
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో వ్యభిచార నిర్మూలనకు పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసులు దాడులతో బాలికలను వ్యభిచార కూపంలోకి దించుతున్న నిర్వాహకుల అరాచకాలు ఒక్కొ క్కటి వెలుగు చూస్తున్నాయి. శనివారం రాచ కొండ పోలీసులు గుట్టలో బాలికలను అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు మహిళలను అరెస్టు చేసి వారి చెరలో ఉన్న ఏడుగురు బాలికలకు విముక్తి కల్పించారు. జూలై 30న, బాలికల అక్రమ రవాణాకు పాల్పడుతున్న 8 మంది వ్యభిచార గృహ నిర్వాకులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో 11మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. ఈ నెల 2న మరో 9 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని నలుగురు చిన్నారులను వారి నుంచి కాపాడారు. ఇందులో బాలికలకు హర్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్న ఓ ఆర్‌ఎంపీ వైద్యుడినీ అరెస్టు చేశారు. ఈనెల 10న కూడా ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని మరో ఇద్దరు చిన్నారులను రక్షించారు. ఇప్పటి వరకు 24 మంది చిన్నారులను రక్షించి, 24 మంది వ్యభిచార నిర్వాహకులను అరెస్టు చేశారు.
ప్రత్యేక టీమ్‌ల ఏర్పాటు
గుట్ట సంఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బాలికలు ఇంకా వ్యభిచార కూపా ల్లో మగ్గుతున్నారని తేలడంతో అప్రమత్తమైన పోలీస్ శాఖ ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఎస్‌ఐ స్థాయి అధికారి పర్యవేక్షణలో బృం దాలను ఏర్పాటు చేసి అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఐదుగురు మహిళలను అరెస్టు చేసి ఏడుగురు చిన్నారులను రక్షించారు. బాలికలను వ్యభిచార కూపాలనుంచి రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు భువనగిరి జోన్ డీసీపీ రామచంద్రారెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment