హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ 'ఓవర్సీస్ ప్రెండ్స్ ఆఫ్ టీఆర్‌ఎస్’ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త, స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ ఐదవ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా వాదులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. జయశంకర్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించి తెలంగాణ అమరవీరులను, జయశంకర్‌ను స్మరిస్తూ రెండు నిముషాలపాటు మౌనం పాటించారు.