సూర్యాపేట
ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ స్ఫూర్తితో ఆయన ఆశయాలకనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని తన నివాసంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జయశంకర్‌కు జిల్లాతో ఎంతో అనుబంధం ఉందన్నారు. తన జీవితాన్ని తెలంగాణకు అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమం చేస్తున్న సమయంలో సీఎం కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ ఉద్యమాన్ని నడిపించడంలో ముందున్నారన్నారు. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం దురదృష్ణకరమన్నారు.
కృష్ణా నీళ్లు జిల్లాకు రాకుండా ఆంధ్రాకు పోతున్నాయని, తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి జయశంకర్ అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ బంగారు తెలంగాణలో పాలుపంచుకోవాలన్నారు. ఏ చర్చ జరిగినా సార్‌ను గుర్తు చేసుకోకుండా సీఎం కేసీఆర్ ఏ పని చేయరన్నారు. తెలంగాణ మహోపాధ్యాయుడు, నిరంతరం తెలంగాణ కోసం పోరాడిన గొప్ప వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్కూరి గన్నారెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, మొరిశెట్టి శ్రీనివాస్, ఎంపీపీ వట్టె జానయ్య యాదవ్, గుడిపూడి వెంకటేశ్వర్‌రావు, కాకి దయాకర్‌రెడ్డి, వుప్పల ఆనంద్, శనగాని రాంబాబుగౌడ్, బూర బాలసైదులుగౌడ్, కుంభం నాగరాజు, పోలెబోయిన నర్సయ్య యాదవ్, కౌన్సిలర్లు ఆకుల లవకుశ, గండూరి పావని, కల్లెపల్లి మహేశ్వరి దశరథ, వనజ, కృపాకర్, బొమ్మగాని శ్రీనివాస్‌గౌడ్, రమాకిరణ్, అనిల్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
జయశంకర్ స్ఫూర్తితో ముందుకెళ్తాం
Published Fri, Aug 7 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement
Advertisement