ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, భీమవరం (ప్రకాశం చౌక్): మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న పట్టణంలోని ఓ మసాజ్ సెంటర్‌పై శుక్రవారం రాత్రి దాడి చేసి నిర్వాహకులు, ఏడుగురు మహిళలు, ఒక విటుడిని అరెస్ట్ చేసినట్లు భీమవరం డీఎస్పీ బి.శ్రీనాథ్ చెప్పారు. శనివారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు.
భీమవరం టూటౌన్ సీఐ బి.కృష్ణకుమార్, సీసీఎస్ సీఐ ఎ.రఘుకు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఉప్పాడ రవిప్రకాష్ అదేశాల మేరకు శుక్రవారం రాత్రి పట్టణంలోని టూటౌన్ ఏరియా కెనరా బ్యాంక్ సమీపంలో ఏ9 బ్యూటీ సెలూన్, స్పాపై దాడి చేశారన్నారు. దీనిలో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన బురద ఝాన్సీలక్ష్మి అలియాస్ నందినితో సహా ఏడుగురు మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరి నుంచి రూ.31,500 నగదు, చెక్కు బుక్, స్వైపింగ్ మెషిన్ వస్తువులను సీజ్ చేశామన్నారు.
చదవండి: (Hyderabad: అర్థరాత్రి తప్పతాగి ఎస్‌ఐని ఢీకొట్టారు.. తీవ్రగాయాలతో..)
స్పా నిర్వహణలో ఝూన్సీలక్ష్మీతోపాటు పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన ఇంటి రాహూల్ కూడా ఉన్నట్లు గుర్తించామని, ఇతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిర్వాహకురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారన్నారు. మిగిలిన ఏడుగురు అమ్మాయిలను విజయవాడ హోమ్‌కు తరలిస్తామన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మసాజ్, స్పా సెంటర్లపై నిఘా ఏర్పాటు చేశామన్నారు. వీటిపై పర్యవేక్షణ, అకస్మాతు దాడులకు ప్రత్యేక బృందాలను నియమించామన్నారు.
ఇటీవల ఓ స్పా సెంటర్‌పై కూడా దాడి చేసి అక్కడ వ్యభిచారం చేస్తున్న వారి కూడా అదుపులోకి తీసుకుని, కేసులు నమోదు చేశామన్నారు. ఈ రెండు మసాజ్, స్పా సెంటర్‌లపై సకాలంలో దాడులు నిర్వహించి అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని చాకచక్యంగా పట్టుకున్న సీఐలు కృష్ణకుమార్, రఘు, సిబ్బందిని డీఎస్పీ అభనందించారు. వీరికి అవార్డు, రివార్డుల కోసం ఎస్పీకి సిఫారసు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐ బి.కృష్ణకుమార్, ఎస్సై వి.రాంబాబు పాల్గొన్నారు.
చదవండి: (పెళ్లింట విషాదం.. కొద్దిక్షణాల్లో పెళ్లనగా పెళ్లికుమార్తె ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment