సీనియర్ నటితో మెగాస్టార్ స్టెప్పులు.. సోషల్ మీడియాలో వైరల్ | Megastar Chiranjeevi Dance At Reunion party In Mumbai Goes Viral | Sakshi
Sakshi News home page

Megastar: స్టెప్పులతో అదరగొట్టిన చిరంజీవి.. సోషల్ మీడియాలో వైరల్

Nov 20 2022 5:59 PM | Updated on Nov 20 2022 6:03 PM

Megastar Chiranjeevi Dance At Reunion party In Mumbai Goes Viral - Sakshi

ఫిల్మ్ ఇండస్ట్రీలో 80వ దశకంలోని నటీనటులు ఇటీవలే ముంబైలో కలిసిన విషయం తెలిసిందే. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీల్లోని సీనియర్ స్టార్స్ అందరూ ఒకేచోట కనిపించి సందడి చేశారు. అలనాటి రోజులను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్‌ చేశారు. ఈ రీయూనియన్‌ వేడుకలో మెగాస్టార్ తన డ్యాన్స్‌తో ఊపేశారు. ఓ సీనియర్‌ నటితో కలిసి స్టెప్పులేశారు. ఆ వీడియోను ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్‌ ఖేర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరవుతోంది. 

(చదవండి:  ముంబైలో సీనియర్ స్టార్స్ సందడి.. ఫోటోలు వైరల్‌)

మెగాస్టార్‌తో పాటు సీనియర్ నటి సుహాసిని కూడా కాలు కదిపారు. మరో బాలీవుడ్‌ నటుడు అనిల్ కపూర్ సైతం స్టెప్పులేశారు. ముంబైలో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ ఆతిథ్యమిచ్చారు. ఈ వేడుకలో టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి, వెంకటేశ్‌, నరేశ్‌, భానుచందర్‌, నదియా, రమ్యకృష్ణ, విద్యాబాలన్‌, సుహాసిని, జయప్రద, రాధ, శోభన, భానుచందర్‌, అనుపమ్‌ ఖేర్‌, శరత్‌ కుమార్‌, అర్జున్‌, అనిల్‌ కపూర్‌ తదితరులు పాల్గొన్నారు. 2020లో జరిగిన రీయూనియన్‌ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement