
ఆయనను తెలంగాణ ఎన్నడూ మరువదు: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదివారం నివాళులర్పించారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమం కోసం జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సర్ ను తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువదని సీఎం అన్నారు.
హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన నాటినుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం రగిలే వరకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించుకుంటూ వచ్చి, భావజాల వ్యాప్తికి జయశంకర్ తన జీవితాన్ని ధారపోశారని సీఎం కొనియాడారు. జయశంకర్ సర్ తెలంగాణ సమాజానికి ఎన్నటికీ స్ఫూర్తి ప్రధాతగానే నిలుస్తారన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటనను సీఎంవో కార్యాలయం తన ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసింది.