నేటినుంచి ‘బడి పండగ’
16 నుంచి 21 వరకు వివిధ కార్యక్రమాలు
నల్లగొండ అర్బన్/చిలుకూరు: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ విద్యార్థుల నమోదును పెంచాలనే ఉద్దేశంతో జి ల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి 21వ తేదీ వరకు బడి పండగ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు.
15 రోజులు ఆలస్యంగా..
గత విద్యాసంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాడి బడి పండగ కార్యక్రమాన్ని ఆలస్యంగా చేపట్టారు. ప్రతి ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభంలోనే చదువుల పండగ, పాఠశాల సంబురాలు తదితర పేర్లతో జూన్ 1వ తేదీన నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఈ ఏడాది 15 రోజులు ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. విద్యార్థులు కూడా దాదాపు పాఠశాలల్లో చేరిపోయారు. ఈ క్రమంలో ఆర్భాటంగా బడి పండగ నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటని ఉపాధ్యాయులు పేర్కొంటు న్నారు.
బడి పండగను జయప్రదం చేయాలి
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు బడి పండుగ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించాలని డీఈఓ ఎస్.విశ్వనాథరావు, ఆర్‌వీఎం ప్రాజెక్టు అధికారి సిహెచ్.శ్రీనివాసులు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస ్ఠ్థలు, ప్రజా సంఘాలు, పాఠశాల యాజ మాన్య కమిటీలు కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.
బడిపండగ షెడ్యూల్
- 16వ తేదీన ఎస్‌ఎంసీ సమావేశాలు.
- 17వ తేదీన విద్యార్థులతో ర్యాలీ
- 18వ తేదీన నూతన విద్యార్థులతో అక్షరాభ్యాసం, ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం.
- 19వ తేదీన విద్యాహక్కుచట్టంపై అవగాహన సదస్సులు.
- 20వ తేదీన బాలికా విద్యాదినోత్సవం/ నాణ్యమైన విద్యా దినోత్సవం/మొక్కలు నాటే కార్యక్రమం.
- 21వ తేదీన మధ్యాహ్న భోజన దినోత్సవం