స్టేజ్‌పై స్టెప్పులతో ఇరగదీసిన ఎంపీ | MP Madhukar Kukde Sets The Stage On Fire To Aankh Marey | Sakshi
Sakshi News home page

స్కూల్‌ ఫంక్షన్‌లో ఎంపీ డ్యాన్స్‌లు..

Published Mon, Jan 7 2019 8:00 PM | Last Updated on Mon, Jan 7 2019 8:22 PM

MP Madhukar Kukde Sets The Stage On Fire To Aankh Marey - Sakshi

సాక్షి, ముంబై : రాజకీయ నేతలంటే ఖాకీ దుస్తుల్లో ఒద్దికగా, హుందాగా కనిపిస్తారనుకునే అభిప్రాయాన్ని ఈ ఎంపీని చూస్తే మార్చుకోవాల్సిందే.  ఓ పాఠశాల కార్యక్రమానికి హాజరైన ఎంపీ  సినిమా పాటకు తన అభినయం జోడిస్తూ నృత్యాలతో హోరెత్తించారు. రాజకీయ నేతల్లోనూ భిన్న కోణాలుంటాయనే సంకేతాలను పంపుతూ ఆ ఎంపీ వేదికపై చెలరేగారు.

మహారాష్ట్రలోని బండారా- గోండియా నియోజకవర్గానికి ఎంపీగా వ్యవహరిస్తున్న ఎన్సీపీ నేత మధుకర్‌ కుక్డే చిన్నారులతో కలిసి సింబా సినిమాలోని పాటకు నృత్యం చేస్తున్న వీడియో వైరల్‌ అవుతోంది. ఈ మూవీలోని ఆంఖ్‌ మారో పాటకు నృత్యం చేస్తున్న విద్యార్ధినుల ఆహ్వానం మేరకు ఎంపీ ఆయన అనుచరులు వేదికపై చిన్నారులతో కలిసి కాలు కదిపారు. బందారా ప్రాంతంలోని ఓ పాఠశాల వేడుకలో ఎంపీ నృత్యంలో తన నైపుణ్యం చాటుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement