శరీరంలో కొవ్వును కరిగించుకునే ప్రక్రియలో అనేకమంది చాలా చేదు అనుభవాలున్నాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా కొవ్వును కరిగించే ఇంజెక్షన్లు తీసుకొని ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉండాలన్న ఒక మహిళ కల పీడకలగా మిగిలిపోయింది. స్వయంగా శరీరాన్ని తినేసే అరుదైన బాక్టీరియాతో జీవన్మరణ పోరాటం చేస్తున్న మాజీ స్విమ్‌సూట్ మోడల్, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ గాథ ఒకటి వైరల్ అవుతోంది.
ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ బీట్రిజ్ అమ్మ ఫాట్‌ను కరిగించుకునే క్రమంలో లాస్ ఏంజెల్స్ లోని ఒక లగ్జరీ స్పాను సంప్రదించింది. విటమిన్ ఇంజెక్షన్లు భారీ తీసుకునేది. విటమిన్ బీ1, సీ మిశ్రమంగా "వేగంగా కరిగిపోయే" డియోక్సికోలిక్ యాసిడ్‌తో కలిపి 60 ఇంజక్షన్లు తీసుకుంది. చేతులు, పిరుదులు, కడుపులోకి వీటిని తీసుకుంది. దాదాపు 66వేల కంటే ఎక్కువే ఖర్చుపెట్టింది. కొవ్వు కరగడం సంగతి ఏమోగానీ ఇపుడు అరుదైన మైకోబాక్టీరియం అబ్సెసస్ అనే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకి నరక యాతన అనుభవిస్తోంది. ఇంజెక్షన్ తీసుకున్న ప్రతీ చోట భయంకరమైన పుండ్లతో భరించలేని భాధ పడుతోంది. దాదాపు మంకీ పాక్స్ లాంటి గాయాలతో ఆ బాక్టీరియా శరీరం మొత్తాన్ని తినేస్తోంది. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’)
డియోక్సికోలిక్ యాసిడ్ సరిగ్గా ఇంజెక్ట్ చేయకపోవడం వల్లే ఇది జరిగిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో బాక్టీరియా బారిన పడి కుళ్ళిపోయిన చర్మాన్ని తొలగించేందుకు పలు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ప్రతీ రోజూ ఆరు గంటల ఇంట్రావీనస్ యాంటీ బయాటిక్స్‌ను భరిస్తోంది. (హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం)
మంచానికే పరిమితమై ప్రాణం నిలుపుకునేందుకు ఆరాటపడుతోంది. ఒకరి సాయం లేకుండా రెస్ట్‌రూమ్‌కి వెళ్లలేక..కనీసం లేచి నిలబలేక ఇలా అన్నింటికి మరొకరి మీద ఆధారపడి బతుకేదాన్ని..శరీరం మంచం మీదే కుళ్ళిపోతోంది అంటూ తన అనుభవాన్ని పంచుకుంది బీట్రిజ్. అద్దంలో చూసుకున్న ప్రతిసారీ, జీవితంలో సాధించాలని కలగన్నదో, ఇపుడు ఏమి కోల్పోయిందో గుర్తు చేసుకుని బోరున విలపించింది. అటు వైద్యులు కూడా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉండాలనే కలను వదులుకోండి ఇది జీవితాంతం మిమ్మల్ని వదలదని తెగేసి చెప్పారు. అంతేకాదు ఇతరులను భయపెట్టకుండా బహిరంగ ప్రదేశాల్లో బికినీలు ధరించ వద్దని కూడా సలహా ఇచ్చారు.
కానీ ఇక్కడే బీట్రీజ్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. ఇక నా శరీరం పోరాడలేదు ఓడిపోయింది..ఇక చనిపోతాను అనుకున్న క్షణంలో ధైర్యాన్ని కూడ దీసుకుంది. మాంసాన్ని తినేసే వికృతమైన, భయంకరమైన ఈ బాక్టీరియా గురించి అవగాహన పెంచేందుకు తన శాయశక్తులా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే బాడీ పాజిటివిటీ మూవ్‌మెంట్‌ను మొదలు పెట్టింది. మన శరీరంలో ఎన్ని వైరుధ్యాలు, ప్రతికూలతలు, మచ్చలున్నా భయపడకుండా, ఆత్మన్యూనతతో దాచు కోకుండా శరీర ఆకృతితో సంబంధం లేకుండా అంతర్గతంగా, బాహ్యంగా అందంగా ఉండాలని పిలుపు నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment