Bhavanipuram Police Raided a Spa Center Where Prostitution Was Being Conducted - Sakshi
Sakshi News home page

స్పా ముసుగులో వ్యభిచారం.. 11 మంది యువతులను

Published Thu, Aug 17 2023 1:14 AM | Last Updated on Sun, Aug 20 2023 3:14 PM

- - Sakshi

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న స్పా సెంటర్‌పై భవానీపురం పోలీసులు దాడి చేశారు. నిర్వాహకురాలిని అరెస్ట్‌చేసి, 11 మంది యువతులను హోంకు తరలించారు. పోలీసుల కథనం మేరకు.. భవానీపురం బైపాస్‌ రోడ్డు దియాస్‌ బార్‌ సమీపంలోని ఓ భవనంలో నగరానికి చెందిన సంపర శ్రీవిద్య తనిష్క బ్యూటీ వరల్డ్‌ అండ్‌ స్పా నిర్వహిస్తోంది.

స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో స్పా సెంటర్‌పై పోలీసులు దాడిచేశారు. సంపర శ్రీ విద్య, ఆమె భర్త సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. దాడి సమయంలో స్పా సెంటర్‌లో 11 మంది యువతులు, ముగ్గురు విటులు ఉన్నారు.

స్పా సెంటర్‌ నిర్వాహకురాలు శ్రీవిద్య, ఆమె భర్త సత్యనారాయణపై కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపి నట్లు సీఐ సలాం తెలిపారు. 11 మంది యువతులను కౌన్సెలింగ్‌ నిమిత్తం హోంకు తరలించినట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement