బడిబాటను ఘనంగా నిర్వహించండి | Manage richly badibata | Sakshi
Sakshi News home page

బడిబాటను ఘనంగా నిర్వహించండి

Published Mon, Jun 16 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM

బడిబాటను ఘనంగా నిర్వహించండి

బడిబాటను ఘనంగా నిర్వహించండి

పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ
 మంచిర్యాల సిటీ : దివంగత ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో ఈ నెల 16 తేదీ నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు నిర్వహించనున్న బడిబాట కార్యక్రమాన్ని జిల్లా ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించాలని పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ కోరారు. ఆదివారం మంచిర్యాలలోని సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బడిబాటకు ప్రభుత్వం జయశంకర్ పేరు పెట్టడం అభినందనీయమన్నారు.

పాఠశాల కమిటీ, గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని పండుగను మరిపించే  విధంగా విజయవంతం చేయాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల ప్రవేశపు సంఖ్యను పెంచడంతోపాటు, ప్రతీ పిల్లవాడు బడికి ఆకర్షితులయ్యేలా కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులు విద్యాభివృద్ధిలో కూడా అంత కంటే ఎక్కువ శ్రమించాలన్నారు. సమావేశంలో మంచిర్యాల, మందమర్రి సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.గంగాధర్, డి.మల్లేశ్, డి.అరవింద్‌కుమార్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement