పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు పూర్తి చేయాలి
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు పూర్తి చేయాలని, వాటిలో మౌలిక సదుపాయాల కల్పనను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని రాష్ట్ర అదనపు డీజీపీ గోపీకృష్ణ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం పోలీస్ అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల పునర్విజనలో భాగంగా ఏర్పడే జిల్లాల్లో తాత్కాలిక పోలీస్ కార్యాలయాల్లో ఏర్పాట్లపై సమాచారం తెలుసుకున్నారు.
-
వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర అదనపు డీజీపీ గోపీకృష్ణ
వరంగల్ :
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటు పూర్తి చేయాలని, వాటిలో మౌలిక సదుపాయాల కల్పనను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని రాష్ట్ర అదనపు డీజీపీ గోపీకృష్ణ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం పోలీస్ అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల పునర్విజనలో భాగంగా ఏర్పడే జిల్లాల్లో తాత్కాలిక పోలీస్ కార్యాలయాల్లో ఏర్పాట్లపై సమాచారం తెలుసుకున్నారు. పోలీస్ కార్యాలయాల నిర్వహణకు తాత్కాలిక భవనాలను గుర్తించడంతోపాటు నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన తీరుపై చర్చించి పలు సూచనలు చేశారు. పోలీస్ కమిషనరేట్æ పరిధిలో నూతనంగా ఏర్పడుతున్న ఐనవోలు, వేలేరు, చిల్పూరు, ఇల్లంతకుంట (కరీంనగర్ జిల్లా) పోలీస్ స్టేషన్లకు భవనాలు గుర్తించామని, పోలీసుల విధులకు, భద్రత పరమైన అనుకూలత ఉన్న ప్రాంతాల్లోనే భవనాలను గుర్తించామని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. దసరా నాటికి నూతన పోలీస్‌స్టేషన్లు ప్రారంభించాలని, కమిషనరేట్ పరిధిలోని సిబ్బందిని నూతన పోలీస్‌స్టేషన్లకు కేటాయించి ప్రారంభించాలని అదనపు డీజీపీ ఆదేశించారు. ఈ సమావేశంలో వరంగల్ రేంజ్ డీజీపీ రవివర్మ, వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, సిటీ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రవీందర్‌రావు, సిటీపోలీస్ కార్యాలయం ఏఓ స్వరూపరాణి, ఆర్‌ఐలు, సెక్షన్ సూపరింటెండెంట్, పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.