
'సమైక్య రాష్ట్రంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు'
సమైక్య రాష్ట్రంలో ఇవే చివరి శాసన సభ సమావేశాలని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ... తెలంగాణ బిల్లు వెంటనే శాసన సభలో ప్రవేశపెట్టాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేసే అధికారం పార్టీలకు లేదని స్పష్టం చేశారు.ఈ రోజు శాసన సభలో తెలంగాణ బిల్లుపై చర్చ జరగాల్పిందే నంటూ ఆయన పట్టుబట్టారు.