ప్రత్యేక విమానంలో నవీద్ తరలింపు! | Pakistani terrorist Naveed, involved in last week's Udhampur attack, being shifted to Delhi in a special plane | Sakshi
Sakshi News home page

ప్రత్యేక విమానంలో నవీద్ తరలింపు!

Published Thu, Aug 13 2015 11:48 AM | Last Updated on Sat, Mar 23 2019 8:40 PM

ప్రత్యేక విమానంలో నవీద్ తరలింపు! - Sakshi

ప్రత్యేక విమానంలో నవీద్ తరలింపు!

ఢిల్లీ:  పాకిస్థాన్ ఉగ్రవాది మహమ్మద్ నవేద్ యాకూబ్ ను  గురువారం ఢిల్లీకి తరలించనున్నారు.  జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అతడ్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఉధంపూర్ లో బీఎస్ఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని దాడి జరిపి ప్రాణాలతో పట్టుబడిన  నవేద్ యాకూబ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు పట్టుకున్నారు. అనంతరం  ఎన్ ఐఏ కోర్టు అతడికి14 రోజులు కస్టడీకి అనుమతినిచ్చింది.
 

ఉధంపూర్ లో ఉగ్రవాది నవీద్ ను స్థానికులు అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి . భారత సైన్యానికి పట్టిచ్చారు. మరో  ఉగ్రవాది ఎన్ కౌంటర్ లో చనిపోయాడు.  ఇప్పటివరకు 11మందిని అరెస్టు చేసిన పోలీసులు వారినుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. అయితే  ముఖ్యంగా భారత్‌లోకి ఎలా ప్రవేశించారన్న దానిపై ఆరాతీశారు. 

 

నవేద్ యకూబ్ పై అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం, ఆయుధ చట్టం, పలు సెక్షన్ల కింద నవీద్‌పై కేసులు నమోదయ్యాయి. అయితే పట్టుబడిన నవెద్ కు 12 మంది ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయని ఇప్పటికే అధికారులు గుర్తించారు.  తమ విచారణలో నవీద్ చెప్పే మాటల్లో, చేసే ప్రకటనల్లో స్పష్టత లేదని, కొత్త కథనాలను తెరపైకి తెస్తున్నాడని అధికారులు  చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement