పెద్దగట్టు నుంచి మకర తోరణాన్ని సూర్యాపేట పట్టణంలోని గొల్ల బజారుకు తరలిస్తున్న వల్లపు, కోడి వంశస్తులు, యాదవులు
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లిలో కొలువైన శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ముగిసింది. గురువారం రాత్రి మకర తోరణాన్ని సూర్యాపేటలోని గొల్ల బజారుకు చెందిన వల్లపు, కోడి వంశస్తులు తీసుకువెళ్లడంతో జాతర ముగిసినట్లు పూజారులు ప్రకటించారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
చివరి రోజు కూడా భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు చేపట్టారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన 28 హుండీల ద్వారా రూ. 25.71 లక్షల ఆదాయం వచ్చింది. అదే విధంగా 550 గ్రాముల వెండి, రెండు గ్రాముల బంగారం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment