స్పా ముసుగులో వ్యభిచార దందా | Prostitution Scandal With Spa Mask In Hyderabad | Sakshi
Sakshi News home page

స్పా ముసుగులో వ్యభిచార దందా

Aug 10 2018 8:28 AM | Updated on Aug 11 2018 1:59 PM

Prostitution Scandal With Spa Mask In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘శ్రీ వీనస్‌ యునిసెక్స్‌ సెలూన్‌’ పేరుతో స్పా ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి దాని ముసుగులో వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. దీనికి తోడు క్రాస్‌ మసాజ్‌ సర్వీసులు అందిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం దాడి చేశారు. ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు డీసీపీ  రాధాకిషన్‌రావు తెలిపారు. వెస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన జి.శంకర్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.10లో ‘శ్రీ వీనస్‌ యునిసెక్స్‌ సెలూన్‌’ పేరుతో స్పా నిర్వహిస్తున్నాడు. ఇందులో పుప్పాలగూడకు చెందిన బిందు బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. ఇందులో చట్టవిరుద్ధంగా క్రాస్‌ మసాజ్‌  చేయించడమేగాక వ్యభిచార దందా సైతం చేస్తున్నాడు. వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వంలోని బృందం దాడి చేసి శంకర్‌తో పాటు బిందును అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసును జూబ్లీహిల్స్‌ పోలీసులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement