Obscene act
-
Hyderabad: బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పా ముసుగులో వ్యభిచారం
హైదరాబాద్: నగరంలో స్పాలు, మసాజ్ సెంటర్ల పై సిఎస్ పోలీస్ యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ మెరుపు దాడులకు దిగింది. సీసీఎస్ టీమ్తో కలిసి బంజారాహిల్స్, ఫిల్మ్నగర్లో యాంటీ ట్రాఫికింగ్ సెల్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. శనివారం బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మసాజ్ సెంటర్లపై యాంటీ ట్రాఫికింగ్ సెల్ దాడులు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు, క్రాస్ మసాజ్ లకు పాల్పడుతున్నట్లు తేలింది. సీసీ కెమెరాలు లేకపోవడం.. రిజిస్టర్లో కస్టమర్ల వివరాలు రాయక పోవడం లాంటి ఉల్లంఘనలకు పాల్పడిన నిర్వాహకుల మీద కేసు నమోదు చేశారు. మేఘవి వెల్నెస్ స్పా, రువాన్ థాయ్ స్పా, సెన్సెస్ ట్రాంక్విల్ ది హెల్త్ స్పా, కానస్ లగ్జరీ స్పా, బోధి వెల్నెస్ స్పా సెంటర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. -
అశ్లీల చిత్రాలకు బానిసై నా భర్త..
క్రైమ్: ఆ భర్త పో* చిత్రాలకు బానిసైపోయాడు. రోజులో గంటల తరబడి వాటినే చూస్తూ ఉండిపోసాగాడు. ఈ క్రమంలో అతనికి ఫాంటసీ ఆలోచనలు వచ్చాయి. తన భార్యనూ ఆ అశ్లీల చిత్రాల్లో నటించేవాళ్ల మాదిరే రెడీ కావాలంటూ ఒత్తిడి చేశాడు. చివరకు.. ఈ వ్యవహారం పోలీసుల చెంతకు చేరింది. దేశ రాజధానిలో ఈ ఘటన జరిగింది. అశ్లీలతకు బానిసైన తన భర్త.. పోర్న్ స్టార్స్ మాదిరే దుస్తులు వేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ మహిళ(30). 2020లో ఆమె వివాహం జరిగిందట. అయితే అత్తింటి వాళ్లు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించిన ఆమె.. ఫిర్యాదులో తన భర్త నిర్వాకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో విషయం వెలుగు చూసింది. ఈ మేరకు ఐపీసీ సెక్షన్లు 34, 498ఏ, 406తో పాటు 377 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ రోహిత్ మీనా మీడియాకు వెల్లడించారు. ఇదీ చదవండి: కూతురు ప్రేమపెళ్లి.. సర్పంచ్ వీరంగం -
హనుమంతుడి ముందు.. ఇలాంటి పనులా?!
భోపాల్: బీజేపీ చేష్టలపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తీవ్రంగా మడిపడుతోంది. హనుమంతుడి విగ్రహం ఏర్పాటు చేసి, ఆ విగ్రహ సమక్షంలోనే మహిళలకు బాడీ బిల్డింగ్ పోటీలు ఏర్పాటు చేయించింది బీజేపీ. అయితే అందులో వాళ్ల వస్త్రధారణ బికినీలతో ఉండడంతో.. దేవుడి విగ్రహం ముందు, అదీ అసభ్యతను ప్రొత్సహించడమేంటని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. సోమవారం రత్లాంలో బాడీ బిల్డింగ్ జరిగిన వేదికకు వెళ్లి మరీ హనుమాన్ విగ్రహాన్ని గంగా జలంతో శుద్ధి చేశాయి కాంగ్రెస్ శ్రేణులు. అనంతరం హనుమాన్ చాలీసా పఠించాయి. హనుమంతుడి ముందు ఇలాంటి అసభ్య వేషాలేంటని మండిపడుతున్నారు వాళ్లు. ఈ ఘటనకు కారకులెవరో వాళ్లను హనుమాన్ భగవానే కఠినంగా శిక్షిస్తాడని తిట్టిపోస్తున్నారు. ఇదిలా ఉంటే.. మార్చి 4, 5వ తేదీల్లో రత్లాంలో మిస్టర్ జూనియర్ బాడీబిల్డింగ్ పోటీలు జరిగాయి. నిర్వాహక కమిటీలో బీజేపీ మేయర్ ప్రహ్లాద్ పటేల్ ఉండగా.. స్థానిక ప్రజాప్రతినిధి చైతన్య కశ్యప్ ఈ ఈవెంట్కు హాజరయ్యారు. ఈ ఈవెంట్కు సంబంధించిన వీడియోలు వార్తల్లో, సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. అయితే.. కాంగ్రెస్ విమర్శలకు బీజేపీ సమాధానం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి మహిళలు క్రీడా రంగంలో రాణించడం ఏమాత్రం ఇష్టం లేదేమో అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి హితేజ్ బాజ్పాయి కౌంటర్ ఇచ్చారు. కుస్తీ, జిమ్నాస్టిక్స్, ఈతలు.. ఇలా ఏ క్రీడల కేటగిరీలోనూ మహిళలు రాణించాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదు. మైదానంలోని మహిళలను పాడు కళ్లతోనే చూస్తారు వాళ్లు. అందుకు వాళ్లకు సిగ్గుండాలి అని విమర్శించారు. అంతేకాదు ఈవెంట్ నిర్వాహకులు కొందరు వేదికపై గంగా జలం జల్లిన కాంగ్రెస్నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు మెమొరాండం సమర్పించారు. ఇక ఈ ఘటనపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ వ్యక్తిగత మీడియా సలహాదారు పీయూష్ బాబెలే స్పందించారు. ఆజన్మ బ్రహ్మచారి అయిన హనుమాన్ భగవాన్ సమక్షంలో.. ఇలాంటి అసభ్యతను ప్రదర్శించడం దారుణమన్నారు. భగవంతుడ్ని అగౌరవపరిచి.. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. बीजेपी नेताओं ने किया हनुमान जी का अपमान : रतलाम में भाजपा के बीजेपी विधायक चैतन्य कश्यप और महापौर प्रह्लाद पटेल ने हनुमान जी की मूर्ति स्टेज पर रखकर अश्लीश कार्यक्रम का आयोजन किया। शिवराज जी, भाजपा बार-बार हिन्दुओं का अपमान क्यों करती है❓ pic.twitter.com/C4FWb2i72N — MP Congress (@INCMP) March 6, 2023 -
అశ్లీల వీడియోలు చూపి అడ్డంగా బుక్కయ్యాడు..
భోపాల్ : చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు పాడు బుద్ధి ప్రదర్శించి కటకటాల పాలయ్యాడు. మధ్యప్రదేశ్లోని పండగోన్ గ్రామంలో మైనర్ బాలికలకు అశ్లీల వీడియోలు చూపిన ఆరోపణలపై ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత విద్యార్థినులు టీచర్ వికృత చేష్టలను తల్లితండ్రులకు వివరించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేశామని ఏఎస్పీ సమీర్ యాదవ్ తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. -
'ప్రైవేటు స్థలాల్లో అసభ్యత నేరం కాదు'
ముంబయి: బహిరంగ ప్రాంతాల్లో కాకుండా ఇతర ప్రదేశాల్లో అసభ్యకర చేష్టలకు పాల్పడటం భారతీయ చట్టం ప్రకారం నేరం కాబోదని బొంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన 13మందికి విముక్తి కల్పించింది. గత ఏడాది డిసెంబర్ 12న ముంబయిలోని అంధేరి పరిధిలోని ఓ ఫ్లాట్ లో చుట్టుపక్కలవారికి ఇబ్బంది కలిగేలా కొందరు వ్యవహరించారు. అశ్లీలాన్ని తలపించేలా దుస్తులు ధరించి ఆరుగురు మహిళలు, పీకల దాకా మద్యం తాగి 13 మంది వ్యక్తులు గట్టిగా మ్యూజిక్ పెట్టుకొని నానారచ్చ చేశారని ఓ పాత్రికేయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ దృశ్యాలు కిటికీలో నుంచి అందరికీ కనిపించి ఇబ్బందిని కలిగించాయంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు సెక్షన్ 294 కింద కేసు నమోదు చేశారు. అయితే, దీనిని బాధితులు కోర్టులో సవాల్ చేయగా ఈ సెక్షన్ కింద కేవలం బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని మాత్రమే శిక్షించగలం తప్ప ప్రైవేటు ప్లేస్ లలో వ్యక్తిగత స్థలాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని శిక్షించే వెసులుబాటు లేదని కోర్టు తెలిపింది.