Hyderabad: బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పా ముసుగులో వ్యభిచారం | Obscene Activities At Banjara Hills Spa Centre - Sakshi
Sakshi News home page

Hyderabad: బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పా ముసుగులో వ్యభిచారం

Sep 2 2023 11:22 AM | Updated on Sep 2 2023 11:55 AM

Obscene Activities At Banjara Hills Spa Centre - Sakshi

హైదరాబాద్: నగరంలో స్పాలు, మసాజ్ సెంటర్ల పై సిఎస్ పోలీస్ యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ మెరుపు దాడులకు దిగింది. సీసీఎస్ టీమ్‌తో కలిసి బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. శనివారం బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మసాజ్ సెంటర్లపై యాంటీ ట్రాఫికింగ్ సెల్ దాడులు చేసింది.

నిబంధనలకు విరుద్ధంగా స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు, క్రాస్ మసాజ్ లకు పాల్పడుతున్నట్లు తేలింది. సీసీ కెమెరాలు లేకపోవడం.. రిజిస్టర్‌లో కస్టమర్ల వివరాలు రాయక పోవడం లాంటి ఉల్లంఘనలకు పాల్పడిన నిర్వాహకుల మీద కేసు నమోదు చేశారు. మేఘవి వెల్నెస్ స్పా, రువాన్ థాయ్ స్పా, సెన్సెస్ ట్రాంక్విల్ ది హెల్త్ స్పా, కానస్ లగ్జరీ స్పా, బోధి వెల్నెస్ స్పా సెంటర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement