ఢిల్లీ: తెలంగాణ బిల్లు అసమర్ధంగా ఉందన్న విషయం వాస్తవమేనని రాజ్యాంగ నిపుణుడు పి.పి.రావు తెలిపారు. రాష్ట్ర విభజన బిల్లుపై గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆయన గురువారం మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. అసెంబ్లీలో టి.బిల్లును వ్యతిరేకించడంతో మున్ముందు కేంద్రం బాధ్యాతాయుతంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని పి.పి.రావు తెలిపారు.
ఈ విషయంలో కోర్టులో జోక్యం చేసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర అసెంబ్లీకి సమగ్రమైన బిల్లును పంపడం మంచిదని ఆయన సూచించారు. అసెంబ్లీకి బిల్లు అసమగ్రంగా పంపి.. విభజనపై పార్లమెంట్ కు సర్వాధికారాలు ఉన్నాయనడం సరికాదన్నారు.