Banjara Hills: మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం.. | Prostitution in guise of massage center at Hyderabad - Sakshi
Sakshi News home page

Banjara Hills: మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం

Aug 29 2023 9:54 AM | Updated on Aug 29 2023 10:36 AM

Prostitution in Massage Center At Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లో ఉన్న ది వెల్వెట్‌ స్పాలో మసాజ్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం

హైదరాబాద్: మసాజ్‌ కేంద్రాలు, స్పాల ముసుగులో వ్యభిచారానికి పాల్పడుతున్న రెండు కేంద్రాలపై బంజారాహిల్స్‌ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని హెవెన్‌ ఫ్యామిలీ స్పాలో కొంత కాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఇక్కడ దాడులు నిర్వహించి అయిదుగురు సెక్స్‌ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు కె.నీలిమ, ఎన్‌.కార్తీక్‌లపై కేసు నమోదు చేశారు.  

ది వెల్‌వెట్‌ స్పాపై... 
బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లో ఉన్న ది వెల్వెట్‌ స్పాలో మసాజ్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో పట్టుబడ్డ నలుగురు సెక్స్‌ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు జ్యోతి బజాజ్, సయ్యద్‌ యూసుఫ్‌ బాషాలపై కేసు నమోదు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement