school festival
-
కండీషన్ లేని బండి.. ముందుకు కదలదండి!
అనంతపురం సప్తగిరి సర్కిల్: అనంతపురంలోని కేఎస్ఆర్ పాఠశాలలో శుక్రవారం బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) పరీక్షలను పరిశీలించేందుకు గిరిజన సంక్షేమ శాఖ అధికారి కొండలరావు వచ్చారు. పరీక్షలను పరిశీలించిన అనంతరం బయటకు వెళ్లేందుకు బడి తీయగా ముందుకు కదలలేదు. దీంతో అక్కడ విద్యార్థుల వెంట వచ్చిన పిల్లల సాయం తీసుకున్నారు. కండీషన్ సరిగా లేని ఈ వాహనం తరచూ మొరాయిస్తోంది. పరీక్ష కేంద్రం వద్ద పిల్లలు కొంతదూరం తోశాక వాహనం ముందుకు కదిలింది. -
స్కూల్ ఫంక్షన్లో ఎంపీ డ్యాన్స్‌లు..
-
స్టేజ్‌పై స్టెప్పులతో ఇరగదీసిన ఎంపీ
సాక్షి, ముంబై : రాజకీయ నేతలంటే ఖాకీ దుస్తుల్లో ఒద్దికగా, హుందాగా కనిపిస్తారనుకునే అభిప్రాయాన్ని ఈ ఎంపీని చూస్తే మార్చుకోవాల్సిందే. ఓ పాఠశాల కార్యక్రమానికి హాజరైన ఎంపీ సినిమా పాటకు తన అభినయం జోడిస్తూ నృత్యాలతో హోరెత్తించారు. రాజకీయ నేతల్లోనూ భిన్న కోణాలుంటాయనే సంకేతాలను పంపుతూ ఆ ఎంపీ వేదికపై చెలరేగారు. మహారాష్ట్రలోని బండారా- గోండియా నియోజకవర్గానికి ఎంపీగా వ్యవహరిస్తున్న ఎన్సీపీ నేత మధుకర్ కుక్డే చిన్నారులతో కలిసి సింబా సినిమాలోని పాటకు నృత్యం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ మూవీలోని ఆంఖ్ మారో పాటకు నృత్యం చేస్తున్న విద్యార్ధినుల ఆహ్వానం మేరకు ఎంపీ ఆయన అనుచరులు వేదికపై చిన్నారులతో కలిసి కాలు కదిపారు. బందారా ప్రాంతంలోని ఓ పాఠశాల వేడుకలో ఎంపీ నృత్యంలో తన నైపుణ్యం చాటుకున్నారు. -
నేటినుంచి ‘బడి పండగ’
16 నుంచి 21 వరకు వివిధ కార్యక్రమాలు నల్లగొండ అర్బన్/చిలుకూరు: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ విద్యార్థుల నమోదును పెంచాలనే ఉద్దేశంతో జి ల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి 21వ తేదీ వరకు బడి పండగ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు. 15 రోజులు ఆలస్యంగా.. గత విద్యాసంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాడి బడి పండగ కార్యక్రమాన్ని ఆలస్యంగా చేపట్టారు. ప్రతి ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభంలోనే చదువుల పండగ, పాఠశాల సంబురాలు తదితర పేర్లతో జూన్ 1వ తేదీన నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఈ ఏడాది 15 రోజులు ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రైవేట్ పాఠశాలలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. విద్యార్థులు కూడా దాదాపు పాఠశాలల్లో చేరిపోయారు. ఈ క్రమంలో ఆర్భాటంగా బడి పండగ నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటని ఉపాధ్యాయులు పేర్కొంటు న్నారు. బడి పండగను జయప్రదం చేయాలి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు బడి పండుగ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించాలని డీఈఓ ఎస్.విశ్వనాథరావు, ఆర్వీఎం ప్రాజెక్టు అధికారి సిహెచ్.శ్రీనివాసులు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస ్ఠ్థలు, ప్రజా సంఘాలు, పాఠశాల యాజ మాన్య కమిటీలు కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. బడిపండగ షెడ్యూల్ - 16వ తేదీన ఎస్ఎంసీ సమావేశాలు. - 17వ తేదీన విద్యార్థులతో ర్యాలీ - 18వ తేదీన నూతన విద్యార్థులతో అక్షరాభ్యాసం, ఉపాధ్యాయులు, సీఆర్పీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం. - 19వ తేదీన విద్యాహక్కుచట్టంపై అవగాహన సదస్సులు. - 20వ తేదీన బాలికా విద్యాదినోత్సవం/ నాణ్యమైన విద్యా దినోత్సవం/మొక్కలు నాటే కార్యక్రమం. - 21వ తేదీన మధ్యాహ్న భోజన దినోత్సవం -
16 నుంచి ‘ప్రొఫెసర్ జయశంకర్ బడి పండుగ’
వారం రోజులపాటు నిర్వహణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనకు పరితపించిన ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో ఈ ఏడాది బడి పండుగ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా విద్యార్థులను స్కూల్లో చేర్పించడం, తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ‘ప్రొఫెసర్ జయశంకర్ బడి పండుగ ’గా నామకరణం చేశారు. ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్యా కమిషనర్, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డెరైక్టర్ జగదీశ్వర్ తెలిపారు. కార్యక్రమాల వివరాలు... 1వ రోజు: స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, పేరెంట్ టీచర్ మీటింగ్ 2వ రోజు: విద్యార్థులు, టీచర్లతో ర్యాలీలు 3వ రోజు: విద్యార్థులను చేర్పించేందుకు ఇంటింటి ప్రచారం, అక్షరాభ్యాసం 4వ రోజు:విద్యాహక్కుచట్టం దినోత్సవం నిర్వహణ, విద్యార్థులను పైతరగతులకు పంపడం. 5వ రోజు: గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్/క్వాలిటీ ఎడ్యుకేషన్/గ్రీన్ ప్లాంటేషన్ డే 6వ రోజు: వికలాంగ విద్యార్థులు/మధ్యాహ్న భోజన పథకం దినోత్సవం.