District Department of Education
-
డీఎస్సీ పోస్టులకు కోత
విశాఖ రూరల్: అనుకున్నట్టే జరిగింది. డీఎస్సీ పోస్టుల్లో ప్రభుత్వం కోత విధించింది. జిల్లా విద్యా శాఖ నోటిఫై చేసిన వాటి కంటే 131 పోస్టులను తగ్గించింది. 1056 పోస్టులను భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 232 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. సబ్జెక్టులు వారీ వివరాలు మాత్రం మరో రెండు, మూడు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. జిల్లాలో ఉపాధ్యాయల పోస్టుల ఖాళీల అధికంగా ఉన్నప్పటికీ తక్కువ సం ఖ్యలో భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో డీఎస్సీ అభ్యర్థుల్లో అసంతృప్తి నెలకొంది. జిల్లాలో 2500 పోస్టులు వరకు ఖాళీలు ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. అయితే రేషనలైజేషన్ చర్యలతో పోస్టులను కుదించి 1714 ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో కూడా కోత విధిస్తూ విద్యా శాఖ అధికారులు 1187 పోస్టులను నోటిఫై చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో 131 పోస్టులను తగ్గిస్తూ 1056 పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది. విద్యా శాఖ నోటిఫై చేసిన వాటిలో ఎస్జీటీలో 117 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లో 11, పీఈటీలో 3 పోస్టులను తగ్గించింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న 1056 పోస్టుల్లో ఏజెన్సీలోనే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బ్యాక్లాగ్ పోస్టులు 232 ఉండగా ప్రస్తుతం 824 పోస్టులు ఉన్నాయి. అయితే రోస్టర్ విధానం, సబ్జెక్టుల వారీ ఖాళీలు, ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో పోస్టుల వివరాలపై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
పరీక్షలకే పరీక్ష
* ప్రశ్నపత్రాలెలా? * టెన్త్‌కు పేపర్లు ఎన్ని? * పరీక్ష విధానం మారిందా? * తల పట్టుకుంటున్న టీచర్లు * అయోమయంగా విద్యాశాఖ తీరు త్రైమాసిక పరీక్షల నిర్వహణ జిల్లా విద్యాశాఖకు ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే నెల 16 నుంచి ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు (సమ్మెటివ్ అసెస్మెంట్ టెస్ట్) ప్రారంభమవుతాయని విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూలు విడుదల చేసింది. కానీ, ఈ ప్రశ్నపత్రాలు ఎవరు తయారు చేస్తారు? అసలు పదో తరగతి విద్యార్థులకు ఎన్ని పేపర్లు ఉంటాయి? కొత్త విధానంలో పేపర్లు తయారు చేస్తారా? పాత పద్ధతిలోనే పరీక్షలుంటాయా? జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) ప్రైవేటు పాఠశాలలకు ప్రశ్నపత్రాలు పంపిస్తుందా? సర్కారీ స్కూళ్లు ఎవరికి వారే పేపర్లు తయారు చేసుకోవాలా? ఈ వరుస సందేహాలు ఇటు ఉపాధ్యాయులను.. అటు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. స్వయంగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి వీటన్నింటిపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవటంతో... ఈ సందేహాలు జిల్లా విద్యాశాఖను సైతం పట్టి పీడిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక పరీక్షలన్నీ గతంలో డీసీఈబీ నిర్వహించేది. ముందుగానే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య వివరాలు తీసుకుని.. పరీక్ష ఫీజుగా కొంత రుసుము వసూలు చేసి ప్రశపత్రాలు పంపిణీ చేసేది. విద్యాహక్కు చట్టం అమల్లోకి రావటంతో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఫీజు వసూలు నిషిద్ధంగా మారింది. దీంతో నిరుడే డీసీఈబీ చేతులెత్తేసింది. ప్రశ్నపత్రాలు తమరే తయారు చేసుకోవాలని సర్కారు పాఠశాలలను పురమాయించడంతో గందరగోళం తలెత్తుతుందని భావించిన ఆర్వీఎం స్టేట్ ప్రాజెక్టు డెరైక్టర్ ఆ ఖర్చును విడుదల చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.4 చొప్పున నిరుడు ప్రశ్నపత్రాలను డీసీఈబీనే తయారు చేసి పంపిణీ చేసింది. ఈ ఏడాది మళ్లీ అదే గందరగోళం పునరావృతమైంది. ఇప్పటికిప్పుడు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమైనా ప్రయోజనమేమీ ఉండదనే వాదన వినిపిస్తోంది. నిధులు విడుదల చేసినా ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణకు నెల పడుతుంది. అంటే సెప్టెంబరు 16 లోపు అందవు. 8వ తరగతి వరకు ప్రశ్నపత్రాలు మీరే తయారు చేసుకోవాలని ఇటీవలే డీసీఈబీ అన్ని పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. ప్రైవేటు పాఠశాలలకు మాత్రం తాము సరఫరా చేస్తున్నట్లు అందులో పేర్కొంది. ప్రైవేటు స్కూళ్లు చెల్లించే ఫీజులకు ప్రశ్నాపత్రాల తయారీ తప్పనిసరి కావటంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్కార్ స్కూళ్లలో చదివే విద్యార్థులను గాలికొదిలేసినట్లు విమర్శలు పెల్లుబికుతున్నాయి. టెన్త్ క్లాస్‌కు సంబంధించి విద్యాశాఖ నుంచి స్పష్ట త లేక ఉపాధ్యాయులు అయోమయానికి గురవుతున్నారు. -
అయ్యవార్ల రాజకీయం!
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదన్‌రావుపై కేసు నమోదైన విషయం జిల్లాలో కలకలం రేపుతోంది. తనను, సమాచార హక్కు చట్టాన్ని అవమానపరిచారంటూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకుడు పెద్దన్న ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యం ఈ పరిస్థితికి దారితీసింది. జిల్లా చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఒక జిల్లా విద్యా శాఖ అధికారిపై కేసు నమోదు కావడం విశేషం. గతం నుంచి కూడా జిల్లాలో పని చేసిన డీఈఓల పనితీరును పరిశీలిస్తే మాత్రం ఇక్కడ పని చేయడం కత్తిమీద సాములాగానే అనిపిస్తుంది. చూసీచూడనట్లుగా పోతుంటే ఓకే.. లేదంటే ఇబ్బందులకు గురి చేయడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో కొందరు చేతగాని అధికారులుగా ముద్ర వేసుకున్నారు. ఇదే సందర్భంలో పని చేసినంత కాలం తనదైన ముద్ర ఉండాలనే తాపత్రయంతో నిక్కచ్చిగా పని చేసిన అధికారులు ఇబ్బందులు పడిన సందర్భాలూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మన జిల్లాలో ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఒకప్పుడు నాలుగైదు ఉన్న సంఘాలు అనతి కాలంలో పదుల సంఖ్యకు చేరుకున్నాయి. చాలా మంది సంఘాల నాయకులు తమ పంతం నెగ్గించుకునే క్రమంలో అధికారులను ఇబ్బందులకు గురి చేశారు. ముఖ్యంగా ప్రేమానందం డీఈఓగా వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు మరీ ఎక్కువయ్యాయి. గతాన్ని పరిశీలిస్తే.. 2000లో డీఈఓగా పని చేసిన ప్రభాకర్‌రెడ్డి ముక్కు సూటిగా పని చేశారు. పదోన్నతులు, బదిలీల్లో కౌన్సెలింగ్ పద్ధతి అమలయింది ఈయన హాయంలోనే. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, డీఈఓ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు గుర్తింపు పొందిన సంఘంగా ఉన్న యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రంగారెడ్డిని సస్పెండ్ చేయడం అప్పట్లో సంచలనం అయింది. ఈ క్రమంలో డీఈఓను ఇబ్బంది పెట్టేందుకు కొందరు నానా రకాలుగా ప్రయత్నాలు చేశారు. అప్పటికి కేవలం ఐదారు ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే ఉండేవి. ఆతర్వాత వచ్చిన లక్ష్మీనారాయణ హాయాంలో ప్రశాంతంగా నడిచింది. ఆనందమూర్తి హయాంలో విపరీతమైన అక్రమాలు జరిగాయి. కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకుల పంట పండింది. ‘సింగిల్ ఆర్డర్’ ట్రాన్స్ఫర్ల అంశం రాష్ట్ర వ్యాప్తంగా మారు మోగింది. కొందరు నాయకుల నిర్వాకంతో చివరకు ఆయన్ను బలవంతంగా ఇక్కడి నుంచి తప్పించారు. తర్వాత వచ్చిన భార్గవ్ హాయాం ప్రశాంతంగా నడిచింది. ఆతర్వాత వచ్చిన అబ్దుల్‌హమీద్ నిబంధనలు అంటూ గట్టిగా స్పందించడంతో అంతే స్థాయిలో ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారు. ప్రేమానందం వచ్చిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నాయకుడిగా ఉంటే ఏదైనా పని చేయించుకోవచ్చనే భావనతో 6-7 సంఘాల నుంచి సుమారు 20కి పైగా తయారయ్యాయి. కొన్ని సంఘాల నాయకులు ప్రేమానందంను ‘ఆట’ ఆడించారు. బెదిరించి మరీ పనులు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం డీఈగా పని చేస్తున్న మధుసూదన్‌రావు పైకి మెత్తగా కనిపించినా ఉపాధ్యాయుల విషయంలో కాస్త కటువుగానే వ్యవహరించారు. ‘టీచరు అంటే బడిలో ఉండాలి’ అనే ధోరణిలో వ్యవహరించి గాడిన పెట్టే చర్యలకు పూనుకున్నారు. ఈ క్రమంలో కొందరు సంఘాల నాయకులు ఈయన్ను ఇబ్బంది పెట్టిన సందర్భాలూ చాలా ఉన్నాయి. ఇక్కడ పనిచేసినంత కాలం తనదైన ముద్ర వేసుకోవాలనే తపనతో కాస్త నోరు జారి చివరకు కేసులో ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. -
నేటినుంచి ‘బడి పండగ’
16 నుంచి 21 వరకు వివిధ కార్యక్రమాలు నల్లగొండ అర్బన్/చిలుకూరు: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ విద్యార్థుల నమోదును పెంచాలనే ఉద్దేశంతో జి ల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి 21వ తేదీ వరకు బడి పండగ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు. 15 రోజులు ఆలస్యంగా.. గత విద్యాసంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాడి బడి పండగ కార్యక్రమాన్ని ఆలస్యంగా చేపట్టారు. ప్రతి ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభంలోనే చదువుల పండగ, పాఠశాల సంబురాలు తదితర పేర్లతో జూన్ 1వ తేదీన నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఈ ఏడాది 15 రోజులు ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. విద్యార్థులు కూడా దాదాపు పాఠశాలల్లో చేరిపోయారు. ఈ క్రమంలో ఆర్భాటంగా బడి పండగ నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటని ఉపాధ్యాయులు పేర్కొంటు న్నారు. బడి పండగను జయప్రదం చేయాలి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు బడి పండుగ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించాలని డీఈఓ ఎస్.విశ్వనాథరావు, ఆర్వీఎం ప్రాజెక్టు అధికారి సిహెచ్.శ్రీనివాసులు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస ్ఠ్థలు, ప్రజా సంఘాలు, పాఠశాల యాజ మాన్య కమిటీలు కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. బడిపండగ షెడ్యూల్ - 16వ తేదీన ఎస్ఎంసీ సమావేశాలు. - 17వ తేదీన విద్యార్థులతో ర్యాలీ - 18వ తేదీన నూతన విద్యార్థులతో అక్షరాభ్యాసం, ఉపాధ్యాయులు, సీఆర్పీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం. - 19వ తేదీన విద్యాహక్కుచట్టంపై అవగాహన సదస్సులు. - 20వ తేదీన బాలికా విద్యాదినోత్సవం/ నాణ్యమైన విద్యా దినోత్సవం/మొక్కలు నాటే కార్యక్రమం. - 21వ తేదీన మధ్యాహ్న భోజన దినోత్సవం -
పుస్తకాలొచ్చాయ్..
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలోని పాఠశాలల్లో 2014-15 విద్యా సంవత్సరంలో 1 నుంచి పదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు 27.82 లక్షల పాఠ్యపుస్తకాలు జిల్లా విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ మొత్తంలో ప్రభుత్వరంగ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 23.02 లక్షల జిల్లా విద్యాశాఖ పాఠ్యపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎ.రాజేశ్వరరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న అన్ని వర్గాల విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేస్తారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన, పొందని ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలొచ్చాయ్.. చదువుతున్న విద్యార్థులకు విక్రయించేందుకు 4280 లక్షల పాఠ్యపుస్తకాలను సిద్ధం చేస్తున్నారు. ఈ విద్యార్థులందరూ మార్కెట్లో పాఠ్యపుస్తకాలను కొనుక్కోవాల్సిందే. జిల్లా విద్యాశాఖచే గుర్తింపు పొందిన పుస్తకాల షాపులు, సూపర్బజార్లలో వీరికి పాఠ్యపుస్తకాలను విక్రయిస్తారు. విద్యాశాఖ ముందస్తు అనుమతి లేకుండా పాఠ్యపుస్తకాలను విక్రయించడం నేరం. 59 శాతం పాఠ్యపుస్తకాలు సిద్ధం: జిల్లాలో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు 59 శాతం పాఠ్యపుస్తకాలు జిల్లా పాఠ్యపుస్తకాల గోడౌన్లో సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు మొత్తం 23.62 లక్షల పాఠ్యపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ మొత్తానికి గత సంవత్సరం పంపిణీ చేయగా మిగిలిన పాఠ్యపుస్తకాలు 1.16 లక్షలు గోడౌన్లో నిల్వ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఈ ఏడాది పంపిణీకి నికరంగా 21.85 లక్షల పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. అయితే ఈ మొత్తంలో ఇప్పటి వరకు 12.05 లక్షల పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం నుంచి ఒంగోలు గోడౌన్‌కు చేరినట్లు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల జిల్లా మేనేజర్ జె.నాగరాజు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఇంకా 9.20 లక్షల పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలు 50 శాతంపైగా వచ్చాయి. 9,10 తరగతుల ఒకేషనల్ విద్యార్థులు, మదర్సాల్లో చదువుతున్న మైనార్టీ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తున్నారు. పదో తరగతి పాఠ్యపుస్తకాలు మార్పు ఈ ఏడాది పదో తరగతి పాఠ్యపుస్తకాలు మారాయి. ప్రస్తుతం 1 నుంచి 9వ తరగతి వరకు నిరంతర చరిత్రగా మూల్యాంకనం (సీసీఈ) విధానం ప్రకారం పాఠ్యపుస్తకాలు రూపొందించారు. ఈ ఏడాది పదో తరగతి పాఠ్యపుస్తకాలను కూడా సీసీఈ విధానంలో రూపొందించారు. పదో తరగతి విద్యార్థులకు మొత్తం 4.19 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరమని అంచనా వేశారు. ఈ మొత్తంలో 3.14 లక్షల పాఠ్యపుస్తకాలు ఉచిత పంపిణీకి, 1.05 లక్షల పాఠ్యపుస్తకాలు మార్కెట్లో విక్రయిస్తారు. పదో తరగతి పాఠ్యపుస్తకాలు పంపిణీకి సిద్ధమయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టు పాఠ్యపుస్తకాలన్నీ పంపిణీకి సిద్ధమయ్యాయి. గణితంలో కొన్ని పాఠ్యపుస్తకాలు వచ్చాయి. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. మార్చి నాటికి పాఠశాలలకు... విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలన్నింటినీ మార్చి ఆఖరుకు పాఠశాలలకు చేర్చేందుకు ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు సిలబస్ మారిన దృష్ట్యా ఏప్రిల్‌లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించే నాటికి ప్రస్తుతం 9వ తరగతి చదువుతూ 2014-15లో 10వ తరగతికి వచ్చే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు. వేసవి సెలవుల్లో ఈ పుస్తకాలపై విద్యార్థులు అవగాహన పెంచుకుంటారనేది ప్రభుత్వ భానవ, ఏటా పాఠ్యపుస్తకాల పంపిణీ, మేలో ప్రారంభమవుతుండగా ప్రస్తుతం ఈ నెలాఖరు నుంచే పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠ్యపుస్తకాలను మండలాలకు చేరవేసేందుకు సోమవారం రవాణా టెండర్లను కూడా ఖరారు చేయనున్నాయి. తరగతి ఉచిత పంపిణీకి విక్రయానికి మొత్తం 1వ తరగతి 144000 16000 160000 2వ తరగతి 141000 16000 157000 3వ తరగతి 186200 32000 218200 4వ తరగతి 184200 27000 211200 5వ తరగతి 192200 38000 230200 6వ తరగతి 283700 60000 343700 7వ తరగతి 253700 60000 313700 8వ తరగతి 282000 70000 352000 9వ తరగతి 306200 56000 362200 10వ తరగతి 314200 105000 419200 ఒకేషనల్ కోర్సు 4100 0 4100 మదర్సా 10750 0 10750 మొత్తం 2302250 480000 2782250