SPA
-
ఎంటీఎన్ఎల్ అప్పు ‘మొండి బకాయి..’
న్యూఢిల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని ఎంటీఎన్ఎల్ రుణ ఖాతాలను సబ్–స్టాండర్డ్ నాన్–పెర్ఫార్మింగ్ అసెట్స్‌గా (ఎన్పీఏ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఎస్బీఐ తెలిపింది. సంస్థ జూన్ 30 నుండి వాయిదాలు, వడ్డీని చెల్లించనందున ఎస్బీఐ ఈ చర్య తీసుకున్నట్లు అప్పుల ఊబిలో ఉన్న టెలికం సంస్థ ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.ఎంటీఎన్ఎల్ రుణ ఖాతాలో మొత్తం బకాయిలు సెపె్టంబర్ 30 నాటికి రూ. 325.52 కోట్లని ఎస్బీఐ అక్టోబర్ 1న పంపిన లేఖను ఎంటీఎన్ఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు అందజేసింది. రుణ బకాయిల చెల్లింపుల వైఫల్యం 12 నెలలకన్నా తక్కువ ఉంటే, ఈ పరిస్థితిని సబ్–స్టాండర్డ్ నాన్–పెర్ఫార్మింగ్ అసెట్స్‌గా బ్యాంకుల ప్రకటిస్తాయి. రుణ బకాయిల చెల్లింపుల సామర్థ్యాన్ని ఈ స్థాయి సూచిస్తుంది.చట్టపరమైన చర్యలకూ సిద్ధం..రుణ బకాయిలు చెల్లించడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలకు సిద్ధమని కూడా ఎస్బీఐ సూచించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌సహా బకాయిలను చెల్లించనందుకు అనేక బ్యాంకులు ఎంటీఎన్ఎల్పై చర్యలు తీసుకున్నాయి. బకాయిలు చెల్లించనందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటీఎన్ఎల్ అన్ని ఖాతాలను స్తంభింపజేసింది.నష్టాల్లో ఉన్న టెలికం సంస్థ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి మొత్తం రూ. 7,873.52 కోట్ల రుణాలను కలిగి ఉంది. కంపెనీ మొత్తం రుణ భారం రూ. 31,945 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గ్యారెంటీ బాండ్ల నుండి వచ్చే వడ్డీ చెల్లింపు కోసం ఎంటీఎన్ఎల్ ప్రభుత్వం నుండి రూ. 1,151.65 కోట్లను కోరింది. ఎంటీఎన్ఎల్ బాండ్ల ప్రధాన మొత్తం చెల్లింపు కోసం 3,669 కోట్ల రూపాయలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) కేటాయించింది. -
సినిమా తరహా ఘటన.. హంతకుల పేర్లు పచ్చబొట్టు
ముంబై: నగరంలో సినిమా తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. స్పాలో హత్యకు గురైన ఓ వ్యక్తి ఒంటిపై వేయించుకున్న పచ్చబొట్లు హంతకులను పట్టించాయి. ముంబైలోని గురు వాఘ్మారే అనే వ్యక్తి తనకు 22 మంది వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందంటూ వారి పేర్లను శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఈ క్రమంలో నిజంగానే ఆ వ్యక్తిని స్పా సెంటర్లో దుండగులు హత్య చేశారు. పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించగా.. మృతుడి ఒంటిపై ఉన్న పచ్చబొట్టులో 22 మంది పేర్లను గుర్తించారు. వారిలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే స్పా యజమాని సంతోష్ షెరేకర్తో పాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.యూపీఐ రికార్డులో అతని పేరు మహమ్మద్ ఫిరోజ్ అన్సారీగా పోలీసులు గుర్తించారు. అన్సారీ యూపీఐ ఐడీకి లింకయిన ఫోన్ నంబర్‌కి షెరేకర్ పలుమార్లు ఫోన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. అన్సారీ బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో స్పాలోకి ప్రవేశించి, వాఘ్మారే గర్ల్ ఫ్రెండ్‌ను మరొక గదిలోకి తీసుకెళ్లారు. అనంతరం కత్తెర, బ్లేడ్లను ఉపయోగించి వాఘ్మారేను హత్య చేశారు.వాఘ్మారే గర్ల్‌ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. కాగా వాఘ్మారే సామాజిక కార్యకర్తగా చెప్పుకుంటూ 2010 నుంచి ముంబై, నవీ ముంబై, థానే, పాల్ఘర్లోని పలువురు స్పా యజమానుల నుంచి డబ్బు వసూలు చేసేవాడని, అతనిపై దోపిడీ, అత్యాచారం, వేధింపుల క్రిమినల్ కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు. -
స్పా సెంటర్లపై పోలీసులు దాడి..! ఐదుగురు యువతులు అరెస్ట్
హైదరాబాద్: మసాజ్ పేరుతో అక్రమంగా కొనసాగిస్తున్న స్పా కేంద్రాలపై గుడిమల్కాపూర్ పోలీసులు, సౌత్‌వెస్ట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఐదుగురు మహిళలతో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ షేక్ ముజీబ్ ఉర్ రెహా్మన్ తెలిపిన వివరాల ప్రకారం.. నానల్‌నగర్‌లోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జన్నత్, గోల్డెన్ అనే రెండు స్పా కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు మహిళలతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు స్పా కేంద్రాలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. స్పా, స్నూకర్, రిక్రియేషన్క్లబ్లకు ఇళ్లను అద్దెకిచ్చి కేసుల్లో ఇరుక్కోవద్దని ఇళ్ల నిర్వహకులకు ఇన్స్పెక్టర్ సూచించారు. -
కొవ్వు ఇంజక్షన్లు: శరీరం కుళ్లిపోయి..వికృతంగా.. చావే మేలు అనుకున్నా.!
శరీరంలో కొవ్వును కరిగించుకునే ప్రక్రియలో అనేకమంది చాలా చేదు అనుభవాలున్నాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా కొవ్వును కరిగించే ఇంజెక్షన్లు తీసుకొని ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలన్న ఒక మహిళ కల పీడకలగా మిగిలిపోయింది. స్వయంగా శరీరాన్ని తినేసే అరుదైన బాక్టీరియాతో జీవన్మరణ పోరాటం చేస్తున్న మాజీ స్విమ్‌సూట్ మోడల్, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ గాథ ఒకటి వైరల్ అవుతోంది. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ బీట్రిజ్ అమ్మ ఫాట్‌ను కరిగించుకునే క్రమంలో లాస్ ఏంజెల్స్ లోని ఒక లగ్జరీ స్పాను సంప్రదించింది. విటమిన్ ఇంజెక్షన్లు భారీ తీసుకునేది. విటమిన్ బీ1, సీ మిశ్రమంగా "వేగంగా కరిగిపోయే" డియోక్సికోలిక్ యాసిడ్‌తో కలిపి 60 ఇంజక్షన్లు తీసుకుంది. చేతులు, పిరుదులు, కడుపులోకి వీటిని తీసుకుంది. దాదాపు 66వేల కంటే ఎక్కువే ఖర్చుపెట్టింది. కొవ్వు కరగడం సంగతి ఏమోగానీ ఇపుడు అరుదైన మైకోబాక్టీరియం అబ్సెసస్ అనే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకి నరక యాతన అనుభవిస్తోంది. ఇంజెక్షన్ తీసుకున్న ప్రతీ చోట భయంకరమైన పుండ్లతో భరించలేని భాధ పడుతోంది. దాదాపు మంకీ పాక్స్ లాంటి గాయాలతో ఆ బాక్టీరియా శరీరం మొత్తాన్ని తినేస్తోంది. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) డియోక్సికోలిక్ యాసిడ్ సరిగ్గా ఇంజెక్ట్ చేయకపోవడం వల్లే ఇది జరిగిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో బాక్టీరియా బారిన పడి కుళ్ళిపోయిన చర్మాన్ని తొలగించేందుకు పలు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ప్రతీ రోజూ ఆరు గంటల ఇంట్రావీనస్ యాంటీ బయాటిక్స్‌ను భరిస్తోంది. (హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం) మంచానికే పరిమితమై ప్రాణం నిలుపుకునేందుకు ఆరాటపడుతోంది. ఒకరి సాయం లేకుండా రెస్ట్‌రూమ్‌కి వెళ్లలేక..కనీసం లేచి నిలబలేక ఇలా అన్నింటికి మరొకరి మీద ఆధారపడి బతుకేదాన్ని..శరీరం మంచం మీదే కుళ్ళిపోతోంది అంటూ తన అనుభవాన్ని పంచుకుంది బీట్రిజ్. అద్దంలో చూసుకున్న ప్రతిసారీ, జీవితంలో సాధించాలని కలగన్నదో, ఇపుడు ఏమి కోల్పోయిందో గుర్తు చేసుకుని బోరున విలపించింది. అటు వైద్యులు కూడా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలనే కలను వదులుకోండి ఇది జీవితాంతం మిమ్మల్ని వదలదని తెగేసి చెప్పారు. అంతేకాదు ఇతరులను భయపెట్టకుండా బహిరంగ ప్రదేశాల్లో బికినీలు ధరించ వద్దని కూడా సలహా ఇచ్చారు. కానీ ఇక్కడే బీట్రీజ్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. ఇక నా శరీరం పోరాడలేదు ఓడిపోయింది..ఇక చనిపోతాను అనుకున్న క్షణంలో ధైర్యాన్ని కూడ దీసుకుంది. మాంసాన్ని తినేసే వికృతమైన, భయంకరమైన ఈ బాక్టీరియా గురించి అవగాహన పెంచేందుకు తన శాయశక్తులా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే బాడీ పాజిటివిటీ మూవ్‌మెంట్‌ను మొదలు పెట్టింది. మన శరీరంలో ఎన్ని వైరుధ్యాలు, ప్రతికూలతలు, మచ్చలున్నా భయపడకుండా, ఆత్మన్యూనతతో దాచు కోకుండా శరీర ఆకృతితో సంబంధం లేకుండా అంతర్గతంగా, బాహ్యంగా అందంగా ఉండాలని పిలుపు నిస్తోంది. -
మసాజ్ సెంటర్లో వ్యభిచారం
క్రిష్ణగిరి: మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తిని సూళగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు హోసూరు– క్రిష్ణగిరి హైవే సుండగిరి ప్రాంతంలో శుక్రవారం రాత్రి డాబా హోటల్ కింద ఉన్న ఆలివ్ స్పా సెంటర్లో తనిఖీలు చేశారు. కేరళ మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. నిర్వాహకుడు సంతోష్ (44)అని అరెస్టు చేశారు. ఇద్దరు మహిళలకు విముక్తి కల్పించారు. -
Hyderabad: బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పా ముసుగులో వ్యభిచారం
హైదరాబాద్: నగరంలో స్పాలు, మసాజ్ సెంటర్ల పై సిఎస్ పోలీస్ యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ మెరుపు దాడులకు దిగింది. సీసీఎస్ టీమ్‌తో కలిసి బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. శనివారం బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మసాజ్ సెంటర్లపై యాంటీ ట్రాఫికింగ్ సెల్ దాడులు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు, క్రాస్ మసాజ్ లకు పాల్పడుతున్నట్లు తేలింది. సీసీ కెమెరాలు లేకపోవడం.. రిజిస్టర్లో కస్టమర్ల వివరాలు రాయక పోవడం లాంటి ఉల్లంఘనలకు పాల్పడిన నిర్వాహకుల మీద కేసు నమోదు చేశారు. మేఘవి వెల్నెస్ స్పా, రువాన్ థాయ్ స్పా, సెన్సెస్ ట్రాంక్విల్ ది హెల్త్ స్పా, కానస్ లగ్జరీ స్పా, బోధి వెల్నెస్ స్పా సెంటర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
Banjara Hills: మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం..
హైదరాబాద్: మసాజ్ కేంద్రాలు, స్పాల ముసుగులో వ్యభిచారానికి పాల్పడుతున్న రెండు కేంద్రాలపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని హెవెన్ ఫ్యామిలీ స్పాలో కొంత కాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇక్కడ దాడులు నిర్వహించి అయిదుగురు సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు కె.నీలిమ, ఎన్.కార్తీక్‌లపై కేసు నమోదు చేశారు. ది వెల్వెట్ స్పాపై... బంజారాహిల్స్ రోడ్ నెం. 12లో ఉన్న ది వెల్వెట్ స్పాలో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో పట్టుబడ్డ నలుగురు సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు జ్యోతి బజాజ్, సయ్యద్ యూసుఫ్ బాషాలపై కేసు నమోదు చేశారు. -
స్పా ముసుగులో వ్యభిచారం..
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా సెంటర్‌పై భవానీపురం పోలీసులు దాడి చేశారు. నిర్వాహకురాలిని అరెస్ట్‌చేసి, 11 మంది యువతులను హోంకు తరలించారు. పోలీసుల కథనం మేరకు.. భవానీపురం బైపాస్ రోడ్డు దియాస్ బార్ సమీపంలోని ఓ భవనంలో నగరానికి చెందిన సంపర శ్రీవిద్య తనిష్క బ్యూటీ వరల్డ్ అండ్ స్పా నిర్వహిస్తోంది. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో స్పా సెంటర్‌పై పోలీసులు దాడిచేశారు. సంపర శ్రీ విద్య, ఆమె భర్త సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయంలో స్పా సెంటర్లో 11 మంది యువతులు, ముగ్గురు విటులు ఉన్నారు. స్పా సెంటర్ నిర్వాహకురాలు శ్రీవిద్య, ఆమె భర్త సత్యనారాయణపై కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపి నట్లు సీఐ సలాం తెలిపారు. 11 మంది యువతులను కౌన్సెలింగ్ నిమిత్తం హోంకు తరలించినట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. -
ఇంకా ఆలస్యమే..!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ కష్టాలు తీరడం లేదు. ఈ పోర్టల్ ద్వారా ఎదురవుతున్న సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్‌మిత్తల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్య సమస్యల పరిష్కారానికి ఉపక్రమించినప్పటికీ, ఈ క్రమంలో వస్తున్న తీవ్ర సాంకేతిక సమస్యలు అడుగు ముందుకు పడనీయడం లేదని సమాచారం. ఈ కారణంగానే విస్తీర్ణం, పేరు మార్పు లాంటి సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోంది. ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న 10 సమస్యలకు సంబంధించిన మార్పులు జరిగినప్పటికీ, సాంకేతిక అవరోధాల కారణంగా బుధవారం నాటికి స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఎస్పీఏ) ఆప్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చిందని రెవెన్యూ వర్గాల ద్వారా తెలుస్తోంది. విదేశాల్లో ఉంటున్న పట్టాదారులు తమ భూమి విక్రయానికి గాను ఇక్కడకు రావాల్సిన అవసరం లేకుండా, తాము ఉంటున్న దేశం నుంచే అదీకృత డాక్యుమెంట్ పంపి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుగా ఉన్న ఈ ఆప్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మిగిలిన సమస్యలు కూడా దాదాపు పూర్తయినట్టేనని, ఒకట్రెండు రోజుల్లో అన్నీ అందుబాటులోకి వస్తా యని సీసీఎల్ఏ వర్గాలు చెపుతున్నాయి. వేలసంఖ్యలో పెండింగ్‌లో టీఎం 33 దరఖాస్తులు ధరణి పోర్టల్‌లోకి రైతుల వివరాల నమోదు సమయంలో వచ్చి న చిక్కులను తొలగించేందుకు గాను టీఎం (టెక్నికల్ మాడ్యూల్) 33 కింద దరఖాస్తులు తీసుకుంటున్నారు. పట్టాదారు పేరు, భూమి విస్తీర్ణం, స్వభా వం, మిస్సింగ్ సర్వే నంబర్ల లాంటి సమస్యల సవరణ కోసం ఈ మాడ్యూల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. పట్టాదారు బయోమెట్రిక్‌తో మీసేవా కేంద్రం ద్వారా తగిన ఆధారాలు పొందుపరిచి ఈ మాడ్యూ ల్ కింద రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సదరు దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలోనే తీవ్ర జాప్యం జరుగుతుండడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ మాడ్యూల్ కింద దరఖాస్తు చేసుకున్న వారి సమస్యల పరిష్కారంలో రాజకీయ జోక్యం కూడా ఎక్కువగా ఉంటోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగానే స్థానిక అధికారులు (తహసీల్దార్లు) నిష్పక్షపాతంగా నివేదికలు పంపడం లేదని, ఈ నివేదికల ఆధారంగా కలెక్టర్లు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ కలెక్టర్లు ఆమోదించినా సీసీఎల్ఏ కార్యాలయంలో క్లియర్ చేయాల్సి ఉండడం కూడా జాప్యానికి కారణమవుతోంది. ఈ దరఖాస్తుల పరిష్కారానికి సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా, ఇంకా వేల సంఖ్యలో దరఖాస్తులు సీసీఎల్ఏ కార్యాలయ స్థాయి లో పెండింగ్‌లో ఉండడం గమనార్హం. తహసీల్దార్లు, జిల్లాల కలెక్టర్లు నివేదికలు పంపేందుకే నెలలు గడుస్తోందని, ఆ తర్వాత సీసీఎల్ఏ కార్యాలయానికి వెళ్లిందీ లేనిదీ తెలియడం లేదని, ఒకవేళ సీసీఎల్ఏ కార్యాలయానికి వెళ్లినా తదుపరి సమా చారం కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. టీఎం–33 దరఖాస్తులను వీలున్నంత త్వరగా పరిష్కరించాలని, తమ దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. -
Kukatpally: బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం
సాక్షి, హైదరాబాద్: బ్యూటీ పార్లర్, స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై కూకట్పల్లి ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వెంకట నరసింహారాజు (31) సూరారంలోని చిత్తారమ్మ దేవాలయం సమీపంలో నివాసం ఉటున్నాడు. కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలోని లావిష్ బ్యూటీ పార్లర్, వెల్నెస్ స్పా నిర్వహిస్తున్నాడు. స్పా సెంటర్ ముసుగులో విటులను రప్పించి వాట్సప్‌లో యువతుల ఫొటోలు పంపుతూ విటులకు ఎరవేసి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ, కూకట్పల్లి పోలీసులు ఇంటిపై దాడి చేసి నిర్వాహకుడితో పాటు నలుగురు విటులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Bhimavaram: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. 9 మంది అరెస్ట్
సాక్షి, భీమవరం (ప్రకాశం చౌక్): మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న పట్టణంలోని ఓ మసాజ్ సెంటర్‌పై శుక్రవారం రాత్రి దాడి చేసి నిర్వాహకులు, ఏడుగురు మహిళలు, ఒక విటుడిని అరెస్ట్ చేసినట్లు భీమవరం డీఎస్పీ బి.శ్రీనాథ్ చెప్పారు. శనివారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. భీమవరం టూటౌన్ సీఐ బి.కృష్ణకుమార్, సీసీఎస్ సీఐ ఎ.రఘుకు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఉప్పాడ రవిప్రకాష్ అదేశాల మేరకు శుక్రవారం రాత్రి పట్టణంలోని టూటౌన్ ఏరియా కెనరా బ్యాంక్ సమీపంలో ఏ9 బ్యూటీ సెలూన్, స్పాపై దాడి చేశారన్నారు. దీనిలో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బురద ఝాన్సీలక్ష్మి అలియాస్ నందినితో సహా ఏడుగురు మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి నుంచి రూ.31,500 నగదు, చెక్కు బుక్, స్వైపింగ్ మెషిన్ వస్తువులను సీజ్ చేశామన్నారు. చదవండి: (Hyderabad: అర్థరాత్రి తప్పతాగి ఎస్ఐని ఢీకొట్టారు.. తీవ్రగాయాలతో..) స్పా నిర్వహణలో ఝూన్సీలక్ష్మీతోపాటు పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన ఇంటి రాహూల్ కూడా ఉన్నట్లు గుర్తించామని, ఇతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిర్వాహకురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారన్నారు. మిగిలిన ఏడుగురు అమ్మాయిలను విజయవాడ హోమ్‌కు తరలిస్తామన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మసాజ్, స్పా సెంటర్లపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. వీటిపై పర్యవేక్షణ, అకస్మాతు దాడులకు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. ఇటీవల ఓ స్పా సెంటర్‌పై కూడా దాడి చేసి అక్కడ వ్యభిచారం చేస్తున్న వారి కూడా అదుపులోకి తీసుకుని, కేసులు నమోదు చేశామన్నారు. ఈ రెండు మసాజ్, స్పా సెంటర్లపై సకాలంలో దాడులు నిర్వహించి అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని చాకచక్యంగా పట్టుకున్న సీఐలు కృష్ణకుమార్, రఘు, సిబ్బందిని డీఎస్పీ అభనందించారు. వీరికి అవార్డు, రివార్డుల కోసం ఎస్పీకి సిఫారసు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐ బి.కృష్ణకుమార్, ఎస్సై వి.రాంబాబు పాల్గొన్నారు. చదవండి: (పెళ్లింట విషాదం.. కొద్దిక్షణాల్లో పెళ్లనగా పెళ్లికుమార్తె ఆత్మహత్య) -
సెలూన్ బిజినెస్ లోకి రిలయన్స్ ఎంట్రీ ..!
-
Hyderabad: స్పాల ముసుగులో వ్యభిచారం.. ఆరు నెలల నుంచి విచ్చలవిడిగా..
సాక్షి, బంజారాహిల్స్: ఫిలింనగర్లో నిబంధనలకు విరుద్ధంగా స్పాల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న పలు స్పా సెంటర్లపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.13లోని మోరా థాయ్ స్పాతో పాటు ఫిలింనగర్‌లోని మరో రెండు స్పాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే మోరా థాయ్ స్పా మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. ఈ స్పా యజమాని విశాల్బాయ్ మున్సుక్ బాయ్ గజేరా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు భాగస్వాములు కార్తీక్, అలీఖాన్‌లు కూడా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. అలాగే ఫిలింనగర్‌లోని మరో రెండు స్పాలపై కూడా దాడులు జరిగాయి. ఇక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించి స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. పోలీసుల వైఖరిపై విమర్శలు... మరోవైపు ఫిలింనగర్‌లోని స్పాలలో గత ఆరు నెలల నుంచి విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నట్లుగా ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడుల్లో వెల్లడైంది. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటం వల్లనే నిర్వాహకులు స్పా కేంద్రాలను వ్యభిచార గృహాలుగా మార్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిలింనగర్ సెక్టార్ పరిధిలోని స్పాలన్నీ వ్యభిచార కూపాలుగా మారాయని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇక్కడి స్పాల వ్యవహారాలపై పోలీసులు విచారణకు ఆదేశించారు. -
స్పా ముసుగులో వ్యభిచారం: ఏడుగురి రిమాండ్
కేపీహెచ్‌బీకాలనీ: స్పా ముసుగులో వ్యభిచా రం నిర్వహిస్తున్న నిర్వాహకులను కేపీహెచ్‌బీ పోలీస్‌లు రిమాండ్‌కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నెంబర్–1లోని ఆర్ఏ స్పా అండ్ మసాజ్ పేరుతో వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం కేంద్రంపై దాడిచేసి నిర్వాహకుడు సయ్యద్ అక్బర్ అలీతో ఆయనకు సహకరిస్తున్న మరో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరితో పాటు పట్టుబడిన ముగ్గురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. చదవండి: బంజారాహిల్స్: బ్యూటీ అండ్ స్పా పేరుతో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్ Cyber Crime: అమెరికా వెళ్లాకే పెళ్లి అని, 22 లక్షలు కొట్టేశాడు! -
బంజారాహిల్స్: బ్యూటీ అండ్ స్పా ముసుగులో వ్యభిచారం
సాక్షి, బంజారాహిల్స్: సెలూన్, స్పా ముసుగులో వ్యభిచారానికి పాల్పడుతున్న స్పాలపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఫిలింనగర్‌లోని కిమ్ బ్యూటీ అండ్ స్పాపై దాడులు నిర్వహించి ఓనర్ కిమ్‌పై కేసు నమోదు చేశారు. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోగా ప్రొఫెషనల్ థెరపిస్ట్ కూడా లేడని ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా కొనసాగుతోందని.. మసాజ్ కోసం సెక్స్ వర్కర్‌ను నియమించుకున్నట్లు గుర్తించారు. కిమ్‌తో పాటు కొడుకు కాంతిలాల్‌పై కేసు నమోదు చేశారు. కిమ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. వ్యభిచార గృహంపై.. బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని గౌరీశంకర్ కాలనీలో వీ.ఎన్. బ్యూటీ స్టూడియో ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఎస్ఐ డి.అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేసి వ్యభిచార గృహ నిర్వాహకుడు ఎ. వేణుగోపాల్, స్పా మేనేజర్ ఎన్.రాకేష్, ఎ.సురేందర్రాజులపై కేసు నమోదు చేశారు. ఇక్కడ నలుగురు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకొని బాలిక సంరక్షణా కేంద్రాలకు తరలించారు. వివిధ ప్రాంతాల నుంచి సెక్స్ వర్కర్లను తీసుకొస్తూ ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. చదవండి: వీడు గజదొంగ గంగన్నా!.. పోలీసులకే కాల్ చేసి సవాల్? -
Pedicure: పెడిక్యూర్ చేసే విధానం, లాభాలు తెలుసా?!
అందంగా ఉండాలని ఎవరికుండదు? అందంగా కనిపించడానికి ప్రయత్నం చేయని వారుండరు. అయితే చాలా మంది ముఖవర్చసును మెరుగుపరుచుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తుంటారు గానీ, శరీరంలో మరే ఇతర అవయవాలపై అంత శ్రద్ధ చూపరు. కానీ ముఖంతోపాటు చేతులు, కాళ్లు కూడా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటేనే అందానికి పరిపూర్ణత చేకూరడంతో పాటు ఆరోగ్య సంరక్షణ కూడా జరుగుతుంది. పాదాల సంరక్షణకు పెడిక్యూర్, గోళ్ల సంరక్షణకు మెనీక్యూర్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్ని బ్యూటీపార్లర్లలో వివిధ ట్రీట్మెంట్లతోపాటు మెనీకూర్, పెడిక్యూర్‌లను అందిస్తున్నారు. పాదాలను గోళ్లను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దడమే పెడిక్యూర్ అంటారు. పెడిక్యూర్ అనేది లాటిన్ పదం. లాటిన్ లో పెస్ లేదా పెడ్ అంటె పాదము, క్యూర్ అంటేరక్షణ అని అర్థం. చేతులు, చేతివేళ్లు, గోళ్లను అందంగా తీర్చిదిద్దే పద్ధతే మెనీక్యూర్. మెనీక్యూర్ కూడా లాటిన్ పదమే. మానస్ అంటే చేయి, క్యూర్ అంటే జాగ్రత్త అని అర్థం. పెడిక్యూర్ మర్దన ద్వారా పాదాలను కాపాడుకోవడమే పెడిక్యూర్. రోజంతా పనిచేసి అలసిపోయిన మోకాళ్లు, పాదాలు, మడమలు, కాలి వేళ్లు, గిలకలకు సున్నితమైన మజసాజ్ సాయంతో ఉపశమనం కలిగించడం పెడిక్యూర్‌లో ఒక భాగంగా ఉంటుంది. ఈ విధానంలో ప్యూమిస్ స్టోన్, మసాజ్ క్రీమ్, నెయిల్ బ్రష్, నెయిల్ కట్టర్, టబ్‌లను ఉపయోగిస్తారు. ఇలా చేస్తారు.. ముందుగా కాలి గోళ్ల పెయింట్‌ను తొలగిస్తారు. తరువాత గోళ్లను అనుకున్న రీతిలో కట్ చేస్తారు. తరువాత ఒక టబ్‌లో గోరువెచ్చని నీళ్లు తీసుకుని దానిలో చిటికెడు ఉప్పు, సుగంధ నూనే, నిమ్మరసం షాంపు వేసి 30 నిమిషాల పాటు పాదాలను నానబెడతారు. పాదాలు నానిన తరువాత ప్యూమిస్ స్టోన్ లేదా గరుకుగా ఉండే పిండితో మడమలు అరికాళ్లు శుభ్రంగా రుద్దుతారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత మర్దనా ఆయిల్ లేదా మాయిశ్చరైజర్‌తో పాదాలను మొదట సుతిమెత్తంగా, తరువాత కాస్త గట్టిగా మసాజ్ చేస్తారు. తరువాత పాదాలను శుభ్రంగా తుడవడంతో పెడిక్యూర్ పూర్తవుతుంది. మసాజ్‌తో పాదాలకు ఉపశమనం కలిగి మనకు మానసికంగా ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుంది. ఈ విధంగా నెలకు రెండు సార్లు పెడిక్యూర్ చేసుకుంటూ ఉంటే పాదాలు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి. పెడిక్యూర్ కు కావాల్సి పరికరాలు అన్ని మన దగ్గర ఉంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పెడిక్యూర్ రకాలు పెడిక్యూర్ చేసే విధానంలో ఉపయోగించే సామాగ్రి, క్రీములు, అవి ఇచ్చే ఫలితాలను బట్టి వివిధ రకాల పెడిక్యూర్లు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ► క్లాసిక్ లేదా రెగ్యులర్ పెడిక్యూర్. ►ప్రెంచ్ పెడిక్యూర్ ►జెల్ పెడిక్యూర్ ►పారఫిన్ పెడిక్యూర్ ►హాట్‌స్టోన్ పెడిక్యూర్ ►ఫిష్ పెడిక్యూర్ ►మిని పెడిక్యూర్ ►స్పా పెడిక్యూర్ ► ఐస్‌క్రీం పెడిక్యూర్ ►పెడిక్యూర్ ►వాటర్ లెస్ పెడిక్యూర్ ►సాల్ట్ పెడిక్యూర్ ►చాక్లెట్ పెడిక్యూర్ ►అథ్లెటిక్ లేదా స్పోర్ట్స్ పెడిక్యూర్ ►రోజ్ పెడిక్యూర్ ►మిల్క్ అండ్ హనీ పెడిక్యూర్ ►వైన్ పెడిక్యూర్ ►షాంఘై పెడిక్యూర్ బేసిక్ క్యూర్‌ను ఇంట్లో ట్రై చేయవచ్చు, మిగిలినవి నిపుణులతోనే చేయించుకోవాలి. మెనీక్యూర్ ఎలాగంటే... ముందుగా చేతి గోళ్లకు ఉన్న పాత నెయిల్ పెయింట్‌ను తుడిచివేస్తారు. తర్వాతా గోళ్లను నచ్చిన ఆకృతిలో అందంగా కత్తిరించి ట్రిమ్ చేస్తారు. ఇలా రెండు చేతుల గోళ్లను ట్రిమ్ చేశాక, ఒక గిన్నెలో సోప్ వాటర్‌ను తీసుకుని దానిలో హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లిజరిన్, నిమ్మరసం వేసి రెండు చేతుల వేళ్లు మునిగేలా అందులో ముంచి 10 నిమిషాలు ఉంచుతారు. ఇలా చేయడం వల్ల గోళ్లలో ఉండే మలినాలు, సూక్ష్మజీవులు నశించి గరుకుగా ఉంటే క్యూటికల్స్ మెత్తగా అవుతాయి. గోరు చుట్టూ ఉండే చర్మం కూడా మెత్తబడుతుంది. తరువాత అరిచేతుల నుంచి మోచేతుల వరకు శుభ్రంగా క్లీన్ చేస్తారు. ఆపై రెండు చేతులను తడిలేకుండా టవల్‌తో తుడుస్తారు. క్యూటికల్ రిమూవర్‌తో గోరు చుట్టూ ఇంకా ఏమైనా క్యూటికల్ బిట్స్ ఉంటే తీస్తారు. దీనివల్ల గోరు పెద్దదిగాను అందంగాను కనిపిస్తుంది. తరువాత చేతులను శుభ్రంగా తుడిచి మాయిశ్చరైజర్‌తో చేతులకు వేళ్లకు మర్థన చేస్తారు. ఇలా 15 రోజులకొకసారి చేయడం వల్ల చేతులు అందంగా ఆరోగ్యంగా కనిపిస్తాయి. కాస్త ధరను భరించగలిగినవారైతే నిపుణులతో పెడిక్యూర్, మెనీక్యూర్ చేయించుకుంటే మరిన్ని మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. లాభాలేంటి? పెడిక్యూర్‌లో పాదాల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే... మెనీక్యూర్లో చేతుల ఆరోగ్యంపై ఫోకస్ చేస్తారు. రోజూవారి స్నానంలో పాదాలను చాలా మంది అశ్రద్ధ చేస్తుంటారు. ఫలితంగా వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. పెడిక్యూర్ చేయించుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. తరచుగా ఎదురయ్యే పాదాల పగుళ్లను పెడిక్యూర్ నివారిస్తుంది. గోళ్లకు రక్తప్రసరణ బాగా జరగడం వల్ల అవి ఆరోగ్యంగా పెరుగుతాయి. గోళ్లకు కూడా పుష్కలంగా పోషకాలు అందడంవల్ల పెరుగుదల మంచిగా ఉండి మరింత కాంతివంతంగా మెరుస్తాయి. పెడిక్యూర్ విధానం లో పాదాలకు మంచి మర్దన (మసాజ్) లభిస్తుంది. దీనివల్ల పాదాల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో ఎటువంటి నొప్పులు, ఆర్థరైటీస్, వెరికోస్ వెయిన్స్ వంటివి తలెత్తవు. పాదాలకు చేసే మసాజ్‌తో శరీరం మొత్తం ఒకేరకమైన ఉష్ణోగ్రతలు కొనసాగడంతోపాటు, లింఫ్నోడ్స్లోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. సుతిమెత్తని పాదాలకు మసాజ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మసాజ్‌తో ఒత్తిడి తగ్గి మనస్సు ఉత్సాహంగా ఉంటుంది. దీంతో మనలో ఆత్మ విశ్వాసం పెరిగి నూతనోత్సాహంతో మరిన్ని విజయాలు సాధించవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉండబట్టే బ్యూటీపార్లర్లు, స్పాలు అందించే క్యూర్లపై చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఆరోగ్యవంతమైన శరీరమంటే అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండడమే! చదవండి: దేశాయ్ డిజైన్స్ వెరీ ట్రెండీ! -
స్పా పేరుతో వేశ్యావాటిక
కర్ణాటక, బనశంకరి: మసాజ్ పార్లర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై సీసీబీ పోలీసులు దాడిచేసి ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి ఐదు మంది యువతులను కాపాడారు. కోరమంగల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ భవనంలో స్పా మసాజ్ హ్యాపీ వెడ్డింగ్ అనే మసాజ్ పార్లర్లో వేశ్యవాటిక నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో దాడిచేసి ఇన్వెంట్ క్రిస్టి సునీల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఐదుమంది యువతులను కాపాడారు. సులభంగా డబ్బు సంపాదించే ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి బయటి రాష్ట్రాలకు చెందిన యువతులను రప్పించుకుని వారితో పడుపువృత్తి చేస్తున్నాడని విచారణలో తేలింది. రాజేశ్, మోసిస్ట్ అనే ఇద్దరి సూత్రధారులు పరారీలో ఉన్నారు. -
స్పా ముసుగులో వ్యభిచారం..
సాక్షి, నెల్లూరు: నెల్లూరులోని మాగుంట లేఔట్లో స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచార కేంద్రం గుట్టును సోమవారం పోలీసులు రట్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. వెంకటగిరికి చెందిన బి.ధనంజయరెడ్డి కొన్నేళ్ల క్రితం నెల్లూరు నగరానికి వచ్చాడు. మాగుంట లేఔట్లో నివాసం ఉంటూ ఆర్థిక వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. ఆరునెలల క్రితం అతను అదే ప్రాంతంలోని ప్రధాన రహదారిపై ఉన్న స్టూడియో 11 సెలూన్ అండ్ స్పాను నెలకు రూ.70 వేలు చెల్లించేలా లీజ్‌కు తీసుకున్నాడు. స్పాను అధునాతన హంగులతో తీర్చిదిద్దాడు. వివిధ ప్రాంతాల్లో నుంచి యువతులను తీసుకువచ్చి వారిచే కస్టమర్లకు మసాజ్ చేయించడం ఆపై వారిచే వ్యభిచారం చేయించడం పరిపాటిగా మారింది. దీంతో పెద్దసంఖ్యలో కస్టమర్లు రావడం మొదలైంది. లావాదేవీలు మొత్తం ఫోన్లో జరిగేవి. ఈ విషయాలను బయటకు పొక్కకుండా నిర్వాహకుడు జాగ్రత్తపడ్డాడు. డీఎస్పీ ఆధ్వర్యంలో నిఘా స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగికి అందింది. ఆయన ఆదేశాల మేరకు నగర డీఎస్పీ జె.శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో చిన్నబజారు, దర్గామిట్ట ఇన్స్పెక్టర్లు ఐ.శ్రీనివాసన్, మిద్దె నాగేశ్వరమ్మలు సెంటర్‌పై నిఘా ఉంచారు. సోమవారం వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారం అందుకున్న డీఎస్పీ, ఇన్స్పెక్టర్లు తమ సిబ్బందితో కలిసి స్పా సెంటర్‌పై దాడి చేశారు. నిర్వాహకుడితోపాటు ఇద్దరు సెక్స్‌వర్కర్లు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడి ఫోన్‌ను పరిశీలించిన అధికారులు నిర్ఘాంతపోయారు. అందులో యువతుల అశ్లీల చిత్రాలు, కస్టమర్ల ఫోన్ నంబర్లు తదితరాలను గుర్తించారు. నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి చేసు నమోదు చేశారు. సెక్స్‌వర్కర్లను హోమ్‌కు తరలించి ఇన్స్పెక్టర్ నాగేశ్వరమ్మ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల్లో చిన్నబజారు, దర్గామిట్ట పోలీస్‌స్టేషన్ ఎస్సైలు చిన్ని బలరామయ్య, బి.నాగభూషణం, జిలానీ, సిబ్బంది పాల్గొన్నారు. అవాక్కైన స్థానికులు మెట్రో నగరాలకే పరిమితమైన వెరైటీ మసాజ్‌లు, క్రాస్ మసాజ్‌లు జిల్లాకు పాకాయి. అనేక స్పా సెంటర్లు కస్టమర్లను ఆకర్షిస్తూ మసాజ్ ముసుగులో వ్యభిచారం చేయిస్తున్నారు. నగరంలో దాడి చేసిన స్పా సెంటర్ ఉన్న బిల్డింగ్‌లో వివిధ వ్యాపార సంస్థలున్నాయి. పోలీసులు దాడిచేసి వ్యభిచార గుట్టు రట్టు చేసేవరకు వ్యభిచారం జరుగుతోందన్న విషయం అక్కడి వారికి తెలియదు. దీనిని బట్టి చూస్తే నిర్వాహకుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించడో ఇట్టే అర్థమవుతోంది. ఒక్కసారిగా పోలీసులు దాడిచేసి నిర్వాహకుడితోపాటు సెక్స్‌వర్కర్లు, విటులను బిల్డింగ్‌పై నుంచి కిందకు తీసుకురావడంతో అందరూ అవాక్కయ్యారు. నగరంలో వివిధ చోట్ల ఇలాంటి సెంటర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసు అధికారులు వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
బంజారాహిల్స్ : స్పా ముసుగులో వ్యభిచారం
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం.12లో స్టూడియో మేకర్స్ స్పా పేరుతో ఏర్పాటు చేసిన మసాజ్ సెంటర్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సెంటర్ నిర్వాహకుడు, ప్రధాన నిందితుడు సతీష్ అలియాస్ శరణప్ప అలియాస్ హరినాథ్ పరారీలో ఉండగా ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రోడ్ నెం. 12లో హైలైన్ కాంప్లెక్స్ రెండో అంతస్తులో ఫ్లాట్ నంబర్ 205లో స్టూడియో మేకర్స్ స్పా పేరుతో కొనసాగుతున్న ప్లాట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ సీఐ గట్టు మల్లు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఇందులో మసాజ్‌కు సంబంధించిన ఎలాంటి పరికరాలు లేకపోగా గదుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. రెడ్‌హ్యాండెడ్‌గా విటులు, యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు కే.ఎం.సంతోష్, హేమంత్, చైతన్య, గణేష్, మణికంఠన్ తదితరులను అరెస్ట్ చేశారు. నలుగురు యువతులను పునరావాస కేంద్రా నికి తరలించారు. వీరి నుంచి నగదు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
స్పా ముసుగులో వ్యభిచార దందా
సాక్షి, సిటీబ్యూరో: ‘శ్రీ వీనస్ యునిసెక్స్ సెలూన్’ పేరుతో స్పా ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి దాని ముసుగులో వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. దీనికి తోడు క్రాస్ మసాజ్ సర్వీసులు అందిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం దాడి చేశారు. ఇద్దరు నిందితులను పట్టుకున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపారు. వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన జి.శంకర్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో ‘శ్రీ వీనస్ యునిసెక్స్ సెలూన్’ పేరుతో స్పా నిర్వహిస్తున్నాడు. ఇందులో పుప్పాలగూడకు చెందిన బిందు బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. ఇందులో చట్టవిరుద్ధంగా క్రాస్ మసాజ్ చేయించడమేగాక వ్యభిచార దందా సైతం చేస్తున్నాడు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలోని బృందం దాడి చేసి శంకర్‌తో పాటు బిందును అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసును జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. -
ప్రభుత్వ బ్యాంకులకు రూ.1.9 లక్షల కోట్లు కావాలి
♦ 2019 మార్చి నాటికి దీన్ని సమకూర్చాల్సిందే... ♦ బ్యాంకుల మూలధన అవసరాలపై ఎస్ అండ్ పీ అంచనా న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకులకు 2019 మార్చి నాటికి రూ.1.9 లక్షల కోట్ల (29.6 బిలియన్ డాలర్లు) తాజా మూలధనం అవసరమవుతుందని గ్లోబల్ రేటింగ్ సంస్థ– ఎస్ అండ్ పీ అంచనావేసింది. లేదంటే నిరర్థక ఆస్తులకు (ఎన్పీఏ) కేటాయింపులు కష్టతరం అవుతాయని తన తాజా నివేదికలో వివరించింది. మూలధన అవసరాలకు సంబంధించి అంతర్జాతీయ బాసెల్–3 ప్రమాణాల అమలుకూ తాజా మూలధనం అవసరమని విశ్లేషించింది. సంస్థ క్రెడిట్ అనలిస్ట్ గీతా చౌ రూపొందించిన నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ తాజా మూలధనం కల్పించలేని పక్షంలో బలహీనంగా ఉన్న లాభదాయకత... బ్యాంకులపై ఒత్తిళ్లను పెంచుతుంది. ♦ ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ మూలధన అవసరాలను నెరవేర్చుకోడానికి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ♦ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించటంలో భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రధానంగా 3 సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఒకటి ఈక్విటీ విలువలు కనిష్ట స్థాయిలో ఉండటం కాగా రెండోది ఎక్కువ సంఖ్యలో బ్యాంకులుండటం. నియమ నిబంధనల చట్రం మూడవది. అదే సమయంలో అడిషనల్ టైర్–1 క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్ల జారీ ద్వారా నిధుల సమీకరణ కూడా వాటికి కష్టం కావచ్చు. ఈ ఇన్‌స్ట్రుమెంట్లపై డిఫాల్డ్ రిస్క్ అధికంగా ఉండటమే దీనికి కారణం. ♦ ప్రభుత్వ రంగ బ్యాంకులకు మద్దతు విషయంలో ప్రభుత్వ నిబద్ధత సుస్పష్టంగా కనబడుతోంది. ♦ దేశంలో పటిష్ట బ్యాంకింగ్‌కు సానుకూల వాతావరణం కనబడుతోంది. బలహీన ప్రభుత్వ రంగ బ్యాంకులు క్రమంగా తమ మార్కెట్ షేర్‌ను లాభదాయక ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు అలాగే నాన్–బ్యాంక్ ఫైనాన్స్ సంస్థలకు కోల్పోయే వీలుంది. -
లాభాల బాటలోకి పంజాబ్ నేషనల్ బ్యాంక్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ తిరిగి లాభాలబాటలోకి ప్రవేశించింది. 2017 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 262 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో బ్యాంకు రూ. 5,361 కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. నష్టాల్లోంచి లాభాల్లోకి మళ్లడంతో పాటు ఎన్పీఏలను బ్యాంకు తగ్గించుకోగలిగింది. స్థూల ఎన్పీఏలు 12.90 శాతం నుంచి 12.53 శాతానికి, నికర ఎన్పీఏలు 8.61 శాతం నుంచి 7.81 శాతానికి తగ్గాయి. బ్యాంకు నికర వడ్డీ ఆదాయం భారీగా 33 శాతం పెరిగి రూ. 3,684 కోట్లకు పెరగడంతో మొత్తం ఆదాయం రూ. 12,669 కోట్ల నుంచి రూ. 14,989 కోట్లకు చేరింది. కేటాయింపులు తగ్గడంతో... తమ ఎన్పీఏలు తగ్గడంతో మొండి బకాయిలకు కేటాయింపుల్ని రూ. 10,773 కోట్ల నుంచి రూ. 4,910 కోట్లకు తగ్గించుకోగలిగినట్లు బ్యాంకుకు కొత్తగా నియమితులైన మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ మెహతా చెప్పారు. కొన్ని రుణ ఖాతాల్ని పునర్వ్యవస్థీకరించామని, పెద్ద మొండి బకాయిలున్న ఖాతాల్ని పరిష్కరించేదిశగా ‘వార్ రూమ్’ను ఏర్పాటుచేశామని ఆయన వివరించారు. అలాగే బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపర్చుకోవడానికి నాన్–కోర్ ఆస్తుల్ని విక్రయించాలని యోచిస్తున్నామని, ప్రస్తుతానికి మార్కెట్ నుంచి మూలధనాన్ని సమీకరించే ఆలోచన ఏదీ లేదని ఆయన చెప్పారు. రిటైల్, ఎంఎస్ఎంఈ, వ్యవసాయ రంగాల నుంచి మంచి డిమాండ్ వున్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణవృద్ధి 10–12 శాతం వుండవచ్చని అంచనావేస్తున్నామన్నారు. -
ఆంధ్రాబ్యాంకు లాభం 32% డౌన్
మార్చి క్వార్టర్లో రూ.35 కోట్లు... పెరిగిన నిరర్ధక ఆస్తుల భారం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొండి బకాయిలు అధికమవడంతో మార్చి త్రైమాసికంలో ఆంధ్రాబ్యాంకు నికర లాభం క్రితం ఏడాదితో పోలిస్తే గణనీయంగా పడిపోయింది. ఈ కాలంలో నికర లాభం 32 శాతం తగ్గడంతో రూ.35 కోట్లు నమోదు చేసింది. క్యూ4లో మొత్తం ఆదాయం రూ.5,124 కోట్ల నుంచి రూ.5,425 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 12.3 శాతం అధికమై రూ.1,685 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్ 3.1 నుంచి 3.59 శాతానికి పెరిగింది. నిర్వహణ లాభం 22.3 శాతం అధికమై 1,434 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరంలో.. 2016–17లో నికర లాభం అంత క్రితం కాలంతో పోలిస్తే 68 శాతం పడిపోయి రూ.174 కోట్లకు తగ్గింది. ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.19,199 కోట్ల నుంచి రూ.20,336 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 3.9 శాతం పెరిగి రూ.5,532 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్ 3.18 నుంచి 3.07 శాతంగా ఉంది. నిర్వహణ లాభం 10.8 శాతం పెరిగి రూ.4,388 కోట్లుంది. గుదిబండగా ఎన్పీఏలు.. బ్యాంకు నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) గణనీయంగా పెరిగాయి. స్థూల ఎన్పీఏలు 8.39 శాతం నుంచి 12.25 శాతానికి చేరి రూ.17,670 కోట్లకు ఎగిసాయి. నికర ఎన్పీఏలు 4.61 నుంచి 7.57 శాతంతో రూ.10,355 కోట్లకు చేరాయి. మొండి బకాయిల కోసం చేసిన కేటాయింపులు మార్చి త్రైమాసికంలో 24.7 శాతం పెరిగి రూ.1,399 కోట్లకు చేరుకున్నాయి. ఆర్థిక సంవత్సరంలో ఇవి 23.2 శాతం ఎగసి రూ.4,214 కోట్లుగా ఉన్నాయి. కాగా, మొత్తం వ్యాపారం 9.3 శాతం పెరిగి రూ.3,39,673 కోట్లను తాకింది. మొత్తం డిపాజిట్లు 12.1 శాతం అధికమై రూ.1,95,441 కోట్లకు చేరుకున్నాయి. -
మొండిబాకీల చికిత్సకు ఆర్డినెన్స్
♦ బ్యాంకింగ్ నియంత్రణ చట్ట సవరణల ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర ♦ ఉక్కు విధానానికి లైన్‌క్లియర్ ♦ రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండిబకాయిల సమస్య పరిష్కారం దిశగా.. బ్యాంకింగ్ రంగ నియంత్రణ చట్టంలో సవరణల ఆర్డినెన్స్ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఆర్డినెన్స్ వివరాలు వెల్లడి కాలేదు. బ్యాంకింగ్ రంగంపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ .. మరిన్ని వివరాలు వెల్ల డించడానికి నిరాకరించారు. ‘ఏదైనా ప్రతిపాదనను రాష్ట్రపతి పరిశీలనకు పంపినప్పుడు అది ఆమోదం పొందేదాకా వివరాలు బహిర్గతం చేయకూడదనే సంప్రదాయం ఉంది. రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత వివరాలు వెల్లడించడం జరుగుతుంది‘ అని ఆయన చెప్పారు. పార్లమెంటు సమావేశాలు ప్రస్తుతం జరగడం లేదు కాబట్టి... చట్ట సవరణలకు ఆర్డినెన్స్‌ను ప్రతిపాదించడం జరిగిందని, దీనికి రాష్ట్రపతి తక్షణమే ఆమోదముద్ర వేయొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. గురువారం అధికారిక ప్రకటన రావొచ్చని పేర్కొన్నాయి. భారీ మొండిబాకీల సమస్య గరిష్టంగా 50 కంపెనీలకు పరిమితమై ఉండొచ్చని జైట్లీ గతంలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు రూ. 6 లక్షల కోట్ల మేర మొండి బకాయిలు పేరుకుపోయిన సంగతి తెలిసిందే. 35 ఏ సెక్షన్ సవరణ..: సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం– ఆర్డినెన్స్ మార్గంలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 35ఏను సవరించాలన్న ప్రతిపాదనను క్యాబినెట్ ఆమోదించింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే– రుణ ఎగవేతదారుల నుంచి నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ)ను రికవరీ చేసుకోవడానికి బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యక్షంగా ఆదేశాలు ఇవ్వవచ్చు. ప్రజా ప్రయోజనాలు, డిపాజిటర్లకు సంబంధించి బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చే అధికారాలను మాత్రమే ప్రస్తుతం 35ఏ ఆర్బీఐకి కల్పిస్తోంది. బ్యాంక్ అధికారులకు భద్రత: మొండిబకాయి సమస్యల పరిష్కారం కోసం తీసుకునే చర్యలపై... విచారణ సంస్థల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందోన్న భయాలను బ్యాంకింగ్ అధికారుల నుంచి తొలగించేందుకు కూడా సవరణ చట్టం దోహదపడనుంది. ఈ దిశలో వీలు కల్పించడానికి ఆర్బీఐ ఒక ప్రత్యేక రెగ్యులేటరీ విభాగాలను ఏర్పాటు చేసే అధికారం ఆర్బీఐకి లభిస్తుంది. నిర్దిష్ట అకౌంట్‌కు నిర్దిష్ట చర్యను తీసుకునే అధికారం కూడా ఈ చట్ట సవరణతో ఆర్బీఐకి లభిస్తుంది. ప్రస్తుత మార్గదర్శకాలు, నిబంధనల సడలించే వీలుసైతం ఆర్బీఐకి లభిస్తుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఉక్కు విధానం: దేశీయంగా ఉక్కు రంగం ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే దిశగా కేంద్ర కేబినెట్ జాతీయ ఉక్కు విధానం 2017కి ఆమోదముద్ర వేసింది. అలాగే, మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్యను పరిష్కరించే క్రమంలో బ్యాంకింగ్ రంగ నియంత్రణ చట్టానికి సవరణలు చేసేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయడంతో పాటు బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘జాతీయ ఉక్కు విధానం 2017కి కేబినెట్ ఆమోదించింది‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకవైపు బలహీన డిమాండ్ మరోవైపు పెరిగిపోతున్న ముడి వస్తువుల ధరల సమస్యలతో ఉక్కు రంగం సతమతమవుతున్న నేపథ్యంలో నూతన ఉక్కు విధానం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీయంగా కోకింగ్ కోల్ సరఫరా పెంచాలని, 2030–31 నాటికి ఉక్కు ఉత్పత్తి 300 మిలియన్ టన్నుల స్థాయికి పెంచుకోవాలని ఇందులో నిర్దేశించుకున్నారు. 2015–16లో ముడి ఉక్కు ఉత్పత్తి 89.77 మిలియన్ టన్నులుగా నమోదైంది. ప్రభుత్వ సంస్థలు తమ అవసరాలకు దేశీయంగా తయారైన ఇనుము, ఉక్కు ఉత్పత్తులకే ప్రాధాన్యమివ్వాలని కొత్త పాలసీలో ప్రతిపాదించారు. 3 హోటల్స్ నుంచి ఐటీడీసీ నిష్క్రమణ... భోపాల్, భరత్పూర్, గువాహటిలోని మూడు హోటల్స్‌లో ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐటీడీసీ) వాటాల విక్రయ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం అశోక్ భోపాల్, బ్రహ్మపుత్ర అశోక్ హోటల్స్‌లో ఐటీడీసీ తనకున్న 50% వాటాలను మధ్యప్రదేశ్, అసోం రాష్ట్రాల ప్రభుత్వాలకు విక్రయించనుంది. -
ప్రభుత్వ బ్యాంకుల కోసం త్వరలో ‘ఇంద్రధనుష్ 2.0’
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థికంగా పరిపుష్టం చేసి, బాసెల్–3 మూలధన నిబంధనలకు అనుగుణంగా వాటిని రీక్యాపిటలైజేషన్ చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ఇంద్రధనుష్ 2.0’ అనే సమగ్ర పథకాన్ని ప్రకటించనుంది. ఆర్బీఐ నిర్వహిస్తున్న బ్యాంకుల ఆస్తుల నాణ్యత సమీక్ష (ఏక్యూఆర్) మార్చి చివరి నాటికి పూర్తవుతుందని, అనంతరం ఇంద్రధనుష్ 2.0ను ఖరారు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల ఖాతాల ప్రక్షాళనకు ఆర్బీఐ ఆస్తుల నాణ్యత సమీక్షను 2015 డిసెంబర్లో చేపట్టింది. ఇందులో భాగంగా రుణాలు చెల్లించడంలో విఫలమైన పెద్ద ఖాతాలను నిరర్థక ఆస్తులుగా (ఎన్పీఏ) గుర్తించి, అందుకు తగిన మొత్తంలో నిధుల కేటాయింపులను ఖాతాల్లో చూపించాలని కోరింది. ఇందుకోసం 2017 మార్చిని గడువుగా విధించింది. ఆర్బీఐ చేపట్టిన ఆస్తుల నాణ్యత సమీక్ష ముగిసిన వెంటనే ఇంద్రధనుష్ 2.0 కింద బ్యాంకులకు సంబంధించి సవరించిన మూలధన కార్యక్రమాన్ని ప్రకటించడం జరుగుతుందని ఆర్థిక శాఖ వెల్లడించింది. 2015లో ప్రభుత్వం ప్రకటించిన ఇంద్రధనుష్ రోడ్ మ్యాప్ ప్రకారం నాలుగేళ్ల కాల వ్యవధిలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల సాయం అందుతుంది. బాసెల్–3 మూలధన అవసరాలకు, అంతర్జాతీయ రిస్క్ నిబంధనలకు అదనంగా ప్రభుత్వ సాయానికి అదనంగా బ్యాంకులు రూ.1.1 లక్షల కోట్లను మార్కెట్ నుంచి సమీకరించుకోవాల్సి ఉంటుంది.