కనులపండువగా లింగమంతుల స్వామి కల్యాణం  | Huge Devotees At Peddagattu Lingamanthula Swamy Jathara | Sakshi
Sakshi News home page

కనులపండువగా లింగమంతుల స్వామి కల్యాణం 

Published Wed, Feb 8 2023 1:52 AM | Last Updated on Wed, Feb 8 2023 8:36 AM

Huge Devotees At Peddagattu Lingamanthula Swamy Jathara - Sakshi

విద్యుత్‌ కాంతుల వెలుగుల్లో పెద్దగట్టు జాతర ప్రాంతం. భారీగా జనసందోహం, చంద్రపట్నం వేస్తున్న దృశ్యం 

సూర్యాపేట: దురాజ్‌పల్లి శ్రీ లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు మంగళవారం భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. మూడవ రోజు మంగళవారం యాదవ పూజారులు చంద్రపట్నం వేసి భక్తిశ్రద్ధలతో శ్రీ లింగమంతుల స్వామి, మాణిక్యమ్మల కల్యాణం జరిపించారు.

చంద్రపట్నంపై లింగమంతుల స్వామి వారు ఉన్న పెట్టెను ఉంచి పూజలు చేశారు. చంద్రపట్నం ముందు మెంతబోయిన, మున్న, బైకాను వంశస్తులు బియ్యంతో పోలు పోసి తమలపాకులు, పోకలు, ఖర్జూరాలు ఉంచి స్వామివారి కథలతో కల్యాణ తంతు నిర్వహించారు. జాతరలో నాలుగో రోజు బుధవారం నెలవారం కార్యక్రమం నిర్వహించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement