సూర్యాపేటరూరల్ : దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు జాతరకు రూ.1.7 కోట్లు మంజూరు చేసి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. శనివారం సూర్యాపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎంపీడీఓ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం లింగమంతుల జాతర సందర్భంగా యాదవులకు సంప్రదాయ దుస్తులు, భేరీలను పంపిణీ చేసి మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో పాలకులు తెలంగాణ సంస్కృతిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. పెద్దగట్టు జాతరకు అధికారులు పంపిన నివేదిక కంటే ఎక్కువగా నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. జాతరలో యాదవులు భేరి ధరించి నృత్యం చేస్తుంటే ఆ ఊపు ఏమిటో తెలంగాణ ప్రజలకు మాత్రమే తెలుసన్నారు. గట్టుపైన భక్తులకు ఇబ్బంది లేకుండా విశ్రాంతి భవనాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడగకుండానే అన్నీ ఇస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా యాదవులకు ఈ సంవత్సరం 20 లక్షల గొర్రెలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం గ్రామానికి 15 మంది యాదవులను ఎంపిక చేసి మొత్తం 50 యూనిట్ల భేరీలు, సంప్రదాయ దుస్తులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.
సూర్యాపేట జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ మాట్లాడుతూ యాదవులకు రూ.10 లక్షల వ్యయంతో సంప్రదాయ దుస్తులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. పెద్దగట్టుపై కోనేరును ఆధునికీకరించినట్లు పేర్కొన్నారు. అనంతరం టీఆర్‌ఎస్ ప్రభుత్వం సూర్యాపేట మండలంలో చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ స్థానిక ఎంపీపీ వట్టే జానయ్యయాదవ్ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు సూర్యాపేట పట్టణంలోని గొల్లబజారులో మకరతోరణం తరలింపు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ ధరావత్ శకుంతల, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళ్లిక, వైస్ చైర్మన్ నేరేళ్ల లక్ష్మి, ఆర్డీఓ మోహన్‌రావు, పెద్దగట్టు చైర్మన్ సుంకరబోయిన శ్రీనివాస్‌యాదవ్, గొర్రెల కాపరుల సహకార యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పోలెబోయిన నర్సయ్యయాదవ్, బడుగు లింగయ్యయాదవ్, సూర్యాపేట ఎంపీడీఓ నాగిరెడ్డి, తహసీల్దార్ మహమూద్‌అలీ, టీఆర్‌ఎస్ మం డల అధ్యక్షుడు మోదుగు నాగిరెడ్డి, నాయకులు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, ముదిరెడ్డి అశోక్‌రెడ్డి, చల్లా సురేందర్‌రెడ్డి, కక్కిరేణి నాగయ్యగౌడ్, వెన్న చంద్రారెడ్డి, గొర్ల గన్నారెడ్డి, బుడిగె నవీన్‌గౌడ్, సంకరమద్ది రమణారెడ్డి, మాద కృష్ణ, మచ్చ మల్సూర్, పాముల హనుమంతు పాల్గొన్నారు.
పెద్దగట్టు అభివృద్ధికి కృషి
Published Sun, Feb 12 2017 2:35 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
Advertisement
Advertisement