్లు వచ్చే విభజనను బీజేపీ ఏనాడూ సమర్థించలేదు’’ అని ఆయన బదులిచ్చారు. -
టీ బిల్లుపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల భిన్నాభిప్రాయాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శనివా రం ఇక్కడ జరిగిన ఓ సమావేశానికి హాజరైన వీరు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత బిల్లుపై రాష్ట్రపతి సుప్రీం కోర్టు సలహా కోరవచ్చని, లేదా మంత్రివర్గ నిర్ణయాన్ని ఆమోదించవచ్చని సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ చెప్పారు. మరో సీనియర్ న్యాయవాది టి.ఆర్.అంద్యార్జున మరో అభిప్రాయం వెలిబుచ్చారు. రాష్ట్రపతి మంత్రిమండలి నిర్ణయం మేరకు నడుచుకోవాల్సిందేనని చెప్పారు. బిల్లు సమగ్రతపై మాత్రమే ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని మరో సీనియర్ న్యాయవాది పీపీ రావు తెలిపారు. రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా పొందవచ్చు: నారీమన్ ‘‘తెలంగాణ బిల్లుపై నిర్ణయం తీసుకొనేందకు రాష్ట్రపతి వద్ద రెండు మార్గాలు ఉన్నాయి. బిల్లుపై సుప్రీం కోర్టు సలహా కోరవచ్చు. లేదంటే నేరుగా మంత్రివర్గం నిర్ణయం మేరకు నడుచుకోవచ్చు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కేంద్రం రాష్ట్ర అధికారాలను కూడా తీసుకుని కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు. ఆర్టికల్ 3 ఇందుకు పూర్తి అధికారం ఇచ్చింది. బిల్లు అసమగ్రంగా ఉందనడం సరికాదు. ఎలా అయినా పంపొచ్చు. ఆర్థిక మెమోరాండం వంటివి లేకపోయినా పరవాలేదు.’’ బిల్లు తీరుపై ఇప్పుడు కోర్టుకు వెళ్లొచ్చు: పీపీ రావు ‘‘బిల్లుపై రాష్ట్రపతి న్యాయ సలహా తీసుకోవచ్చు. లేదా ఆయనకు తోచిన అభిప్రాయాన్ని మంత్రిమండలికి చెప్పొచ్చు. కానీ మంత్రివర్గ నిర్ణయం ప్రకారం మాత్రమే నడుచుకోవాల్సి వస్తుంది. సుప్రీం కోర్టు సలహా తీసుకోవడం ఒక మార్గం మాత్రమే. ప్రస్తుత తరుణంలో బిల్లు సమగ్రంగా ఉందా లేదా అనే అంశంపై మాత్రమే సుప్రీం కోర్టులో సవాలు చేయవచ్చు. బిల్లుపై వెళ్లలేం. చట్టరూపం దాల్చాక బిల్లుపై కూడా వెళ్లవచ్చు.’’ రాష్ట్రపతి పాత్ర ఏమీ లేదు: టి.ఆర్.అంద్యార్జున ‘‘అసెంబ్లీ తిరస్కరించినా పార్లమెంటు బిల్లును ఆమోదించవచ్చు. ఇక్కడ రాష్ట్రపతి పాత్ర కూడా ఏమీ ఉండదు. కేంద్ర మంత్రి మండలి నిర్ణయం ప్రకారం నడుచుకోవాల్సిందే. కేంద్రం దానంతట అదే వెనక్కి తీసుకుంటే తప్ప బిల్లు ఆగకపోవచ్చు. పైగా, బీజేపీ కూడా మద్దతిస్తోంది. తెలంగాణ ప్రజలు 50 ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు. ప్రజలు కోరుకుంటే ప్రత్యేక రాష్ట్రమివ్వడంలో తప్పేమీలేదు.’’ -
'బిల్లు అసమర్ధంగా ఉందన్న విషయం వాస్తవమే'
ఢిల్లీ: తెలంగాణ బిల్లు అసమర్ధంగా ఉందన్న విషయం వాస్తవమేనని రాజ్యాంగ నిపుణుడు పి.పి.రావు తెలిపారు. రాష్ట్ర విభజన బిల్లుపై గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. అసెంబ్లీలో టి.బిల్లును వ్యతిరేకించడంతో మున్ముందు కేంద్రం బాధ్యాతాయుతంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని పి.పి.రావు తెలిపారు. ఈ విషయంలో కోర్టులో జోక్యం చేసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర అసెంబ్లీకి సమగ్రమైన బిల్లును పంపడం మంచిదని ఆయన సూచించారు. అసెంబ్లీకి బిల్లు అసమగ్రంగా పంపి.. విభజనపై పార్లమెంట్ కు సర్వాధికారాలు ఉన్నాయనడం సరికాదన్నారు. -
'మంత్రిని మార్చారు సరే టి.బిల్లు....'
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ మధుయాష్కి తనదైన శైలిలో విమర్శించారు. బుధవారం మధుయాష్కీ హైదరాబాద్‌లో మాట్లాడుతూ... కిరణ్ సీఎంగా మంత్రుల శాఖలను మార్చే అధికారం ఉండవచ్చు... కానీ తెలంగాణ బిల్లును మర్చే అధికారం మాత్రం ఆయనకు లేదని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందన్నారు. ఆ వెంటనే రాష్ట్రం ఏర్పాటు అవుతుందని, వెనువెంటనే ఇరు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయని మధు యాష్కి తెలిపారు. అయితే శాసన సభ వ్యవహరాల శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబును ఆ శాఖ నుంచి తప్పించి, వాణిజ్య శాఖను కట్టబెడుతూ సీఎం కిరణ్ ఆదేశాలు జారీ చేశారు. శాసన సభ వ్యవహారాల శాఖను ప్రాధమిక విద్యాశాఖ మంత్రి ఎస్.శైలజానాథ్‌కు అప్పగించారు. దాంతో టి. బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇలాంటి నిర్ణయాలు ఏమిటని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్‌తోపాటు గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సమైక్యవాది అని పేరుపడిన ముఖ్యమంత్రి టి. బిల్లుకు వ్యతిరేకంగా ఏమీ చేయలేరనే ఉద్దేశ్యంతో మధు యాష్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. -
'పొట్టి శ్రీరాములు తెలంగాణ ప్రజలకు ఆదర్శం'
-
'పొట్టి శ్రీరాములు తెలంగాణ ప్రజలకు ఆదర్శం'
తెలంగాణ ప్రజలకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆదర్శమని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ తెలిపారు. పొట్టి శ్రీరాములు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమని, ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పోరాడారని గుర్తు చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు సందర్భంగా జరిగిన చర్చలో భాగంగా ఈటెల మాట్లాడుతూ... 60 ఏళ్ల నిరీక్షణ ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాకారం అవుతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల పక్షాన పోరాడిన టీఆర్ఎస్ తరఫున బిల్లును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఏనాడూ తెలంగాణ ప్రజల మనస్సును దోచుకునే పని ఒక్కటి కూడా ఆంధ్ర పాలకులు చేయలేదని ఆయన గుర్తు చేశారు. ఇంతకాలం అన్నదమ్ముల్లా కలసి ఉన్నామని, రెండు రాష్ట్రాలుగా విడిపోయినా అలాగే ఉందామని ఈటెల చెప్పారు. తెలంగాణ ఉద్యమం సంకుచితమైంది కాదని ఈటెల రాజేందర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణకు మద్దతిచ్చేవారు సీమాంధ్రలో కూడా ఉన్నారని ఈటెల గుర్తు చేశారు. -
'మోడీ వస్తాడు... దేశాన్ని రక్షిస్తాడు'
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు జోస్యం చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ దేశ ప్రధాన పీఠాన్ని అధిష్టిస్తారన్నారు. మోడీ వస్తాడు. .. దేశాన్ని రక్షిస్తాడని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ... నరేంద్రమోడీయే దేశ ప్రధాని అన్న భావన రోజురోజూకు దేశవ్యాప్తంగా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనాకర్షణ పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించలేకపోయాయని తెలిపారు. ఆహార భద్రత... కాంగ్రెస్ పార్టీకి రాజకీయ భద్రత కల్పించ లేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. అందుకు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసిందనేందుకు అత్యుత్తమ ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ బిల్లుపై స్పష్టత ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇరు ప్రాంతాల ప్రజలకు కలిగిన అనుమానాలను నివృతి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేవారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను కాపాడే క్రమంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. -
అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు
తెలంగాణ బిల్లు నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు నేడు అసెంబ్లీలో పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం చేయనుంది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సభలో చర్చించాలని టీడీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనుంది. తెలంగాణపై చర్చ పూర్తి చేసి వెంటనే కేంద్రానికి పంపాలని కోరుతూ సీపీఐ వాయిదా తీర్మానం చేయనుంది. -
రాష్ట్ర విభజన జరిగిపోయింది : ఎర్రబెల్లి
రాష్ట్ర విభజన జరిగిపోయిందని, తెలంగాణ ఆగదని తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.... టి. బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో ఆ బిల్లు ఆమోదించేందుకు అందరు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే సీమాంధ్ర ప్రాంతంలోని అన్ని రాజకీయా పార్టీల నాయకులకు ఆయన ఆమోదించాలని ఆయన సూచించారు. టి.బిల్లు తుది దశకు చేరుకుందన్నారు. అయితే తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న టి. బిల్లుపై మాట్లాడలేదని పలు మీడియా కథనాలను ఎర్రబెల్లి ఈ సందర్భంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు విభజనపై వెనక్కి వెళ్లామనో, సమైక్యమనో మాట్లాడలేదని, అయితే టి.బిల్లులోని లోపాలను ఎత్తి చూపిన సంగతిని ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి గుర్తు చేశారు. అలాగే అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు ఓపిక పట్టాలని ఆయన తమ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులను హితవు పలికారు. -
'సమైక్య రాష్ట్రంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు'
సమైక్య రాష్ట్రంలో ఇవే చివరి శాసన సభ సమావేశాలని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ... తెలంగాణ బిల్లు వెంటనే శాసన సభలో ప్రవేశపెట్టాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేసే అధికారం పార్టీలకు లేదని స్పష్టం చేశారు.ఈ రోజు శాసన సభలో తెలంగాణ బిల్లుపై చర్చ జరగాల్పిందే నంటూ ఆయన పట్టుబట్టారు. -
'సమైక్య రాష్ట్రంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు'