సాలార్‌జంగ్ మ్యూజియంలో ఫోటోల ప్రదర్శన | photo exhibition at the salarjang museum | Sakshi
Sakshi News home page

సాలార్‌జంగ్ మ్యూజియంలో ఫోటోల ప్రదర్శన

Published Wed, Dec 16 2015 8:08 PM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM

photo exhibition  at the salarjang museum

సాలార్‌జంగ్ మ్యూజియం వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్‌ను మ్యూజియం డెరైక్టర్ డాక్టర్ ఎ. నాగేందర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. దివాన్‌దేవిడిలో ఉన్న సాలార్‌జంగ్ మ్యూజియం విశేషాలను, కట్టడాలను చిత్రాల రూపంలో ఈ ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేశారు.

ఈ ఎగ్జిబిషన్‌కు మ్యూజియంలో పని చేసిన పదవీ విరమణ చేసిన వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వనించారు. మ్యూజియం సంరక్షణకు అప్పట్లో వారు తీసుకున్న చర్యలు, సూచనలు, సలహాలు, వారి పాత జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మ్యూజియం కీపర్ డాక్టర్ కేధారేశ్వరి అప్పటి కళాఖండాల విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో  బి.ఆర్. నాయక్, డాక్టర్ కుసుంతో పాటు మ్యూజియం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement