టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. బాహుబలి సిరీస్‌లతో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించిన దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పటినుంచీ అంచనాలు పెరిగాయి. యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌లతో భారీ మల్టీస్టారర్‌ను ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న చిత్రయూనిట్... రెగ్యులర్ షూటింగ్‌ను కూడా మొదలెట్టేసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్లు, విలన్ పాత్రల గురించి జక్కన్న ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రాజమౌళి సినిమాలు అంటే విలన్లు, హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యముంటుంది. కీర్తి సురేష్, సమంతలు హీరోయిన్స్‌గా నటించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.
అయితే ఇక విలన్ పాత్రకు మాత్రం కన్నడ యువ సంచలనం యష్‌ను తీసుకున్నట్లు గాసిప్స్ వచ్చాయి. ఇటీవలె ‘కేజీఎఫ్’తో యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోన్న యష్.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీలో ప్రతినాయకుడి పాత్రలో నటించబోతున్నట్లు కథనాలు వచ్చాయి. ఈ రూమర్స్‌ను కొట్టిపారేస్తూ.. తాను రాజమౌళి ప్రాజెక్ట్‌లో నటించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అయితే అవకాశం వస్తే మాత్రం నటిస్తానని చెప్పుకొచ్చారు. బాహుబలిలో బళ్లాలదేవుడిని చూపించిన జక్కన్న.. ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎవరిని చూపించబోతున్నాడో.
— Yash (@NimmaYash) November 21, 2018
Comments
Please login to add a commentAdd a comment