
బళ్లారి చెరసాలలో ఉండలేనంటున్న దర్శన్
గడ్డు పరిస్థితితో బెంబేలు
సాక్షి బెంగళూరు: రేణుకాస్వామి హత్య కేసులో బళ్లారి సెంట్రల్ జైలులో ఉన్న కన్నడ స్టార్ నటుడు దర్శన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ఇంకా కోర్టు విచారణలోనే ఉంది. అయితే అంతలోనే ఎలాగైనా బెంగళూరుకు తిరిగి వచ్చేయాలని దర్శన్ పట్టుబడుతున్నాడు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న దర్శన్.. ఆ కారణం చూపి బళ్లారి జైలు నుంచి బెంగళూరుకు రావాలనుకుంటున్నాడు.
అక్కడ కటకట
బెంగళూరు పరప్పన జైలు నుంచి దర్శన్‌ను బళ్లారి కేంద్ర కారాగారానికి తరలించిన విషయం తెలిసిందే. బళ్లారి జైలులో గడ్డు పరిస్థితి ఉన్నట్లు తెలిసింది. బెంగళూరు జైలులో ఇతర ఖైదీలతో మాట్లాడేవాడు.. కానీ బళ్లారి జైలులో మాట్లాడేందుకు కూడా ఎవరూ లేరు. సౌకర్యాల లేమి పీడిస్తోంది. ఇదే సమయంలో ఆయనకు ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. బళ్లారిలోని వైద్యులు స్కానింగ్ చేయించుకోవాలని సూచించారు. అయితే తాను బెంగళూరులోనే చేయించుకుంటానని పట్టుబట్టాడు. ఇప్పటికీ బెయిలు రాకపోతే బళ్లారి జైలులో ఉండలేనని, అందుకే బెంగళూరుకు తరలి వెళ్లాలని దర్శన్ మొండికేసినట్లు తెలిసింది. దర్శన్‌కు అదనపు వసతులపై సోమవారం ఆయన న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేసే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment