పోలీసులకు లైంగిక ఎర | Woman Arrest in Prostitution Scandal Tamil nadu | Sakshi
Sakshi News home page

పోలీసులకు లైంగిక ఎర

Published Sat, Sep 21 2019 10:27 AM | Last Updated on Sat, Sep 21 2019 10:58 AM

Woman Arrest in Prostitution Scandal Tamil nadu - Sakshi

తమిళనాడు, టీ.నగర్‌: మదురైలో పోలీసులను వ్యభిచారానికి ఆహ్వానించిన మహిళ సహా నలుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మదురైలో కిడ్నాప్‌ల నిరోదక విభాగం పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు తిరుపతి. ఇతనికి గురువారం సెల్‌ఫోన్‌లో ఒక ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. మహిళలతో జల్సాగా గడపాలనుకుంటే ఈ కింది నెంబర్‌కు సంప్రదించాలని అందులో పేర్కొన్నారు. ఈ నెంబర్‌ ఆధారంగా తిరుపతి అక్కడికి వెళ్లగా సుబ్రమణి అనే వ్యక్తి తనను పరిచయం చేసుకున్నాడు.

అక్కడ బేరసారాలు జరిగిన తర్వాత తిరుపతి వద్ద అక్కడున్న ముఠా నగదు లాక్కుని ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. తర్వాత ఒక మహిళను అతనితో పాటు ఒక గదికి పంపారు. ఈ లోపున తిరుపతి మరుగుదొడ్డికి వెళ్లి వస్తానని చెప్పి, అక్కడి నుంచి పోలీసులకు సమాచారం తెలిపారు. దీంతో హుటాహుటిన అక్కడికి వచ్చిన పోలీసులు వ్యభిచారం జరుపుతున్న అయ్యనార్, శేఖర్, మనోజ్‌ కుమార్‌తో సహా నందిని అనే మహిళను అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement