Hero Yash
-
కేజీయఫ్ 3 వచ్చేస్తుంది.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్
-
కన్నడ స్టార్ హీరో యష్‌తో పూరి జగన్నాథ్!.. స్టోరీ లైన్ అదేనా?
పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్‌దేవరకొండతో లైగర్ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరీ జగన్నాద్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్లు సంయుక్తంగా పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన కొన్ని అప్‌డేటస్ ప్రేక్షకుల్లో హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. కాగా ఇప్పుడు ఈ మాస్ డైరెక్టర్ కన్నడ స్టార్ హీరో యష్‌తో పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. 'కేజీఎఫ్' హిట్‌తో యష్‌కు ఎంతటి పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఒక్క సినిమా అతడిని స్టార్ హీరోగా అందలం ఎక్కించింది. ఎన్నో రికార్డులను తిరగరాస్తూ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీని సృష్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు 'ఇస్మార్ట్ శంకర్' తో పూరికి మంచి కంబ్యాక్ లభించిందని చెప్పొచ్చు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో పొలిటికల్ బ్యాక్‌బ్రాప్‌లో సినిమా రానుందంటూ ఇండస్ర్టీలో టాక్ వినిపిస్తోంది. 'కేజీఎఫ్' హిట్ తరువాత పూరి కథ వినిపించడం, వెంటనే యష్ ఓకే చెప్పడం జరిగిందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. తెలుగులో దర్శకుడిగా కెరీర్ ఆరంభించిన కొత్తలో పూరి జగన్నాథ్ రెండు కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. చదవండి : నా భర్తకు తెలియకుండా పూరి జగన్నాథ్‌కి డబ్బులిచ్చేదాన్ని : హేమ విజయ్‌పై ఛార్మి ఆసక్తికర వ్యాఖ్యలు, పోస్ట్ వైరల్ -
కేజీయఫ్ రాకింగ్ స్టార్
-
కొడుకు సూపర్‌స్టార్.. తండ్రి ఇంకా బస్సు డ్రైవరే!
కొడుకు సూపర్‌స్టార్ రేంజ్‌కు ఎదిగాడు. కానీ ఆయన తండ్రి ఇంకా బస్సు డ్రైవర్‌గానే పనిచేస్తున్నాడట.. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు మన దర్శకధీరుడు రాజమౌళి. ఎవరి గురించి అని అనుకుంటున్నారా? ఇంకెవరు.. కన్నడలో దూసుకుపోతున్న యువ కెరటం యష్ గురించే. సౌత్‌లో ఇప్పుడు క్రేజీయస్ట్ ప్రాజెక్ట్‌గా భారీ హైప్‌ను తెచ్చుకున్న చిత్రం ‘కేజీఎఫ్’. ఇటీవలె విడుదల చేసిన ట్రైలర్.. చత్రపతి సినిమాలా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అయినా కూడా ఈ చిత్రంపై అంచనాలు మాత్రం దక్షిణాదిలో రోజురోజుకూ పెరిగిపోతోంది. అయితే ఆదివారం జరిగిన కేజీఎఫ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో జక్కన్న మాట్లాడుతూ.. యశ్గురించి కొన్ని విషయాలు చెప్పాడు. తాను కన్నడలో పరిస్థితి ఏంటి?టాప్‌లో ఎవరు ఉన్నారు? అని తెలుసుకుంటుంటే.. కొత్త కుర్రాడు హిట్స్ మీద హిట్స్ కొడుతూ అందరినీ దాటేస్తున్నాడు అంటూ యశ్ గురించి తెలుసుకున్నానంటూ వివరించాడు. అయితే తన బ్యాగ్రౌండ్ తెలుసుకుందామని ఎక్కడి నుంచి వచ్చాడు ఎవరి సపోర్ట్ ఉందని అడగ్గా.. యష్ ఒక బస్సు డ్రైవర్ కొడుకని.. తెలుసుకున్నానని.. అయితే ఇప్పటికీ ఆయన నాన్న ఇంకా బస్సు డ్రైవర్‌గానే ఉన్నాడంటూ చెప్పుకొచ్చాడు. ‘నేను ఇంత సంపాదించాను , పేరు వచ్చింది కదా.. ఇక నువ్వు పనిచేయడం మానేయ్’ అని యష్ తన తండ్రితో అంటే..‘ నేను ఈ బస్సు డ్రైవర్‌గా పని చేసే.. నిన్ను సూపర్‌స్టార్‌ను చేశాను.. నా పని నేను చూసుకుంటా.. నీ పని నువ్వు చూసుకో’ అని అన్నారట.. అప్పుడు తనకు.. యష్ కంటే వాళ్ల నాన్నే పెద్ద సూపర్‌స్టార్ అని అనిపించిందని రాజమౌళి అన్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది. -
‘ఆర్ఆర్ఆర్’లో విలన్.. కొట్టిపారేసిన స్టార్హీరో!
టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. బాహుబలి సిరీస్‌లతో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించిన దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పటినుంచీ అంచనాలు పెరిగాయి. యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌లతో భారీ మల్టీస్టారర్‌ను ఓ రేంజ్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న చిత్రయూనిట్... రెగ్యులర్ షూటింగ్‌ను కూడా మొదలెట్టేసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్లు, విలన్ పాత్రల గురించి జక్కన్న ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాజమౌళి సినిమాలు అంటే విలన్లు, హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యముంటుంది. కీర్తి సురేష్, సమంతలు హీరోయిన్స్‌గా నటించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇక విలన్ పాత్రకు మాత్రం కన్నడ యువ సంచలనం యష్‌ను తీసుకున్నట్లు గాసిప్స్ వచ్చాయి. ఇటీవలె ‘కేజీఎఫ్’తో యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోన్న యష్.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ప్రతినాయకుడి పాత్రలో నటించబోతున్నట్లు కథనాలు వచ్చాయి. ఈ రూమర్స్‌ను కొట్టిపారేస్తూ.. తాను రాజమౌళి ప్రాజెక్ట్‌లో నటించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అయితే అవకాశం వస్తే మాత్రం నటిస్తానని చెప్పుకొచ్చారు. బాహుబలిలో బళ్లాలదేవుడిని చూపించిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్లో ఎవరిని చూపించబోతున్నాడో. pic.twitter.com/3URlAK6nSA — Yash (@NimmaYash) November 21, 2018 -
హీరోని హత్య చేయాలని కుట్ర
యశవంతపుర: పోలీసు కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బెంగళూరు రౌడీ సైకిల్ రవి సీసీబీ పోలీసుల విచారణలో విస్తుగొలిపే సమాచారాన్ని బయటపెడుతున్నాడు. కన్నడ సినీ హీరో యశ్‌ను హత్య చేయాలని అతడు కుట్ర రచించినట్లు వెల్లడించినట్లు తెలిసింది. రెండేళ్ల క్రితమే ఈ కుట్ర పన్నాడు. అప్పట్లో ఈ విషయం తెలిసిన యశ్, నిర్మాత జయణ్ణ బెంగళూరు పోలీసు కమిషనర్‌కు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. దీని తరువాత సీసీబీ పోలీసులు నగరంలోని అనేక మంది ముఖ్యమైన రౌడీలను అరెస్టు చేసి, మరి కొందరికి హెచ్చరికలు చేసి వదిలేశారు. అప్పట్లో రౌడీసైకిల్ రవి, త్యాగరాజనగర కోదండరామ పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నారు. కోదండరామ ఇప్పటికీ ఎక్కడున్నాడో తెలియటం లేదు. తాజా విచారణలో రవి పాతకుట్రను సవివరంగా బయటపెట్టాడు. బెంగళూరుకు సమీపంలో జరిగిన ఒక మందు పార్టీలో హత్య విషయమై చర్చించినట్లు చెప్పాడు. ప్లాన్ వేసిన మాట నిజమేగాని హత్య చేసే వరకు వెళ్లలేదని తెలిపాడు. దీంతో ఇప్పుడు రౌడీ కోదండరామ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతన్ని పట్టుకుంటే మరింత సమాచారం దొరుకుతుందని ఆశిస్తున్నారు. సినీ నిర్మాతతో గొడవకు సంబంధిం చి యశ్‌పై రౌడీ రవి పగ పెంచుకున్నాడు. పెద్ద విషయం కాదు: సీసీబీ యశ్ హత్యకు కుట్ర విషయాన్ని సీసీబీ ఉన్నతాధికారులు తీవ్రత తగ్గించి చూపుతున్నారు. ఇది పాత కథేనని అంటున్నారు. కేవలం సమాచారాన్ని మాత్రమే రవి నుండి సేకరిస్తున్నట్లు విచారణ అధికారి ఒకరు పేర్కొన్నారు. మద్యం తాగిన మత్తులో ఏదో కుట్ర పథకం వేశారని చెబుతున్నారు. సుమారు 20 సిమ్ కార్డుల ద్వారా సైకిల్ రవి పలు రంగాల ముఖ్యులతో మాట్లాడేవాడని విచారణలో బయట పడింది. చిన్న సంగతే: నటుడు యశ్ తనను హత్య చేయటానికి కుట్రపై నటుడు యశ్ స్పందిస్తూ, ఇది చిన్న విషయమని అన్నారు. రెండేళ్ల క్రితం దీనిని పోలీసు కమిషనర్‌కు దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. నిర్మాత జయణ్ణ కారుపై కొందరు రాళ్లు విసిరిన ఘటనపై పోలీసు కమిషనర్‌ను కలిసినట్లు తెలిపారు. ఆ తరువాత మైసూరు, బెంగళూరు ప్రాంతాల్లో అనేక మంది రౌడీలను పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. -
హీరో.. స్మైల్ ప్లీజ్
చిత్రకళా పరిషత్‌లో ఏర్పాటు చేసిన ఓ ఫొటో ఎగ్జిబిషన్లో హీరో యశ్‌ను సరదాగా ఫొటో తీస్తున్న హోం మంత్రి రామలింగారెడ్డి జయనగర: చిత్రకళా పరిషత్‌లో ఫొటో జర్నలిస్టŠస్ అసోసియేషన్ ఆఫ్ బెంగళూరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సందర్శకులను కనువిందు చేస్తోంది. ఫొటో జర్నలిస్టŠస్ ఆఫ్ బెంగళూరు అసోసియేషన్ సభ్యులు తీసిన ఛాయాచిత్రాలు నిత్యం జీవితంలో జరిగే సంఘటనలకు అద్దం పడుతోంది. టీవీలో నుంచి శునకం బయటకు వస్తుండటం, నీటి కోసం జింక, బెంగళూరులో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్‌పై వెళ్తూ కిందపడటం తదితర చిత్రాలో ఎంతో సజీవంగా ఉన్నాయి. ఫోటోగ్రాఫర్ల సునిశిత దృశ్యానికి ఈ చిత్రాలే నిదర్శనం. ఇక ఓ ఫ్యాషన్‌లో దివంగత మైసూరు మహరాజు శ్రీకంఠదత్త వడియార్, ఆహారం కోసం గద్ద, తమిళనాడు జల్లికట్టులో ఎద్దును లొంగతీసుకుంటున్న చిత్రం, బరువును మోయలేక చతికిలబడిన వృషభం, భారీ వర్షాల కారణంగా నగరంలో ఏర్పడిన గుంతల వద్ద జలకన్య రూపంలో నిరసన వ్యక్తం చేసే చిత్రం తదితర చిత్రాలు చూపుతిప్పుకోలేకుండా చేస్తున్నాయి. ప్రదర్శన ఈనెల 24 వరకు నిర్వహిస్తారు. -
హీరోకు చేదు అనుభవం.. కారుపై దాడి
సాక్షి, బెంగళూరు : సినీనటులు జనాల్లోకి వస్తే ఆనందోత్సవాలతో అభిమానులు బ్రహ్మరథం పడుతారు. అది సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ కూడా అలాగే జరుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు అదే అభిమానం ఆగ్రహంగా మారితే హీరోలకు చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాలో చోటుచేసుకుంది. కన్నడ హీరో యశ్ ఆలస్యంగా రావడంతో ఆగ్రహం చెందిన అభిమానులు, గ్రామస్థులు ఆయన కారును సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. యాదగిరి జిల్లాలోని సురపుర గ్రామంలో కరువు బారిన పడ్డ రైతులను పరామర్శించడానికి యశ్ సోమవారం మధ్యాహ్నం గ్రామానికి రావాల్సివుంది. అయితే కొన్ని కారణాల వల్ల యశ్ రాత్రి 9 గంటలకు కూడా రాలేదు. అప్పటి వరకు యశ్ రాక కోసం కొండంత ఆశతో ఎదురు చూసిన అభిమానులు, ప్రజలు ఆయన రావడం మరింత ఆలస్యం కావడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పది గంటల దాటిన తర్వాత వచ్చిన హీరో కారుపై గ్రామస్తులు ఒక్కసారిగా దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. దీంతో హీరో యశ్ ఒక్కసారిగా కంగుతిన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. చివరకు ఆలస్యానికి గల కారణాలను యశ్ వివరించడంతో గ్రామస్తులు శాంతించారు.