సమావేశంలో మాట్లాడుతున్న మధుసూదనాచారి
వనస్థలిపురం: ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని, సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి పిల్లలను బాగా చదివించుకోవాలని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సూచించారు. స్వర్ణకార సమాజం బలమైన శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వనస్థలిపురంలోని బొమ్మిడి లలితా గార్డెన్‌లో ఆదివారం జరిగిన ఆ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సంఘం రాష్ట్ర అధ్యక్షులు వింజమూరి రాఘవా చారి, ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి, కోశాధికారి చంద్రశేఖరాచారి తదితర కార్యవర్గంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వకర్మ భగవానుడు వీరబ్రహ్మేంద్రస్వామి ప్రపంచాన్ని శాసించారని, కానీ విశ్వకర్మీయులు ఇంకా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర నూతన అధ్యక్షులు రాఘవాచారి మాట్లాడుతూ విశ్వకర్మీయులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమి కేటాయించాలని, స్వర్ణకారులపై దాడులను నివారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు చిట్టన్నోజు ఉపేంద్రాచారి, ఏపీ స్వర్ణకార సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్, కందుకూరి పూర్ణాచారి, కన్నెకంటి సత్యం, కీసరి శ్రీకాంత్, ఆర్.సతీష్‌కుమార్, రాచకొండ గిరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment