విశాఖ నగరంలోని తొట్లకొండ బౌద్ధక్షేత్రం
సాక్షి, విశాఖపట్నం : విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం తొట్లకొండ బౌద్ధక్షేత్రంలో 'వనం-మనం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి బౌద్ధ కేంద్రాన్ని శుభ్రపరచి, మొక్కలు నాటారు. అంతకుముందు విశాఖ బీచ్ రోడ్‌లో ఉన్న మాజీ సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలు వేసి నివాలులర్పించారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను నెరవేర్చడమే మా లక్ష్యమని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, అవంతి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, విప్ బూడిద ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాధ్, కరణం ధర్మశ్రీ, భాగ్యలక్మి, గొల్ల బాబురావు, ఉమాశంకర్ గణేశ్, విఎంఆర్డిఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment