Professor Jayashankar
-
కేంద్రం నిధులపై లెక్కలు రాయాలి
మేడ్చల్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేస్తున్న నిధులపై రాష్ట్ర ప్రజలందరూ లెక్కలు రాసి వాటిని అవసరమైనప్పుడు చూపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మేడ్చల్ పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్ ఫేజ్–2 కమాన్ వద్ద ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని, అమరవీరుల స్థూపాన్ని ఆదివారం ఆమె మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రొ. జయశంకర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ కోసం ఖర్చు చేసిన నిధులపై లెక్కలు రాసి రాష్ట్ర సాధన ఉద్యమాల సమయంలో ప్రజలకు నాయకుల ద్వారా వివరించారన్నారు. ఆయన రాసిన లెక్కల ద్వారానే తెలంగాణ ఎంత అన్యాయం జరిగింది ప్రజలకు తెలిసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. మోసం చేస్తున్న వారిని పక్కాగా గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్‌కు వచ్చిన ఇబ్బంది ఏమిటో తమకు అర్థంకావడం లేదని అన్నారు. అలుపెరగని యోధుడు జయశంకర్.. అలుపెరగని యోధుడు జయశంకర్ అని ఆమె పేర్కొన్నారు. జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేశాడన్నారు. ఆంధ్రలో తెలంగాణ వీలీనాన్ని ఆయన ఒప్పుకోలేదని, ఆ తర్వాత ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నాడని, ఆ తర్వాత తొలిదశ, మలి దశ ఉద్యమాల్లో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడారు. ఆయన జీవితం యువతకు ఆదర్శనీయమన్నారు. కేసీఆర్‌కు అండగా నిలిచారు.. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ దొర అని ఆయన వెనుక బీసీ అయిన జయశంకర్ ఉండవద్దని ఎంతో మంది జయశంకర్‌కు చెప్పారని అందుకు ఆయన కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నాడని ఆయన తెలంగాణ నినాదం వదిలితే తాను కేసీఆర్‌ను వదులుతానని అనేవారని గుర్తు చేశారు. కేసీఆర్ ఉద్యమాన్ని వదలేదని జయశంకర్ కేసీఆర్‌ను వదలేదన్నారు. ఉద్యమంలో అమరుడైన శ్రీనివాస్ కుటుంబానికి రూ.5 లక్షలు ఇస్తానని మంత్రి మల్లారెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దేవీ వరప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు మహేందర్‌రెడ్డి, వీరభద్రారెడ్డి, ప్రవీణ్‌కుమార్ ,సత్యపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ దీపిక నర్సింహారెడ్డి, మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్ యాద వ్, శంకర్‌ముదిరాజ్, జగన్‌రెడ్డి, దయానంద్‌యాదవ్, రమేష్ , దేవ, శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
నెల రోజులపాటు ’పల్లె పల్లెకు కాంగ్రెస్’
సాక్షి, హైదరాబాద్: వరంగల్ డిక్లరేషన్‌పై గంపెడాశలతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు. శనివారం నుంచి నెల రోజులపాటు ‘పల్లె పల్లెకు కాంగ్రెస్’పేరుతో ఈ డిక్లరేషన్ గురించి ప్రజలకు వివరించేందుకు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు రూట్‌మ్యాప్‌లు సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ నాయకులు, ఆయా గ్రామాల్లో రైతు రచ్చబండలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయరంగ వ్యతిరేక విధానాలను వెల్లడించనున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తాము రైతాంగానికి ఏం చేయబోతున్నామన్న అంశాలను కూడా వివరించనున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామమైన హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా ఉదయం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించి రేవంత్ అక్కంపేటకు బయలుదేరుతారని, మధ్యాహ్నం ఒంటిగంటకు అక్కంపేట చేరుకుని అక్కడి రైతులతో ముచ్చటిస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జయశంకర్‌తో పాటు తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖుల గ్రామాల్లో రైతు రచ్చబండలు ఏర్పాటు చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించవచ్చని టీపీసీసీ నాయకత్వం భావిస్తోంది. మైకులు పెట్టొద్దు... సన్మానాలు చేయొద్దు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈనెల 27 నుంచి సంగారెడ్డి నియోజకవర్గంలో రైతు డిక్లరేషన్ సభల ఏర్పాట్లు చేసుకుంటున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాను గ్రామాలకు వచ్చే సమయంలో టెంట్లు, మైకులు, భోజనాల ఏర్పాట్లు చేయవద్దని, ఊరేగింపులు, శాలువాలు, సన్మానాలు వద్దని నియోజకవర్గ నేతలను కోరుతూ ఆయన ప్రకటన విడుదల చేశారు. రోజుకు 4 గ్రామాలు పర్యటిస్తానని, ప్రతి గ్రామంలో 2 గంటలు ఉండి రైతులు, ప్రజలతో మాట్లాడి రాహుల్ గాంధీ సూచనల మేరకు వరంగల్ రైతు డిక్లరేషన్‌ను ప్రజలకు వివరిస్తానని తెలిపారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నేరుగా గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయా గ్రామాల ప్రజలు, రైతులతో చెట్టు కింద కూర్చుని మాట్లాడే ప్రయత్నం చేద్దామని ఆ ప్రకటనలో జగ్గారెడ్డి వెల్లడించడం గమనార్హం. -
జయశంకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
వనస్థలిపురం: ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని, సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి పిల్లలను బాగా చదివించుకోవాలని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సూచించారు. స్వర్ణకార సమాజం బలమైన శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వనస్థలిపురంలోని బొమ్మిడి లలితా గార్డెన్లో ఆదివారం జరిగిన ఆ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు వింజమూరి రాఘవా చారి, ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి, కోశాధికారి చంద్రశేఖరాచారి తదితర కార్యవర్గంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వకర్మ భగవానుడు వీరబ్రహ్మేంద్రస్వామి ప్రపంచాన్ని శాసించారని, కానీ విశ్వకర్మీయులు ఇంకా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర నూతన అధ్యక్షులు రాఘవాచారి మాట్లాడుతూ విశ్వకర్మీయులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమి కేటాయించాలని, స్వర్ణకారులపై దాడులను నివారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు చిట్టన్నోజు ఉపేంద్రాచారి, ఏపీ స్వర్ణకార సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్, కందుకూరి పూర్ణాచారి, కన్నెకంటి సత్యం, కీసరి శ్రీకాంత్, ఆర్.సతీష్‌కుమార్, రాచకొండ గిరి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక అంశాలపైనే రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆర్థిక అంశాలపైనే భవిష్యత్తు రాజకీయాలు కొనసాగుతాయని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో వర్తమాన ఆర్థిక పరిస్థితి – మూల్యాంకనంపై ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. కోదండరాం మాట్లాడుతూ.. ఆర్థిక పరిణామాలు ఎటుపోతాయనేది రాజకీయ పార్టీలు చర్చించాలన్నారు. రాజకీయ రంగమే ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపుతుందని, అంతిమంగా ఆర్థిక వనరులను సరిగ్గా వినియోగించగలిగేది రాజకీయాలేనన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆర్థిక అంశాలపై అవగాహన పెం పొందించుకోవాలన్నారు. జీఎస్టీ ప్రవేశపెట్టడం, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం కూడా కారణమేనని ప్రొఫెసర్ నరసింహారెడ్డి అన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలు ప్రోత్స హించేందుకు కేంద్రం చర్యలు చేపట్టడంతో వాహ నాలు కొనుగోలు చేయాలనుకునే వారు ఎలక్ట్రికల్ వాహనాలు వస్తాయని వాటిని కొనడం మానేశారని ఎకనామిక్స్ ప్రొఫెసర్ అంజిరెడ్డి అన్నారు. -
ప్రత్యామ్నాయమే పరమావధి
సందర్భం ప్రొఫెసర్ జయశంకర్ ఇలాంటి పరిణామాలను ముందే ఊహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పోరాటం చేయవలసి ఉంటుందని ఆయన ఆనాడే చెప్పారు. వారి ఆదేశాల ప్రకారమే తెలంగాణ జేఏసీ ప్రజలు కేంద్రంగా కల, ప్రజాస్వామిక విలువల పునాది కల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఆచార్య జయశంకర్ అన్నట్టు భావవ్యాప్తి, ఆందోళన కార్యక్రమాలకు రాజకీయ ప్రక్రియతోనే ముగింపు సాధ్యపడుతుంది. వర్తమాన తెలంగాణలో, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అందించిన చైతన్యం వెలుగులో రాజకీయాలను పునర్నిర్వచించుకోవలసిన అవసరం ఉన్నది. సరళీకరణ నేపథ్యంలో రాజకీయాలు వికృతరూపాన్ని సంతరించుకున్నాయి. అధికారం వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలను సాధించుకోవడానికి పెట్టుబడి లేని వ్యాపారంగా మారిపోయింది. ప్రభుత్వాధికారాన్ని గుప్పెడుమంది కలసి వనరులను కొల్లగొట్టడానికి సాధనంగా వాడుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం కేవలం ఒక భౌగోళిక తెలంగాణ ఏర్పాటుకు పరి మితమై సాగలేదు. సరళీకరణ రాజకీయాలనే ఈ ఉద్యమం వ్యతిరేకించింది. సమష్టి సంపద ప్రజలందరికీ ఉపయోగపడాలని, ఆ విధంగా వనరులను ప్రజల అవసరాలు తీర్చే విధంగా వినియోగంలోకి తేవాలని తెలంగాణ వాదం తేల్చి చెప్పింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలు అందరి కోసం పనిచేయాలి. కొందరి స్వార్ధ ప్రయోజనాలకు అధికారాన్ని ఉపయో గించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలంగాణ ఉద్యమం బలంగా విశ్వసించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చరిత్రాత్మక పంథాలో ఉద్యమం సాగించిన సంస్థ తెలంగాణ రాష్ట్ర సమితి. తరువాత ఉద్యమం నడిపిన సంస్థే రాజకీయ పార్టీగా అవతరించి అధికారంలోకి వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ స్ఫూర్తిని విస్మరించి ప్రభుత్వపరంగా నిలబెట్టవలసిన ప్రజా స్వామిక విలువలకు వ్యతిరేకంగా సాగుతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టు పాలకులు మారిపోయారు. కానీ పాలనలో మార్పు రాలేదు. ముఖ్యమంత్రి నిరంకుశంగా, రాచరిక పద్ధతుల్లో పాలన కొనసాగిస్తున్నారు. అన్ని పాలనా వ్యవస్థలు, అన్ని సంస్థలు కుప్పకూలిపోయాయి. సచివా లయం నిరర్థకమైంది. నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి నివాసంలో జరుగు తాయి. మంత్రులతో సంబంధం లేకుండానే ముఖ్యమంత్రి ఆయా శాఖల వ్యవహారాలను సమీక్షిస్తారు. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు చేస్తారు. శాసన సభ్యులు, మంత్రులే ముఖ్యమంత్రి దర్శనం కోసం పడిగాపులు పడి ఉండ వలసిన పరిస్థితి. ఇక సాధారణ ప్రజలకు ముఖ్యమంత్రిని కలుసుకునే వెసు లుబాటు ఎక్కడ దొరుకుతుంది? ఇక ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి కాగ్ బోలెడంత సమా చారం ఇచ్చింది. విద్య, వైద్య రంగాలకు తక్కువ కేటాయింపులు చేశారు. ఇది అవాంఛనీయ పరిణామం. కానీ ఆ తక్కువ కేటాయింపులను కూడా ఖర్చు చేయలేదు. వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం మంజూరైన నిధులలో సగం కూడా ఖర్చు కాలేదు. పెట్టుబడి వ్యయంలో 80 శాతం దాకా రోడ్లు, ప్రాజెక్టులు, చెరువుల మరమ్మతులకు వినియోగమ య్యాయి. అయితే అవీ దారి మళ్లాయి. ఎక్కడ బడా కాంట్రాక్టర్లు ఉన్నారో, అక్కడే ఖర్చయినాయి. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టుపై అనుకున్న దాని కన్నా ఎక్కువ ఖర్చయితే, పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం మంజూరు చేసిన నిధులు మురిగిపోయాయి. చెరువుల మరమ్మతుల విషయంలో పూడిక తీత పనులు సగం కూడా పూర్తికాలేదు. ప్రశ్నిస్తే తప్పేమిటి? తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిదంటూ ఆక్రోశిస్తున్న జనసమూహా నికి ముందు నిలబడి వారి ఆకాంక్షల కోసం పనిచేసిన సంస్థ తెలంగాణ రాష్ట్ర సమితి. కానీ ప్రభుత్వంలోకి ప్రవేశించిన తరువాత అదే సంస్థ ప్రవర్తిస్తున్న తీరు విస్తుపోయేటట్టు ఉంటున్నది. ఉద్యమ సంస్థ పాలనలో ప్రశ్నించడాన్ని భరించలేని వాతావరణాన్ని సృష్టించారు. ప్రభుత్వ పాలనలోని అవకతవకల గురించి గొంతెత్తిన వారిని అణచివేయడానికే తెరాస ప్రభుత్వం పూను కున్నది. హైదరాబాద్‌లో ఇందిరాపార్క్ వద్ద చిరకాలం నుంచి ఉన్న ధర్ణా చౌక్‌ను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మూసివేశారు. బహిరంగ సభల నిర్వహణకు వేదికలు లేవు. సెక్షన్ 30, సెక్షన్ 144లను అనేక జిల్లాలలో విచ్చ లవిడిగా ఉపయోగిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి, ఉమ్మడి ఆలోచనల వ్యక్తీకరణకు రోడ్ల మీదకు వచ్చిన వారిని అందరినీ అరెస్టు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎవరు నిలదీసినా జైలు పాలవుతున్నారు. అధికారం సొంత ఆస్తి అయినట్టు ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. నాటి రాజులు భావించిన తీరులోనేæ ప్రజలకు హక్కులు ఉండవనీ, పాలకులకు వారు లొంగి ఉండి వారి అధికారాన్నీ అదేశాలనూ శిరసావహించడమే ప్రజలు బాధ్యతగా స్వీక రించాలనీ ముఖ్యమంత్రిగారు భావిస్తున్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. నిరంకుశ పాలనా రీతులను తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్నది. ఒక వ్యక్తి ఆధిపత్యం సరికాదు, పాలనలో అందరికీ భాగస్వామ్యం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. సమాజ వనరులు సమష్టి ప్రయోజనాలకే ఉపయో గపడాలి తప్ప గుప్పెడుమంది పాలకుల సొంత ఆస్తి కాకూడదని తెలంగాణ సమాజం ఆశిస్తున్నది. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు నిరంకుశ పాలనకు మధ్య సంఘర్షణ తలెత్తింది. ఆధునిక ప్రజాస్వామ్య సమాజంలో, అదీ సుదీర్ఘ ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో రాజకీయాలు ప్రజల ఆకాంక్షల వ్యక్తీక రణకు ఉపయోగపడాలి. అంతేతప్ప ప్రజాస్వామిక సంప్రదాయాలను, ఉద్యమ ఆకాంక్షలను అణచడానికి దారితీస్తే తెలంగాణ సమాజం అంగీకరిం చదని చరిత్ర చెబుతున్నది. అనేకానేక సమస్యలు ఇవ్వాళ అపరిష్కృతంగా ఉన్నాయి. వ్యవసా యంలో మిగులు లేదని, నష్టాలపాలై పోతున్నామని ఆవేదన చెందుతున్న రైతులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. డిగ్రీ దాకా చదివిన యువతీ, యువకుల్లో అతి ఎక్కువ నిరుద్యోగులున్న రాష్ట్రాలలో అస్సాం, జమ్మూ కశ్మీర్ తరువాత మనది మూడవ స్థానం. అయినా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి విధానాలు తయారు కాలేదు. ఖాళీ అయిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏ స్థాయిలోను చర్యలు లేవు. వృత్తులను కాపాడటానికి ప్రభుత్వం వ్యూహ రచన చేయనే లేదు. నాలుగేళ్లలో కనీస వేతనాలను సవరించే ఒక్క ప్రభుత్వ ఉత్తర్వు రాలేదు. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్య అపరిష్కృతంగానే ఉన్నది. ఖాయిలా పడిన నిజాం షుగర్స్‌ను తెరిపించడానికి చర్యలే లేవు. ఈ లోపాలు సరి చేయడానికి తెలంగాణ జేఏసీ, ప్రజా సంఘాలు అనేక పోరాటాలు చేసినాయి. కానీ ఫలితం దక్కలేదు. అభివృద్ధి నమూనాపై చర్చిం చడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడలేదు. ప్రభుత్వ వైఖరికి మూలకారణం అధికారపార్టీ రాజకీయాలే మూలమనేది స్పష్టం. ప్రత్యామ్నాయం కోసం యత్నం సమాజంలో వ్యవస్థల నిర్మాణానికి పునాది వేసేది రాజకీయాలు. అన్ని వనరుల పంపిణీని రాజకీయాలే నిర్ధారిస్తాయి. మార్పునకు మార్గ నిర్దేశన చేసేవే రాజకీయాలు. రాజకీయాలు జవాబుదారీతనంతో, ప్రజాస్వామిక విలువల ప్రాతిపదికన జరిగితే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. కాంట్రా క్టర్లు, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కేంద్రంగా రాజకీయాలు సాగితే అప్పుడు ప్రజల ఆకాంక్షలకు గుర్తింపు ఉండదు. మార్పును సాధించగల రాజకీయ నాయకులు పైసల ఆశతో సంతలో పశువులు అమ్ముడు పోయినట్లు అమ్ముడు పోతున్నారు. చాలామంది ప్రభుత్వ ఒత్తిడికి లొంగి మౌనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ప్రయత్నం చేయ వలసి వస్తున్నది. అందుకే పార్టీని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలపట్ల జవా బుదారీ తనంతో వ్యవహరించకపోతే, సమష్టి ప్రయోజనాల కోసం ప్రభు త్వాన్ని నడిపించే ప్రయత్నం చేయకపోతే సమాజ రుగ్మతలకు పరిష్కారం దొరకదు. కంచె చేను మేసినట్లు, పాలించేవాడే ప్రజలను విస్మరిస్తే ఉద్యమ ఆకాంక్షలు నెరవేరవు. ఆచార్య జయశంకర్ బాటలో ప్రొఫెసర్ జయశంకర్ ఇలాంటి పరిణామాలను ముందే ఊహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత అభివృద్ధి కోసం ప్రత్యే కంగా పోరాటం చేయవలసి ఉంటుందని ఆయన ఆనాడే చెప్పారు. వారి ఆదేశాల ప్రకారమే తెలంగాణ జేఏసీ ప్రజలు కేంద్రంగా కల, ప్రజాస్వామిక విలువల పునాది కల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేసింది. కానీ ఆచార్య జయశంకర్ అన్నట్టు భావవ్యాప్తి, ఆందోళన కార్యక్రమాలకు రాజకీయ ప్రక్రియతోనే ముగింపు సాధ్యపడుతుంది. రాజకీయరంగంలో ప్రజల ఆకాంక్షలను బలంగా వ్యక్తీకరించగలిగిన వేదిక లేకపోతే అన్ని ప్రయ త్నాలు, ఉద్యమాలు సంపూర్ణ ఫలితాలను సాధించలేవు. రాజకీయ రంగాన్ని విస్మరిస్తే అన్ని ఉద్యమాలు విఫలమయ్యే ప్రమాదం ఉంది. ఈ అనుభవాల నుంచే తెలంగాణ జేఏసీ గాని, ఇతర ప్రజా సంఘాలు కానీ ప్రత్యామ్నాయ రాజకీయాలను పాదుకొల్పే ప్రయత్నాన్ని మొదలుపెట్టాయి. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వెలుగులో రాజకీయాలను పునర్ నిర్వ చించాలి. ఉద్యమ కాలంలో ప్రజలు రాజకీయాలను శాసించారు. తమ వెంట రాని నాయకుల వెంటపడినారు. తెలంగాణ సాధన కోసం నాయకులు కదిలి వచ్చేటట్టు చేయగలిగినారు. ఇవ్వాళ ప్రజాస్వామిక ఆకాంక్షల సాధనకై రాజ కీయాలలో మార్పు తేవాలి. ప్రజలందరూ గౌరవంతో జీవించగల, ప్రజలు కేంద్రంగా కల అభివృద్ధి కోసం మనం రాజకీయాలను మార్చాలి. దాని కోసం తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేస్తున్నాం.ప్రత్యామ్నాయ రాజకీయాలే తెలంగాణ జనసమితి లక్ష్యం. జనం కోసమే జన సమితి–ప్రగతి కోసమే పాలన అన్న నినాదం మాకు మార్గదర్శకం. ప్రొ‘‘ యం. కోదండరాం వ్యాసకర్త తెలంగాణ జన సమితి అధ్యక్షులు -
ఆయనను తెలంగాణ ఎన్నడూ మరువదు: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం నివాళులర్పించారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమం కోసం జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సర్ ను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదని సీఎం అన్నారు. హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన నాటినుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం రగిలే వరకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించుకుంటూ వచ్చి, భావజాల వ్యాప్తికి జయశంకర్ తన జీవితాన్ని ధారపోశారని సీఎం కొనియాడారు. జయశంకర్ సర్ తెలంగాణ సమాజానికి ఎన్నటికీ స్ఫూర్తి ప్రధాతగానే నిలుస్తారన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటనను సీఎంవో కార్యాలయం తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది. -
లండన్ లో ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళి
లండన్: ఎన్నారై టీఆర్ఎస్, తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్దంతి సందర్భంగా నివాళి సభ ఏర్పాటు చేశారు. టాక్ సమస్త కార్యవర్గ సభ్యులు, ప్రవాస తెలంగాణ వాదులు హాజరై జయశంకర్ సార్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముందుగా సార్ చిత్రపటానికి పూలమాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి, జోహార్ జయశంకర్ సార్... జయశంకర్ సార్ అమర్ రహే అంటూ నివాళుర్పించారు. ఎన్నారై టీఆర్ఎస్ అధ్యక్షుడు, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ... తెలంగాణ భావజాల వ్యాప్తిలో జయశంకర్ పాత్ర గొప్పదని, చివరి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమై పనిచేశారని, నేడు సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించుకోవడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు .అనుకున్న ఆశయ సాధనకై ఆయన చేసిన కృషిని ప్రతి వ్యక్తి జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. అలాగే ఇటీవల వరుస దాడులతో యూకే లోని పలు నగరాల్లో ఉగ్రవాదులు చేసిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు సంస్థ తరుపున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఈవెంట్స్ కో ఆర్డినేటర్ రవి ప్రదీప్ పులుసు మాట్లాడుతూ.. జయశంకర్ సార్ జీవితం అందరికి ఒక స్ఫూర్తి సందేశమని, ఈ కార్యక్రమానికి విచ్చేసి సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. సందర్భం ఏదైనా మనమంతా తెలంగాణ సీఎం కేసీఆర్ వెంట ఉండి, జయశంకర్ సార్ ఆశయాల కోసం కృషి చెయ్యాలని, ఇదే మనం వారికిచ్చే ఘన నివాళి అన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షుడు అశోక్ దూసరి, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, అడ్వైజరీ బోర్డు సభ్యులు ప్రవీణ్ కుమార్ వీర, సెక్రటరీ సృజన్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల, యూకే & ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి, ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ రమేష్ యెసంపల్లి, నవీన్ మాదిరెడ్డి, ఈవెంట్స్ కో ఆర్డినేటర్స్ సత్యపాల్ పింగిళి, సత్య చిలుముల, రవి ప్రదీప్, నవీన్ భువనగిరి, తదితరులు హాజరయ్యారు. -
ఆస్ట్రేలియాలో ఘనంగా ‘ఆచార్య జయశంకర్ స్ఫూర్తి సభ’
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ 'ఓవర్సీస్ ప్రెండ్స్ ఆఫ్ టీఆర్ఎస్’ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త, స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ ఐదవ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా వాదులు, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. జయశంకర్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించి తెలంగాణ అమరవీరులను, జయశంకర్‌ను స్మరిస్తూ రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. -
కెనడాలో ఘనంగా ‘తెలంగాణ నైట్’
ఒట్టావా: ప్రొఫెసర్ కోదండరాం ఇచ్చిన స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషిచేసి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను నిజం చేయడానికి పాటుపడతామని తెలంగాణ నైట్ - 2016 నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వారు నిర్వహించిన తెలంగాణ నైట్ - 2016 ఉత్సవాలు కెనడాలోని మిస్సిసాగా నగరంలో ఘనంగా జరిగాయి. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రవాస తెలంగాణ వాసుల పాత్రపై కోదండరాం చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ గ్లోబల్, యూఎస్ఏ ప్రతినిధులు, హైదరాబాద్ డక్కన్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. హైదరాబాద్ వాసి, ఒంటారియో ప్రావిన్స్ ఆరోగ్యశాఖ మంత్రి దీపిక దామెర్ల గౌరవ అతిధిగా హాజరై ఇరు రాష్ట్రాల మధ్య సహకార కార్యక్రమాల గురించి వివరించారు. ఆత్మీయ అతిథిగా ప్రముఖ తెలుగు కళాకారుడు లోహిత్ హాజరై మిమిక్రీతో సభికులను ఆనందింపజేశారు. తెలంగాణ సాహితీవేత్త, డాక్టర్ ఎం.కులశేఖరరావును నిర్వహకులు ఘనంగా సన్మానించారు. తెలంగాణ విద్యా వికాసానికి ఆయన చేసిన సేవలకుగానూ కృతజ్ఞతలు తెలిపారు. సమ్మక్క, సారలమ్మల నృత్యం అందరినీ విశేషంగా ఆకర్షించింది. గ్రేటర్ టొరంటోతో పాటు న్యూయార్క్, రోచెస్టర్, డిట్రాయిట్ నగరాల నుంచి 800 మందికిపైగా తెలంగాణ వాసులు ఈ వేడుకకు హాజరయ్యారు. -
జయశంకర్ స్ఫూర్తితో ముందుకెళ్తాం
సూర్యాపేట ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ స్ఫూర్తితో ఆయన ఆశయాలకనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని తన నివాసంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జయశంకర్‌కు జిల్లాతో ఎంతో అనుబంధం ఉందన్నారు. తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమం చేస్తున్న సమయంలో సీఎం కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ ఉద్యమాన్ని నడిపించడంలో ముందున్నారన్నారు. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం దురదృష్ణకరమన్నారు. కృష్ణా నీళ్లు జిల్లాకు రాకుండా ఆంధ్రాకు పోతున్నాయని, తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి జయశంకర్ అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ బంగారు తెలంగాణలో పాలుపంచుకోవాలన్నారు. ఏ చర్చ జరిగినా సార్‌ను గుర్తు చేసుకోకుండా సీఎం కేసీఆర్ ఏ పని చేయరన్నారు. తెలంగాణ మహోపాధ్యాయుడు, నిరంతరం తెలంగాణ కోసం పోరాడిన గొప్ప వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్కూరి గన్నారెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, మొరిశెట్టి శ్రీనివాస్, ఎంపీపీ వట్టె జానయ్య యాదవ్, గుడిపూడి వెంకటేశ్వర్రావు, కాకి దయాకర్‌రెడ్డి, వుప్పల ఆనంద్, శనగాని రాంబాబుగౌడ్, బూర బాలసైదులుగౌడ్, కుంభం నాగరాజు, పోలెబోయిన నర్సయ్య యాదవ్, కౌన్సిలర్లు ఆకుల లవకుశ, గండూరి పావని, కల్లెపల్లి మహేశ్వరి దశరథ, వనజ, కృపాకర్, బొమ్మగాని శ్రీనివాస్‌గౌడ్, రమాకిరణ్, అనిల్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
'ఉద్యమ నిర్దేశకుడు జయశంకర్ సార్'
సిద్ధిపేట జోన్ (మెదక్): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కేసీఆర్ సారధిగా వ్యవహరించినప్పటికీ ఉద్యమ నిర్దేశకుడు మాత్రం దివంగత ప్రొఫెసర్ జయశంకరే అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. జయశంకర్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలోని మస్తానాబాద్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రొఫెసర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జయశంకర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. తన జీవితం మొత్తాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన గొప్పమనిషి జయంశంకర్ సార్ అని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ సురేష్, ఆర్డీవో ముత్యం రెడ్డి, మెదక్ జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, సిద్దిపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, జేఏసీ రాష్ట్ర ప్రతినిధి, ఆర్ అండ్ బీ ఈఈ బాల్‌నర్సయ్య, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యుడు పాపయ్య, ఓఎస్డీ బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
పోరాటాలు తెలంగాణకు కొత్త కాదు
-
మీ బతుకు మీది.. మా బతుకు మాది
-
మీ బతుకు మీది.. మా బతుకు మాది
* కాదంటే ఎందాకైనా కొట్లాటకు సిద్ధం... వ్యవసాయ వర్సిటీలో కేసీఆర్ వ్యాఖ్య * పోరాటాలు తెలంగాణకు కొత్త కాదు * దమ్ముంటే బాబు మాతో అభివృద్ధిలో పోటీపడాలి * తెల్లారి లేస్తే గొడవలు ఎవరికీ మంచిది కాదు * మా నేతల పేర్లు పెట్టుకుంటే మీకెందుకు ఏడుపు? * మా పిల్లల ఫీజులు మేం కట్టుకుంటాం.. * మంది సొమ్ము మాకొద్దు * పిచ్చి పనులు మానుకోవాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు హితవు * ఎన్జీ రంగా వర్సీటీకి జయశంకర్ వ్యవసాయ వర్సిటీగా నామకరణం సాక్షి, హైదరాబాద్: దమ్ముంటే తమతో అభివృద్ధిలో, మంచి పనుల్లో పోటీ పడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. తెల్లారి లేస్తే గొడవలు పడటం ఎవరికీ మంచిదికాదని హితవు పలికారు. ‘మీ బతుకు మీరు బతకండి.. మా బతుకు మేం బతుకుతాం..’ అని ముక్కుసూటిగా స్పష్టం చేశారు. బుధవారం నాడు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి ‘జయశంకర్ వ్యవసాయ యూని వర్సిటీ’గా కేసీఆర్ నామకరణం చేశారు. ఈ సందర్భంగా వర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ‘మన ఊరు.. మన కూరగాయల పథకం’ సభలో రైతులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. వ్యవసాయ వర్సిటీకి జయశంకర్ పేరు పెట్టడంపై ఆంధ్రావాళ్లు కుళ్లుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ సాధించుకుని మన సంస్థలను మనం విడదీసుకుంటున్నామని, మన నేతల పేర్లు పెట్టుకుంటున్నామని ఆంధ్రావాళ్లు ఒకటే బాధపడుతున్నారని దుయ్యబట్టారు. ‘‘ఇది మా యూనివర్సిటీ. మేం జయశంకర్ పేరు పెట్టుకున్నాం. మీకెందుకు ఏడుపు? ఇది ఆరంభం మాత్రమే. హైదరాబాద్‌లో మార్చేటివి చాలా ఉన్నాయి. మాకు అక్కర్లేని పేర్లు, అక్కర్లేని విగ్రహాలు... మావి కానివి, మాకు తెలియనివి చాలా ఉన్నాయి. ఆంధ్రా ముఖ్యమంత్రికి, మంత్రులకు, అక్కడి ప్రజలకు, మేధావులకు ఒక మాట చెబుతున్నా... మీ బతుకు మీరు బతకండి.. మా బతుకు మేం బతుకుతాం. పొద్దున లేచి పంచాయితీ పెట్టమంటే మేం ఎంతకైనా పెడతాం. కొట్లాటకు తెలంగాణ ఎప్పుడైనా తయారుగానే ఉంటది. మా బతుకే పోరాటం. సాయుధ పోరాటం నుంచి మొదలుపెడితే నేటి దాకా అదే.. మేమేనా భయపడేది? ఇది ఇద్దరికీ మంచిది కాదు. చట్ట ప్రకారం, పద్ధతి ప్రకారం మీది మీరు ఏలుకోండి. మాది మేం ఏలుకుంటాం. దీన్ని పెద్దది చేయొద్దు’’ అని కేసీఆర్ ఆవేశంగా మాట్లాడారు. ‘‘విభజన చట్టంలోని పదో షెడ్యూల్ ప్రకారమే వ్యవసాయ వర్సిటీని వేరు చేసుకున్నాం. మీరు మీ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రాలో బ్రహ్మాండంగా పెట్టుకోండి. ఇక్కడ చదువుకుంటామంటే చట్ట ప్రకారం 15 శాతం సీట్లు ఇస్తాం. మా పిల్లల ఫీజులు మేం కట్టుకుంటాం. మీ పిల్లల ఫీజులు మీరు క ట్టుకోండి’’ అని తేల్చి చెప్పారు. మీ పిల్లల ఫీజులు కట్టుకోలే రా? ఏ రాష్ట్రానికి చెందిన పిల్లలకు ఆ రాష్ర్ట ప్రభుత్వమే ఫీజులు చెల్లించుకోవాలని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు. ఇతరుల సొమ్ము మీద ఆశ పడకుండా.. ఎవరి పని వారు చేసుకుంటే మంచిదని చంద్రబాబుకు హితవు పలికారు. ‘‘ఆంధ్రాలో చ దివే మా పిల్లలకు మేమే ఫీజు కట్టుకుంటాం. లక్షయాభై వేల కోట్ల రూపాయలతో సింగపూర్‌లాంటి రాజధాని కడతామంటరు.. పిల్లల బడిఫీజు కట్టడం చేతకాదా? ఉద్యమ సమయంలో ఎలా మాట్లాడారో ఇప్పుడు కూడా వాళ్లు(ఆంధ్రా) అలాగే మాట్లాడుతున్నారు. అలాంటివేవీ ఇప్పుడు సాగవు. ఆంధ్రా ముఖ్యమంత్రి, మంత్రులారా మీ పిచ్చి పనులు బంద్ చేసుకోండి. మీ మానాన మీరుండండి.. మా మానాన మేముంటం. ఎవరి పని వారు చేసుకుందాం. తెలంగాణలో రాజకీయాల గురించి చంద్రబాబు ఎకసెక్కాలు మాట్లాడుతున్నాడు. ప్రజలకు మంచి పనులు చేయడంలో, అభివృద్ధిలో పోటీ పడండి. మీకు ఇతరుల దాని మీద ఆశ. మాది గాని దాన్ని మాదేనని మేమనం. మాకు అది గిట్టనే గిట్టదు’’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఆరేడు క్రాప్ కాలనీలుగా తెలంగాణ! జిల్లాలవారీగా భూముల రకాలను విశ్లేషించి వేర్వేరుగా పంట కాలనీలు ఏర్పాటు చేస్తామని, ఈ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని సీఎం వెల్లడించారు. ‘జిల్లాలవారీగా ఉష్ణోగ్రత, గాలి తీవ్రత, వర్షపాతం ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ జిల్లా ఏ పంటలకు అనుకూలంగా ఉంది, ఏ మట్టి ఏ పంటలకు అనుకూలంగా ఉందనే అంశాలను గుర్తించి రాష్ట్రాన్ని ఆరేడు పంట కాలనీలుగా విభజిస్తాం. మొత్తం భూసార, భూగర్భ జలాల పరీక్షల్ని ప్రభుత్వమే చేస్తుంది. అవసరమైతే దేశంలోని ప్రయోగశాలలన్నింటినీ కొద్ది నెలలు వినియోగించుకుని.. రెవెన్యూ డివిజన్ల వారీగా పరీక్షలు నిర్వహిస్తాం’ అని కేసీఆర్ తెలిపారు. విత్తనోత్పత్తి ద్వారా ప్రతీ రైతు కోటీశ్వరుడు కావాలని అభిలషించారు. ఈ పంటల కోసం నాణ్యమైన విత్తనాలను అందించడానికి, రైతుల నుంచి ఉత్పత్తులను మార్కెట్ ధరకు కొనడానికి అవసరమైతే తెలంగాణ సీడ్ కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దేశమంతటా తెలంగాణ బ్రాండ్‌తో విత్తనాలను విక్రయిస్తామన్నారు. రాష్ర్టంలో గ్రీన్‌హౌజ్ సాగు పద్ధతిని ప్రోత్సహిస్తామని కేసీఆర్ చెప్పారు. ‘‘గ్రీన్‌హౌజ్ మన దగ్గర ఉన్నదే తక్కువ. రాబోయే రోజుల్లో తెలంగాణలో పెలైట్ ప్రాజెక్టు కింద వెయ్యి ఎకరాల్లో గ్రీన్హౌజ్ను ప్రభుత్వం చేపడుతుంది. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల చుట్టూ ఎక్కడ చూసినా గ్రీన్హౌజే కనపడతది. గ్రీన్హౌజ్లకు కరెంటు బిల్లును మాఫీ చేస్తాం. వీటికిచ్చే విద్యుత్‌ను కూడా వ్యవసాయ విద్యుత్గానే పరిగణిస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని ఏం వెలగబె ట్టిండు? అధికారంలోకి వచ్చి 60 రోజులైనా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న బీజేపీ నేత కిషన్‌రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేసీఆర్ తిప్పికొట్టారు. ‘‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు కిషన్‌రెడ్డి అదే పనిగా మాట్లాడుతున్నడు. 60 రోజుల్లో ఏది కాలేదంటున్నడు. మీ ప్రధానమంత్రే ఏమీ వెలగబెట్టలేదక్కడ. తెలంగాణకు అధికారులను కేటాయించాలని ప్రధానికి 20 ఉత్తరాలు రాశాను. ఇప్పటివరకు కేటాయింపు రాలేదు. మనకు అధికారులు లేరు. తాత్కాలికంగా ఆర్డర్ టూ వర్క్ ఆదేశాలతో కేవలం 40 మందితోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోంది. ప్రధానికి స్వయంగా చెప్పినా.. ఉత్తరాలు రాసినా ఫలితం లేదు. కిషన్‌రెడ్డి.. నీకు అంత దమ్ముంటే ఆ పని చేసుకునిరా. మేం తొందరపడదల్చుకోలేదు. ఇంకా 30 రోజుల దాకా ఏం చేయం. చేసేది పకడ్బందీగా చేస్తాం. పిచ్చి పనులు చేయదలచుకోలేదు. మీరు చేసిన దుర్మార్గాలను కడగాలి. తప్పులను దొరకబట్టాలి. ఇప్పుడు విధాన రూపకల్పన దశలో ఉన్నాం’’ అని వాఖ్యానించారు. పొన్నాలా..సిగ్గులేకుండా మాట్లాడకు! రాష్ర్టంలో విద్యుత్ కష్టాలకు గత టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని, ఇప్పుడు ఆ పార్టీల నేతలే విద్యుత్‌పై తెగ మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ‘సమైక్య రాష్ట్రంలో విద్యుత్ విషయంలో మనకు అన్యాయం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా మూడేళ్ల వరకు పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండదని నేను ఎన్నికల్లోనే చెప్పాను. సోలార్ పవర్‌కు ప్రయత్నిస్తున్నాం. ఛత్తీస్‌గఢ్ నుంచి కొనే ప్రయత్నం చేస్తున్నాం. కేంద్రంతో కూడా పోరాడుతున్నాం. వచ్చే ఏడాదికి పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. మూడేళ్ల తర్వాత రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తాం. ఇది కేసీఆర్ మాట. అప్పటివరకు మీరు సహకరించాలి. ఆవేశపడి రోడ్ల మీదకు రావద్దు. రాజకీయ పార్టీలకు చిల్లర ఆలోచనల ఉంటాయి. వారు మీతో ధర్నా చేయిస్తరు. ఈ రోజు కాంగ్రెస్, టీడీపీ నాయకులు పెద్ద నోరు పెట్టుకొని మాట్లాడుతున్నారు. కరెంటు లేకపోవడానికి ఎవరు బాధ్యులు? ఈ రెండు పార్టీలు కాదా? ఇప్పుడు కరెంటు లేకపోవడానికి ఎవరో కారణమైనట్లు పొన్నాల సిగ్గులేకుండామాట్లాడుతున్నాడు.ఉన్నదున్నట్లు వాస్తవాలు చెబుతాం’ ఆని కేసీఆర్ ధ్వజమెత్తారు. పోస్టల్ స్టాంప్ విడుదల ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా వ్యవసాయ వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జయశంకర్ విగ్రహాన్ని, అనంతరం పైలాన్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం తపాలా శాఖ ప్రత్యేకంగా రూపొందించిన జయశంకర్ పోస్టల్ కవర్, పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. అంతకుముందు విశ్వవిద్యాలయం ఆవరణలోని ఇండోర్ స్టేడియం, అగ్రి బిజినెస్ కేంద్రం, వెటర్నరీ బాలికల వసతి గృహ సముదాయాన్ని, పరీక్షా కేంద్రాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రవాణా మంత్రి పి.మహేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వర్సిటీలో ఇటీవల కేసీఆర్‌కు కట్టిన గుడిని కొందరు చూపించినా.. ఆయన పట్టించుకోకుండా ముందుకు కదిలారు. -
బడిబాటను ఘనంగా నిర్వహించండి
పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ మంచిర్యాల సిటీ : దివంగత ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో ఈ నెల 16 తేదీ నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు నిర్వహించనున్న బడిబాట కార్యక్రమాన్ని జిల్లా ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ కోరారు. ఆదివారం మంచిర్యాలలోని సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బడిబాటకు ప్రభుత్వం జయశంకర్ పేరు పెట్టడం అభినందనీయమన్నారు. పాఠశాల కమిటీ, గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని పండుగను మరిపించే విధంగా విజయవంతం చేయాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల ప్రవేశపు సంఖ్యను పెంచడంతోపాటు, ప్రతీ పిల్లవాడు బడికి ఆకర్షితులయ్యేలా కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులు విద్యాభివృద్ధిలో కూడా అంత కంటే ఎక్కువ శ్రమించాలన్నారు. సమావేశంలో మంచిర్యాల, మందమర్రి సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.గంగాధర్, డి.మల్లేశ్, డి.అరవింద్‌కుమార్ పాల్గొన్నారు. -
రేపటి నుంచి ‘జయశంకర్ బడి పండుగ’
- పాఠశాలల్లో వంద శాతం విద్యార్థుల నమోదే లక్ష్యం - ఆదేశాలు జారీచేసిన పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జగదీశ్వర్ విద్యారణ్యపురి : గతంలో బడిబాట, విద్యాసంబురాలు పేరుతో కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించేవారు. తెలంగాణ రాష్ర్టం ఆవిర్భవించిన నేపథ్యంలో సోమవారం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడి పండుగ పేరు తో జిల్లాలో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఐదు సంవత్సరాల నిండిన పిల్లలను ఒకటో తరగతిలో చేర్పించడం, బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పిస్తారు. వంద శాతం విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించే లక్ష్యంతో ప్రొఫెసర్ జయంశంకర్ పేరుమీదుగా బడి పండుగను నిర్వహించనున్నారు. రేపటి నుంచి 21వ తేదీ వరకు విద్యావారోత్సవాలను జిల్లాలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, సర్వశిక్షాభియాన్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్ ఆదేశాలు జారీచేశారు. విజయవంతం చేయాలి : శ్యాంప్రసాద్‌లాల్, ఎస్ఎస్ఏ పీఓ ప్రొఫెసర్ జయశంకర్ బడి పండుగ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని సర్వశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ శ్యాంప్రసాద్‌లాల్ శనివారం కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాలని సూచించారు. మండల స్థాయిలో మండల విద్యాశాఖాధికారి సమన్వయకర్తగా వ్యవహరించి అన్ని పాఠశాలల్లో బడి పండుగ నిర్వహణకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల అధికారులు టాస్క్‌పోర్స్ కమిటీని ఏర్పాటుచేసి మండలంలోని బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ప్రతి మండలంలోని క్లస్టర్ రిసోర్స్‌పర్సన్(సీఆర్పీ)లు తమ పరిధిలోని పాఠశాలల్లో బడి పండుగను నిర్వహించే ందుకు హెచ్ఎంలకు సహకరించాలన్నారు. ప్రతి రోజు పాఠశాలల నుంచి వివరాలు సేకరించి నిర్దేశించిన ప్రొఫార్మాలో మండలంలో సమర్పించాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు బడి పండుగను ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. కార్యక్రమాల వివరాలు.. - 16న పాఠశాలల్లో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీల సభ్యులు సమావేశాలు నిర్వహించి, పాఠశాల అభివృద్ధిపై చర్చించాలి. - 17న పాఠశాలల్లో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, విద్యార్థులు ఇతర సభ్యులతో ర్యాలీ నిర్వహించాలి. విద్యాహక్కుచట్టంపై విస్తృతంగా ప్రచారం చేయాలి. - 18న ఇంటింటి సర్వే నిర్వహించి బడిఈడు పిల్లలందరిని బడిలో చే ర్పించాలి. పండుగ వాతావరణంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలి. - 19న విద్యాహక్కు చట్టం దినోత్స వం నిర్వహించాలి. విద్యార్థులను పై తరగతులకు పంపించాలి. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫాం పంపిణీ చేయాలి. - 20న బాలికా దినోత్సవం, బాలికల విద్య ప్రాధాన్యాన్ని తెలియజేసే కార్యక్రమాలు నిర్వహించాలి. - 21న ప్రత్యేక అవసరాల పిల్లల దినోత్సవాన్ని నిర్వహించాలి. వారికి కావాల్సిన ఉపకరణాలను పంపిణీ చే యాల్సి ఉంటుంది. మధ్యాహ్న భోజనం పథకం ప్రాధాన్యతను అందరికి తెలియజేయాలి. -
16 నుంచి ‘ప్రొఫెసర్ జయశంకర్ బడి పండుగ’
వారం రోజులపాటు నిర్వహణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనకు పరితపించిన ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో ఈ ఏడాది బడి పండుగ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా విద్యార్థులను స్కూల్లో చేర్పించడం, తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ‘ప్రొఫెసర్ జయశంకర్ బడి పండుగ ’గా నామకరణం చేశారు. ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్యా కమిషనర్, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డెరైక్టర్ జగదీశ్వర్ తెలిపారు. కార్యక్రమాల వివరాలు... 1వ రోజు: స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, పేరెంట్ టీచర్ మీటింగ్ 2వ రోజు: విద్యార్థులు, టీచర్లతో ర్యాలీలు 3వ రోజు: విద్యార్థులను చేర్పించేందుకు ఇంటింటి ప్రచారం, అక్షరాభ్యాసం 4వ రోజు:విద్యాహక్కుచట్టం దినోత్సవం నిర్వహణ, విద్యార్థులను పైతరగతులకు పంపడం. 5వ రోజు: గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్/క్వాలిటీ ఎడ్యుకేషన్/గ్రీన్ ప్లాంటేషన్ డే 6వ రోజు: వికలాంగ విద్యార్థులు/మధ్యాహ్న భోజన పథకం దినోత్సవం. -
కేసీఆర్.. కిలాడీ
భూపాలపల్లి/వర్ధన్నపేట రూరల్/గీసుకొండ/వరంగల్,న్యూస్‌లైన్ : కే అంటే కిలాడీ.. కేసీఆర్ అంటే మాట తప్పే పెద్ద కిలాడీ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడ్డాక కాపలా కుక్క(వాచ్డాగ్) లా పని చేస్తానని చెప్పిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు మొరగడమేంటని విమర్శించారు. ఆదివారం ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నేరుగా భూపాలపల్లి సరి హద్దులోని సీఆర్‌నగర్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి, వర్ధన్నపేట మండలం ఇల్లంద, గీసుకొండ మండలం కోనాయమాకుల, హన్మకొండలో జరిగిన సభల్లో పొన్నాల మాట్లాడారు. తెలంగాణ కోసం ప్రజలందరూ సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం నిర్వహిస్తే.. కేసీఆర్ ఇవేమీ పట్టనట్లు ఫామ్‌హౌస్‌లో గడిపింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆయన ఐదేళ్ల పదవీ కాలంలో పార్లమెంటులో ఒక్క ప్రశ్న వేయలేదని, కనీసం మాట్లాడలేదన్నారు. సీఎంను దళితుడిని చేస్తానని చెప్పి.. ఇప్పుడు అదే కుర్చీ కోసం పాకులాడుతున్నాడని ఆరోపించారు. ప్రొఫెసర్ జయశంకర్ రాజ్యసభ సీటు అడిగితే.. వ్యంగ్యంగా ప్రశ్నించి ఆయనను అవమానించాడన్నారు. అతడి పిట్ట కథలు, తుపాకి రాముడి మాటలు నమ్మేవారెవరూ లేరన్నారు. కేసీఆర్ చేస్తాననేది తెలంగాణ పునర్నిర్మాణం కాదని, కుటుంబ నిర్మాణమని పొన్నాల విమర్శించారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే కేసీఆర్ దృష్టిలో మళ్లీ తెలంగాణలో ధ్వంసమైన భూస్వామ్య, గడీల వ్యవస్థను పునర్నిర్మించడమేనని అన్నారు. పార్లమెంటులో తెలంగాణకు అడ్డుపడ్డ పార్టీలతో మూడో కూటమి ఏర్పాటు చేస్తానని కేసీఆర్ చెబుతున్నాడని, పూటకో మాట మాట్లాడటం ఆయనకు అలవాటై పోయిందన్నారు. ఒక్కో మహిళ రాణిరుద్రమ, సమ్మక్క, సారక్కలై దగాకోరు టీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఎంపీగా గెలిచినా కేసీఆర్ కనీసం అభివృద్ధి చేయలేదన్నారు. తెలంగాణకు ముందుగా లేఖ ఇచ్చి తదుపరి అడ్డుకున్న టీడీపీతో బీజేపీ పొత్తుపెట్టుకోవడం అనైతికమన్నారు. తెలంగాణను బీజేపీ అడ్డుకున్నప్పటికీ సోనియా కృతనిశ్చయంతోనే సాధ్యమైందన్నారు. టీఆర్ఎస్కు కాలం చెల్లింది... టీఆర్ఎస్ పార్టీకి ఇక కాలం చెల్లిందని పొన్నాల అన్నారు. 2009లో మహాకూటమిలో ఉన్న టీఆర్ఎస్ 50 స్థానాల్లో పోటీ చేస్తే 10 స్థానాలు మాత్రమే దక్కాయన్నారు. ఈ ఎన్నికల్లో కనీసం ఆ స్థానాలు కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ మంత్రులు నాలుగు నెలలపాటు మంత్రివర్గ సమావేశాలు, రెండు నెలల పాటు కార్యాలయాలకు వెళ్లకుండా, అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. ఫలితంగా యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. స్వాతంత్య్రం, తెలంగాణ కోసం పోరాడింది, సాధించింది కాంగ్రెస్ పార్టీయేనని, తమ పార్టీని ప్రజలు ఎన్నటికీ మరువబోరన్నారు. కాంగ్రెస్‌తోనే సుస్థిర పాలన, అభివృద్ధి, ఆత్మ గౌరవం లభిస్తుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాలు, ఫించన్‌ను రూ.వెయ్యి, రైతులకు పగటి పూట 12 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.లక్ష వడ్డీ లేని రుణం, సింగరేణిలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తామని పొన్నాల లక్ష్మయ్య హామీ ఇచ్చారు. 60 ఏళ్ల క్రితమే ఉద్యమం.. 60 ఏళ్ల క్రితమే తాను తెలంగాణ కోసం ఉద్యమం చేశానని పొన్నాల లక్ష్మయ్య గుర్తు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటూ రాష్ట్ర సాధన కోసం కృషి చేశానని అన్నారు. తెలంగాణలోని ప్రతీ కుటుంబానికి న్యాయం జరిగేలా కాంగ్రె స్ పార్టీ మేనిఫెస్టోను రూపొందించిందని వివరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ, భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థులు సిరిసిల్ల రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడమే కాక ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీని ఆదరించి తమకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ప్రచార సభల్లో కాంగ్రెస్ నాయకులు రాజారపు ప్రతాప్, పుల్లా భాస్కర్, గండ్ర భూపాల్‌రెడ్డి, గండ్ర సుధాకర్‌రెడ్డి, చల్లూరి సమ్మయ్య, కటకం జనార్దన్, కొత్త హరిబాబు తదితరులు పాల్గొన్నారు. పొన్నాలకు ఘనంగా సన్మానం.. హన్మకొండకు వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. భారీ పూలమాలలు వేసి, శాలువాలు కప్పి సన్మానించారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, నగర అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, నాయకులు, కార్యకర్తలు పోటీపడి సన్మానించారు. -
జయశంకర్ ఆశయాలను సాధిస్తాం
‘తెలంగాణ జాతిపిత’కు జేఏసీ, ఉద్యోగ సంఘాలు, కేసీఆర్ నివాళి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలంగాణ జేఏసీ, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేయడమే తెలంగాణ జాతిపిత అయిన జయశంకర్‌కు నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ జయశంకర్ 79వ జయంతి సందర్భంగా మంగళవారం అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్ వద్ద జేఏసీ, ఉద్యోగ సంఘాల నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీజేఏసీ కోచైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ... నిరాడంబరంగా గడిపిన జయశంకర్ జీవితం తెలంగాణవాదులకు ఆదర్శమన్నారు. వారికి రాజధాని ఏర్పడే వరకే సీమాంధ్రులు హైదరాబాద్‌ను రాజధానిగా భావించాలని, అంతే తప్ప హైదరాబాద్ వారిదని అనుకోకూడదని సూచించారు. ఇక్కడ ఉన్నవారంతా హైదరాబాద్ పౌరులే తప్ప సెటిలర్లు కాదన్నారు. తెలంగాణ కోసం సర్వస్యం త్యాగం చేసిన జయశంకర్ భౌతికంగా తమ మధ్య లేకున్నా.. అందరి హృదయాల్లో కొలువై ఉన్నారని జేఏసీ అగ్రనేత వి.శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలుగు ప్రజలు కలిసి ఉండవద్దనే దురుద్దేశంతోనే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తెరమీదకు తెచ్చారని ఆరోపించారు. తెలంగాణను అడ్డుకునేవారికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. తెలంగాణను అడ్డుకునే కుట్రలను ఎదుర్కొనేందుకు ఉద్యోగులు నిరంతరం జాగరూకులై ఉండాలని ఉద్యోగ సంఘాల నేత దేవీప్రసాద్ కోరారు. సెటిలర్స్ ఫోరం నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన మాట్లాడుతూ తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అదే మైత్రిని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణవాదులు, ఉద్యోగ సంఘాల నేతలు కె.రవీందర్‌రెడ్డి, అద్దంకి దయాకర్, పిట్టల రవీందర్, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జయశంకర్‌కు కేసీఆర్ నివాళి జయశంకర్ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు నివాళి అర్పించారు. తెలంగాణభవన్‌లోని జయశంకర్ విగ్రహం వద్ద పుష్పగుచ్చాలను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.