వారం రోజులపాటు నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనకు పరితపించిన ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో ఈ ఏడాది బడి పండుగ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా విద్యార్థులను స్కూల్లో చేర్పించడం, తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ‘ప్రొఫెసర్ జయశంకర్ బడి పండుగ ’గా నామకరణం చేశారు. ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్యా కమిషనర్, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డెరైక్టర్ జగదీశ్వర్ తెలిపారు.
కార్యక్రమాల వివరాలు...
1వ రోజు: స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ, పేరెంట్ టీచర్ మీటింగ్
2వ రోజు: విద్యార్థులు, టీచర్లతో ర్యాలీలు
3వ రోజు: విద్యార్థులను చేర్పించేందుకు ఇంటింటి ప్రచారం, అక్షరాభ్యాసం
4వ రోజు:విద్యాహక్కుచట్టం దినోత్సవం నిర్వహణ, విద్యార్థులను పైతరగతులకు పంపడం.
5వ రోజు: గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్/క్వాలిటీ ఎడ్యుకేషన్/గ్రీన్ ప్లాంటేషన్ డే
6వ రోజు: వికలాంగ విద్యార్థులు/మధ్యాహ్న భోజన పథకం దినోత్సవం.