తెలంగాణ బిల్లు నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు నేడు అసెంబ్లీలో పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమైక్య తీర్మానం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం చేయనుంది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సభలో చర్చించాలని టీడీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనుంది. తెలంగాణపై చర్చ పూర్తి చేసి వెంటనే కేంద్రానికి పంపాలని కోరుతూ సీపీఐ వాయిదా తీర్మానం చేయనుంది.