Peddagattu jatara
-
మకర తోరణం తరలింపుతో ముగిసిన పెద్దగట్టు జాతర
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలో కొలువైన శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ముగిసింది. గురువారం రాత్రి మకర తోరణాన్ని సూర్యాపేటలోని గొల్ల బజారుకు చెందిన వల్లపు, కోడి వంశస్తులు తీసుకువెళ్లడంతో జాతర ముగిసినట్లు పూజారులు ప్రకటించారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. చివరి రోజు కూడా భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు చేపట్టారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన 28 హుండీల ద్వారా రూ. 25.71 లక్షల ఆదాయం వచ్చింది. అదే విధంగా 550 గ్రాముల వెండి, రెండు గ్రాముల బంగారం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
వైభవంగా లింగన్న కల్యాణం (ఫొటోలు)
-
నల్గొండ జిల్లా : తెలంగాణలో రెండవ అతిపెద్ద లింగమంతుల స్వామి జాతర (ఫొటోలు)
-
పర్యాటక ప్రదేశాల ఖిల్లా.. సూర్యాపేట జిల్లా
దురాజ్‌పల్లి (సూర్యాపేట) : పర్యాటక ప్రదేశాలకు నిలయం సూర్యాపేట జిల్లా అలరారుతోంది. జిల్లాలో అతి పురాతన కట్టడాలు సంస్కృతికి అద్దం పడుతాయి. తెలంగాణ– ఆంద్రప్రదేష్ రాజాధానులకు 143 కిలో మీటర్ల సమాన దూరంలో ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో అనేక అపురూప కట్టడాలు పర్యాటక ప్రదేశాలుగా కొనసాగుతున్నాయి. జిల్లాలో చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలు పర్యాటకులకు కను విందుగొలుపుతాయి. పురాతన కట్టడాలు, ఎతైన కొండలు, దట్టమైన అడవులు, ప్రాచీన శిలాయుగం నాటి రాక్షసగుళ్ళు, క్రీస్తు పూర్వం నాటి భౌద్దస్తూపాలు, కాకతీయుల కాలంనాటి ప్రసిద్ధి శివాలయాలు, అపురూప శిల్పలు, మండపాలు, మూసి రిజర్వయర్ ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలకు నిలయం సూర్యాపేట జిల్లా. కాకతీయుల కళ నైపుణ్యం అద్దం పటే పిల్లలమర్రి... జిల్లా కేంద్రానికి 3 కిలో మీటర్ల దూరంలో 65 నెంబర్ జాతీయ రహదారికి 1 కిలో మీటర్ దూరంలో ఉన్న పిల్లలమర్రి గ్రామం కాకతీయుల కాలంనాటి శివాలయాలు వారి కాల నైపుణ్యానిక అద్దం పడుతున్నాయి. క్రి.శ 1203లో కాకతీయ సామంతరాజు అయిన రేచర్ల వంశానికి చెందిన బేతిరెడ్డి పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించినట్లు శిలాశాసనాలు తెలుపుతున్నాయి. ఇక్కడ నిర్మించిన శివాలయాలు ఎంతో ప్రసిద్ది చెందాయి. ఎర్రకేశ్వర ఆలయం, త్రికూటేశ్వరాలయం, నామేశ్వరాలయాలు కాకతీయుల కళానైపుణ్యానికి అద్దం పడుతాయి. శిలాశాసనాలు, వైవిద్యభరితమైన శిల్పాలు ఈ ఆలయాలలో ఉంటాయి. సప్త స్వరాలను వినిపించే రాలిస్తంబం, రాతి కట్టడాలు ఇక్కడి ప్రత్యేకత. ఈ దేవాలయాలలో వార్షిక ఉత్సవాలు ఫిబ్రవరి– మార్చి మాసంలో జరుగుతాయి. ఇక పిల్లలమర్రి పినవీరభద్రుడు జన్మించిన గ్రామం పిల్లలమర్రి. ఫణిగిరిలో ప్రసిద్ధ భౌద్ధక్షేత్రం.... జిల్లా కేంద్రానికి 40 కిలో మీటర్ల దూరంలో జనగాం రహదారిపై ఉన్న ఫణిగిరి గ్రామం ప్రసిద్ద బౌద్ధక్షేత్ర పర్యాటక ప్రదేశంగా వెలుగొంతున్నది. ఫణిగిరి కొండపై 16 ఎకరాల విస్తీర్ణంలో క్రీ. పూ 1–3 ఎడి శతాబ్దం నాటి భౌద మహాస్తూపం, మందమైన ఇటుకలతో నిర్మాంచిన చైత్యగదులు, విహారాలు, పాలరాతి శిల్పాలు,భౌద జాతక కథలతో చెక్కిన తోరణాలు, బ్రహ్మలిపిలో ఉన్న శిలా శాసనాలు ఈ ప్రాంత ప్రత్యేకతను చాటుతాయి. పురావస్తుశాఖ జరిపిన తవ్వకాలలో రోమన్ రాజుల కాలంనాటి బంగారు, వెండి, గాజు, రాగి, నాణాలు దొరికాయి. వీటియి కొండపై భద్రపరిచారు. ఇలా తొవ్వకాలలో బయటపడిన వస్తువులు ప్రాచీన కాలం నాటి ఆనవాళ్లకు ఆధారాలుగా నిలుస్తున్నాయి పురాతన గిరిదుర్గం.. ఉండ్రుగొండ ప్రసిద్ధి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పొడవైన పురాతన గిరిదుర్గంగా ప్రసిద్ధి పొందిన కట్టడాలు ఉన్న ప్రాంతం ఉండ్రుగొండ. జిల్లా కేంద్రానికి 8 కిలో మీటర్ల దూరంలో జాతీయ రహదారికి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఉండ్రుగొండ చారిత్రక కట్టడాలకు పెట్టింది పేరు. చుట్టు కొండలు, దట్టమైన అడవి మద్య ఆద్యత్మికత ఉట్టి పడే విధంగా లక్ష్మీ నర్సింహ్మస్వామి ఆలయం ఉంటుంది. దేశంలోనే ప్రసిద్ధి పొందిన ఉండ్రుగొండ కోట చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. 1370 ఎకరాల విస్తీర్ణంలో నిగనిగలాడే చెట్ల చెట్ల మద్య 9 కొండలను కలుపుతూ 14 కిలో మీటర్ల పొడవులన నిర్మించిన ఎత్తైన దుర్గప్రాకారాలు, కొలనులు, కొండపైన ఉన్న గొలుసుకట్టు నీటి కుంటలు, గృహాల దార్మికతను వెల్లివిరిసే పురాతన దేవాలయాలు ఉండ్రుగొండ ప్రత్యేకత. శాతవాహనులు, కళ్యాణచాళుక్యులు, కాకతీయులు, కుతుబ్షాహాన్లు, రేచర్లరెడ్డి రాజులు, పద్మనాయకులు ఈ కోటను అభివృధ్ది చేసినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఈ గుట్టలపై శ్రీ లకక్ష్మీ నరసింహస్వామి, గోపాలస్వామి, కాలభైరవుడు, రాజభవనాలు, నర్తకీమణుల గృమాలు, బోగందానిగద్దెమంటపం, చాకలిబావి, మంత్రిబావి, నాటి చారిత్రక వైభవానికి ప్రతీకలుగా ఉన్నాయి. కొండపై నుంచి నాగుల పాహడ్శివాలయం వరకు సొరంగమార్గం ఉండేదని ఈ ప్రాంత ప్రజలు చెపుతుంటారు. తెలంగాణ అతి పెద్ద జాతర... పెద్దగట్టు లింగన్న జాతర తెలంగాణలో సమ్మక్క– సారలమ్మ జాతర తరువాత రెండవ అతిపెద్ద జాతర జరిగేది సూర్యాపేట జిల్లాలోనే. సూర్యాపేటకు 7 కిలో మీటర్ల దూరంలో దురాజ్‌పల్లి గ్రామంలో ఉన్న పెద్దగట్టు(గొల్లగట్టు) ఏటేటా అభివృద్ధిచెందుతూ పర్యాటక ప్రదేశంగా ఎదుగుతున్నది. ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి జరిగే జాతరకు తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కోరిన మొక్కులను తీర్చే స్వామిగా పేరొందిన లింగన్న దర్శనానికి ఇప్పుడు ప్రతి రోజు భక్తులు వస్తున్నారు. మత సమైక్యతకు చిహ్నం.. జానపహడ్ దర్గా.. కుల మతాలకు అతీతంగా దర్శించుకునే ప్రదేశం సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని జాన్‌పహడ్ దర్గా.. 4 శతాబ్దాల చరిత్ర గల ఈ ధర్గాలో హజ్రత్ సయ్యద్ మోహినుద్ధీన్షా, జాన్సాక్షహిద్రహమత్తుల్లా సమాధులు ఉన్నాయి. ఈ దర్గాను మానవత్వనికి, త్యాగానికి చిహ్నంగా భావిస్తారు. ఇక్కడ ఉర్సు సందర్భంగా పంచే గందానికి ప్రత్యేకత ఉంది. ఈ దర్గా పర్యాటక ప్రదేశంగా కొనసాగుతున్నది. ఇవే కాకుండా ప్రత్యేక గల అనేక దేవాలయాలు, కట్టడాలు జిల్లాలో ఉన్నాయి. నాగులపహడ్ శివాలయం, మట్టంపల్లి లక్ష్మినర సింహస్వామి ఆలయం, సూర్యాపేట వెంకటేశ్వరస్వామి దేవాలయ, మిర్యాలలో సీతరామచంద్రస్వామి దేవస్థానం, అర్వపల్లిలో లక్ష్మినరసింహస్వామి ఆలయం, దర్గా తదితర ప్రదేశాలు పర్యాటక శోభను సంతరించుకున్నాయి. -
భక్తజన సంద్రం.. పెద్దగట్టు
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: పెద్దగట్టు (గొల్లగట్టు) భక్త జన సంద్రమైంది. సూర్యాపేట జిల్లాలోని కేసారం గ్రామంలో లింగమంతుల స్వామి కొలువైన ఈ గట్టుకు భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు ‘ఓ లింగా’నామస్మరణతో మార్మోగాయి. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దేవరపెట్టె ఆలయానికి చేరుకోవడంతో జాతర ప్రారంభమైంది. రెండో రోజు సోమవారం బోనాల సమర్పణకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆలయ ప్రాంతంకిక్కిరిసింది. మన రాష్ట్రంతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దగట్టుకు పోటెత్తారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు లింగమంతుల స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారు జామునుంచి బోనాల సమర్పణ.. తెల్లవారుజాము నుంచి మొదలైన బోనాల సమర్పణ, గంపల ప్రదక్షిణ రాత్రి పొద్దుపోయే వరకు భక్తిశ్రద్ధలతో సాగింది. ఎండ బాగా ఉన్నా, ఆలయం చుట్టూ చలువ పందిళ్లు వేయడంతో జాతరకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడకుండా దర్శనం చేసుకున్నారు. కరోనా భయం ఉన్నా భక్తులు భారీ ఎత్తున తరలిరావడం గమనార్హం. స్వామి దర్శనం తర్వాత భక్తులు యాటపోతులను బలిఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తులు బోనమెత్తుకొని చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇక మూడో రోజు మంగళవారం ప్రధాన ఆలయం ముందు పూజారులు చంద్రపట్నం వేయనున్నారు. జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి పెద్దగట్టు పైనే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కనుల పండువగా జాతర స్వరాష్ట్రంలో కనుల పండువగా పెద్దగట్టు జాతర జరుగుతోందని, ఈ జాతరకు ప్రాశస్త్యాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. యాదవుల మీద ఉన్న అభిమానంతో ప్రభుత్వం పెద్దగట్టుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందన్నారు. కాళేశ్వరం జలాల ప్రభావం పెద్దగట్టు జాతరపై స్పష్టంగా కనిపిస్తోందని, జాతరకు తరలివస్తున్న రైతుల కళ్లల్లో ఆనందమే ఇందుకు నిదర్శనమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. లింగమంతుల స్వామి యాదవుల ఇలవేల్పని, స్వామి కరుణాకటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ స్వామిని దర్శించుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పెద్దగట్టు జాతర ప్రారంభం
సూర్యాపేట: లింగా ఓ లింగా నామస్మరణతో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని శ్రీ లింగమంతులస్వామి ఆలయం మార్మోగింది. రెండేళ్లకోసారి జరిగే శ్రీ లింగమంతులస్వామి (గొల్లగట్టు) జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం అర్ధరాత్రి గంపల ప్రదక్షిణలతో వేడుకలు మొదలయ్యాయి. సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో దేవరపెట్టెకు విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేసి తరలించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యాదవులు ఈ పెట్టెను కాలినడక పెద్దగట్టుకు చేర్చారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యాదవులు సంప్రదాయ దుస్తుల్లో డోలు వాయిద్యాలు, భేరీ చప్పుళ్లు, కటారు విన్యాసాలు చేస్తూ గట్టుపైకి చేరుకున్నారు. మొదటి రోజు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం భక్తులు లక్షల్లో తరలిరానున్నారు. చౌడమ్మతల్లికి బోనాలు సమర్పించనున్నారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ అమయ్‌కుమార్ పాల్గొన్నారు. -
జాతరకు పెద్దగట్టు ముస్తాబు
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: యాదవుల ఆరాధ్య దైవం కొలువుండే గొల్ల (పెద్ద) గట్టు.. లింగమంతులస్వామి జాతరకు ముస్తాబైంది. ఆదివారం నుంచి ఈనెల 28 వరకు జాతర జరగనుంది. గట్టుపై లింగమంతులస్వామి ఆలయానికి రంగులు వేయడం, ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, గట్టు కింద భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులు పూర్తయ్యాయి. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 10 కి.మీ దూరంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పక్కనే దురాజ్‌పల్లి వద్ద పెద్దగట్టుపై లింగమంతులస్వామి ఆలయం ఉంది. ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున యాదవులు తరలిరానుండటంతో అధికార యంత్రాంగం జాతరకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సమ్మక్క జాతర తర్వాత అతిపెద్దది.. సమ్మక్క, సారలమ్మల జాతర తర్వాత అతిపెద్దదిగా గొల్లగట్టు లింగమంతులస్వామి జాతరకు పేరుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. పూర్వకాలంలో యాదవరాజులు ఉండ్రుగొండ గుట్ట మీద శివాలయం, లక్ష్మీనర్సింహస్వామి, లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి, ఆంజనేయుడి దేవాలయాలు కట్టించారని పెద్దలు చెబుతుంటారు. ఆదివారం రాత్రితో ప్రారంభం.. సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవరపెట్టెను తీసుకొని యాదవ, రెడ్డి కులస్తులు కాలినడకన బయలుదేరి దురాజ్‌పల్లిలో ఉన్న గొల్లగట్టు (పెద్దగట్టు)కు ఆదివారం రాత్రి చేరుకుంటారు. అనంతరం పూజలతో మొదటి రోజు ఘట్టం పూర్తవుతుంది. రెండో రోజు బోనాలు, మూడో రోజు చంద్రపట్నం, నాలుగో రోజు నెలవారం, ఆతర్వాత ఐదోరోజు జాతర ముగుస్తుంది. రూ.1.71 కోట్లతో అభివృద్ధి పనులు.. జాతరకు ప్రభుత్వం ఈ సారి ప్రత్యేకంగా రూ.1.71 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో నూతనంగా కల్యాణ కట్ట, పూజారుల గదులు, విశ్రాంతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వాహణకు ఏర్పాట్లు చేశారు. భక్తులు మంచినీటికి ఇబ్బందులు పడకుండా జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఇమాంపేట మిషన్ భగీరథ ప్లాంట్ నుంచి పెద్దగట్టుకు ప్రత్యేకంగా పైపులైన్ వేశారు. గుట్ట కింద ఖాసీంపేట దారిలో గత ఏడాది కోనేటిని నిర్మించారు. కాగా, మూసీ కాలువ పరిధిలో గట్టుకు చుట్టు పక్కల ఉన్న చెరువుల్లో నీళ్లు అడుగంటాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈ చెరువులను మూసీ కాలువతో నింపాలని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాజెక్టు అధికారులను రెండు రోజుల క్రితం ఆదేశించారు. దీంతో ఈ చెరువులకు నీటిని విడుదల చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీ పారిశుధ్య నిర్వాహణకు 240 మంది సిబ్బందిని కేటాయించింది. జాతర ప్రాంతంలో మొత్తం ఏడు వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి పక్కన ఆర్టీసీ బస్టాండ్.. గుట్ట కింద జాతీయ రహదారి పక్కనే ఆర్టీసీ బస్సులను నిలిపేందుకు బస్టాండ్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ డిపోల నుంచి 85 బస్సులను జాతరకు స్పెషల్‌గా నడుపనున్నారు. అలాగే భక్తులకు ఎలాంటి పార్కింగ్ సమస్య లేకుండా మొత్తం మూడు చోట్ల 50 ఎకరాల్లో ప్రైవేటు వాహనాలకు పార్కింగ్ స్థలాలను గుర్తించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకుగాను 1200 మంది పోలీసులు బందోబస్తు చేపడుతున్నారు. 46 సీసీ కెమెరాలతో జాతరను పోలీస్ అధికారులు పర్యవేక్షించనున్నారు. -
లింగా.. ఓ లింగా..
మార్మోగిన పెద్దగట్టు సాక్షి, సూర్యాపేట: లింగా.. ఓ లింగా.. అంటూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలోని లింగమంతుల స్వామి జాతర ప్రాంగణం మార్మోగింది. జాతర ఆదివారం రాత్రి ప్రారంభమైంది. మొదటి రోజు దేవపెట్టె పెద్దగట్టు దేవాలయానికి చేరింది. అనంతరం యాదవ కులస్తులు గుడిచుట్టూ గంపల ప్రదక్షిణ చేశారు. రెండేళ్ల క్రితం నెలవారం తర్వాత సూర్యాపేట రూరల్ మండలంలోని కేసారం గ్రామం లోని మెంతబోయిన, గోర్ల, మున్న వంశీయులు దేవరపెట్టెను తీసుకెళ్లారు. సంప్రదాయం ప్రకారం దేవరపెట్టెను తీసుకురా వాలని యాదవ కులస్తులను కలెక్టర్, ఎస్పీలు కోరారు. దీంతో రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ సురేంద్రమోహన్, ఎస్పీ పరిమళ హననూతన్, జేసీ సంజీవరెడ్డి కేసారం గ్రామానికి చేరుకున్నారు. దేవరపెట్టె ఉన్న మెంతబోయిన ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత యాదవ కులస్తులు దేవర పెట్టెను తరలించే తంతు నిర్వహించారు. ఆ పెట్టెను యాదవ పూజారులు భుజాలపై పెట్టుకొని ముందు నడవగా, గజ్జెల లాగులు, భేరీ చప్పుళ్లు, కటార్ల విన్యాసాలతో పాటు.. ఓలింగా.. ఓలింగా.. నామస్మరణల మధ్య కేసారం గ్రామం నుంచి కాలినడకన ఆరు కిలోమీట్ల దూరంలో ఉన్న దురాజ్ పల్లి (పెద్దగట్టు) దేవాలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజ లతో దేవాలయ ప్రవేశం చేశారు. అనంతరం మెంతబోయిన, మున్న, గొర్ల(రెడ్డి) వంశీయులు తెచ్చిన బియ్యం, ఇతర పూజా సామగ్రితో వచ్చిన గంపల ప్రదక్షిణ నిర్వహించారు. -
పెద్దగట్టు అభివృద్ధికి కృషి
సూర్యాపేటరూరల్ : దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు జాతరకు రూ.1.7 కోట్లు మంజూరు చేసి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. శనివారం సూర్యాపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎంపీడీఓ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం లింగమంతుల జాతర సందర్భంగా యాదవులకు సంప్రదాయ దుస్తులు, భేరీలను పంపిణీ చేసి మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో పాలకులు తెలంగాణ సంస్కృతిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. పెద్దగట్టు జాతరకు అధికారులు పంపిన నివేదిక కంటే ఎక్కువగా నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. జాతరలో యాదవులు భేరి ధరించి నృత్యం చేస్తుంటే ఆ ఊపు ఏమిటో తెలంగాణ ప్రజలకు మాత్రమే తెలుసన్నారు. గట్టుపైన భక్తులకు ఇబ్బంది లేకుండా విశ్రాంతి భవనాన్ని నిర్మించేందుకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడగకుండానే అన్నీ ఇస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా యాదవులకు ఈ సంవత్సరం 20 లక్షల గొర్రెలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం గ్రామానికి 15 మంది యాదవులను ఎంపిక చేసి మొత్తం 50 యూనిట్ల భేరీలు, సంప్రదాయ దుస్తులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కె.సురేంద్రమోహన్ మాట్లాడుతూ యాదవులకు రూ.10 లక్షల వ్యయంతో సంప్రదాయ దుస్తులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. పెద్దగట్టుపై కోనేరును ఆధునికీకరించినట్లు పేర్కొన్నారు. అనంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం సూర్యాపేట మండలంలో చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ స్థానిక ఎంపీపీ వట్టే జానయ్యయాదవ్ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. అంతకుముందు సూర్యాపేట పట్టణంలోని గొల్లబజారులో మకరతోరణం తరలింపు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ ధరావత్ శకుంతల, మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళ్లిక, వైస్ చైర్మన్ నేరేళ్ల లక్ష్మి, ఆర్డీఓ మోహన్‌రావు, పెద్దగట్టు చైర్మన్ సుంకరబోయిన శ్రీనివాస్‌యాదవ్, గొర్రెల కాపరుల సహకార యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పోలెబోయిన నర్సయ్యయాదవ్, బడుగు లింగయ్యయాదవ్, సూర్యాపేట ఎంపీడీఓ నాగిరెడ్డి, తహసీల్దార్ మహమూద్‌అలీ, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు మోదుగు నాగిరెడ్డి, నాయకులు మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, ముదిరెడ్డి అశోక్‌రెడ్డి, చల్లా సురేందర్‌రెడ్డి, కక్కిరేణి నాగయ్యగౌడ్, వెన్న చంద్రారెడ్డి, గొర్ల గన్నారెడ్డి, బుడిగె నవీన్‌గౌడ్, సంకరమద్ది రమణారెడ్డి, మాద కృష్ణ, మచ్చ మల్సూర్, పాముల హనుమంతు పాల్గొన్నారు.