కొడుకు సూపర్‌స్టార్ రేంజ్‌కు ఎదిగాడు. కానీ ఆయన తండ్రి ఇంకా బస్సు డ్రైవర్‌గానే పనిచేస్తున్నాడట.. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు మన దర్శకధీరుడు రాజమౌళి. ఎవరి గురించి అని అనుకుంటున్నారా? ఇంకెవరు.. కన్నడలో దూసుకుపోతున్న యువ కెరటం యష్ గురించే.
సౌత్‌లో ఇప్పుడు క్రేజీయస్ట్ ప్రాజెక్ట్‌గా భారీ హైప్‌ను తెచ్చుకున్న చిత్రం ‘కేజీఎఫ్’. ఇటీవలె విడుదల చేసిన ట్రైలర్.. చత్రపతి సినిమాలా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అయినా కూడా ఈ చిత్రంపై అంచనాలు మాత్రం దక్షిణాదిలో రోజురోజుకూ పెరిగిపోతోంది. అయితే ఆదివారం జరిగిన కేజీఎఫ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ ఈవెంట్‌లో జక్కన్న మాట్లాడుతూ.. యశ్‌గురించి కొన్ని విషయాలు చెప్పాడు. తాను కన్నడలో పరిస్థితి ఏంటి?టాప్‌లో ఎవరు ఉన్నారు? అని తెలుసుకుంటుంటే.. కొత్త కుర్రాడు హిట్స్ మీద హిట్స్ కొడుతూ అందరినీ దాటేస్తున్నాడు అంటూ యశ్ గురించి తెలుసుకున్నానంటూ వివరించాడు. అయితే తన బ్యాగ్రౌండ్ తెలుసుకుందామని ఎక్కడి నుంచి వచ్చాడు ఎవరి సపోర్ట్ ఉందని అడగ్గా.. యష్ ఒక బస్సు డ్రైవర్ కొడుకని.. తెలుసుకున్నానని.. అయితే ఇప్పటికీ ఆయన నాన్న ఇంకా బస్సు డ్రైవర్‌గానే ఉన్నాడంటూ చెప్పుకొచ్చాడు. ‘నేను ఇంత సంపాదించాను , పేరు వచ్చింది కదా.. ఇక నువ్వు పనిచేయడం మానేయ్’ అని యష్ తన తండ్రితో అంటే..‘ నేను ఈ బస్సు డ్రైవర్‌గా పని చేసే.. నిన్ను సూపర్‌స్టార్‌ను చేశాను.. నా పని నేను చూసుకుంటా.. నీ పని నువ్వు చూసుకో’ అని అన్నారట.. అప్పుడు తనకు.. యష్ కంటే వాళ్ల నాన్నే పెద్ద సూపర్‌స్టార్ అని అనిపించిందని రాజమౌళి అన్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment