ఆర్‌ఆర్‌ఆర్‌తో కేజీఎఫ్‌ 2 ఢీ : యష్‌ వివరణ | Yash Clarifies On KGF Two Clash With RRR | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్‌పై దిగ్గజ మూవీల దండయాత్ర

Published Fri, Mar 6 2020 4:17 PM | Last Updated on Fri, Mar 6 2020 4:17 PM

Yash Clarifies On KGF Two Clash With RRR - Sakshi

హైదరాబాద్‌ : మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో కేజీఎఫ్‌-2 ఢీకొంటుందన్న ఊహాగానాలపై రాకింగ్‌ స్టార్‌ యష్‌ స్పందించారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల కాబోవని స్పష్టం చేశారు. ‘అలాంటి పిచ్చిపని తాము చేయబోమని, ఆర్‌ఆర్‌ఆర్‌ టీంతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పుకొచ్చారు. ఏప్రిల్‌లో వారి సినిమా విడుదల చేయాలనుకున్న సమయంలో ముందుగానే తముకు ఆ విషయం చెప్పారని, అదే సమయంలో మీరు కేజీఎఫ్‌ 2ను రిలీజ్‌ చేయదల్చుకుంటే రిలీజ్‌ షెడ్యూల్‌ మార్చుకోవాలని సూచించారని అన్నారు.

ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడిన క్రమంలో ఆ విషయం వారు తమకు తెలిపారని, తమ రిలీజ్‌ ప్రణాళికలను తెలుసుకున్నారని వెల్లడించారు. రెండూ పాన్‌ ఇండియా సినిమాలేనని, హిందీలో ఈ రెండు మూవీలకు హిందీలో అనిల్‌ తడానీ డిస్ర్టిబ్యూటర్‌గా ఉన్నారని చెప్పారు. రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఒకేసారి తలపడవని, ఈ రకమైన ప్రచారం మీడియా ఊహాగానమేనని తేల్చిచెప్పారు. ఇలాంటి వార్తలను చూసి తాము నవ్వుకుంటామని అన్నారు.

చదవండి : ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ ఇదే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement