
చిత్రకళా పరిషత్‌లో ఏర్పాటు చేసిన ఓ ఫొటో ఎగ్జిబిషన్‌లో హీరో యశ్‌ను సరదాగా ఫొటో తీస్తున్న హోం మంత్రి రామలింగారెడ్డి
జయనగర: చిత్రకళా పరిషత్‌లో ఫొటో జర్నలిస్టŠస్ అసోసియేషన్ ఆఫ్ బెంగళూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శకులను కనువిందు చేస్తోంది. ఫొటో జర్నలిస్టŠస్ ఆఫ్ బెంగళూరు అసోసియేషన్ సభ్యులు తీసిన ఛాయాచిత్రాలు నిత్యం జీవితంలో జరిగే సంఘటనలకు అద్దం పడుతోంది. టీవీలో నుంచి శునకం బయటకు వస్తుండటం, నీటి కోసం జింక, బెంగళూరులో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్‌పై వెళ్తూ కిందపడటం తదితర చిత్రాలో ఎంతో సజీవంగా ఉన్నాయి.
ఫోటోగ్రాఫర్ల సునిశిత దృశ్యానికి ఈ చిత్రాలే నిదర్శనం. ఇక ఓ ఫ్యాషన్‌లో దివంగత మైసూరు మహరాజు శ్రీకంఠదత్త వడియార్, ఆహారం కోసం గద్ద, తమిళనాడు జల్లికట్టులో ఎద్దును లొంగతీసుకుంటున్న చిత్రం, బరువును మోయలేక చతికిలబడిన వృషభం, భారీ వర్షాల కారణంగా నగరంలో ఏర్పడిన గుంతల వద్ద జలకన్య రూపంలో నిరసన వ్యక్తం చేసే చిత్రం తదితర చిత్రాలు చూపుతిప్పుకోలేకుండా చేస్తున్నాయి. ప్రదర్శన ఈనెల 24 వరకు నిర్వహిస్తారు.